Horoscope Today 30th August 2022


మేషం 
ఈ రోజు ఉద్యోగులకు కార్యాలయంలో సాధారణంగానే ఉంటుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మనస్సులో ఏదో అశాంతి నిండిఉంటుంది. ఆవేశం తగ్గించుకోండి. 


వృషభం
ఈ రాశివారు మొండి వైఖరిని వీడకపోతే చాలా నష్టపోతారు. అతిగా తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది. వ్యాపారులకు పెట్టుబడులకు అనుకూలమైన రోజు. స్నేహితులు లేదా బంధువులతో వివాదం జరగొచ్చు.. మాట తూలకుండా జాగ్రత్త పడండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. 


మిథునం
ఈ రోజు మిథున రాశివారు ఏం అనుకున్నా నెరవేరుతుంది. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు అస్సలు తీసుకోవద్దు. మారుతున్న వాతావరణం ప్రభావం మీ ఆరోగ్యంపై ఉండొచ్చు. జీవితంలో కొన్ని మార్పులు సంతోషాన్ని ఇస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు పెద్దగా మార్పులుండవు.


కర్కాటకం
మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అనుకోని ఖర్చులు పెరగుతాయి. మీకు అత్యంత సన్నిహితమైనవారిని అపార్థం చేసుకునే  అవకాశం ఉంది. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. నిత్యం సూర్యుడిని ప్రార్థించండి.


Also Read: బానపొట్ట, పెద్ద చెవులు, చిన్న కళ్లు -వినాయకుడి రూపం వెనుకున్న పరమార్థం ఇదే!


సింహం 
ఈ రోజు సింహ రాశి వారు తమ పనిలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. వ్యాపారులు అప్రమత్తంగా లేకుంటే నష్టపోవచ్చు. కార్యాలయంలో ఉద్యోగులకు సీనియర్ అధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రేమికులకు మంచి రోజు.


కన్య
కెరీర్‌లో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఇంటా బయటా  ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు తలనొప్పితో బాధపడతారు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. కుటుంబానికి సమయం కేటాయించండి.


తుల 
ఈ రోజు తుల రాశి వారికి గౌరవం పెరుగుతుంది. మీ ప్రియమైన వారితో సామరస్యంగా నడుచుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణంలో కొందరు ముఖ్య వ్యక్తులు కలుస్తారు.


వృశ్చికం
ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్యాలయంలోని వ్యక్తులు మీ పనితీరుని మెచ్చుకుంటారు. సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించడం మంచిది.


Also Read: అష్టకష్టాలు తీర్చే అష్ట వినాయకులు, ఒక్కసారైనా దర్శించుకుంటే చాలు


ధనుస్సు 
ఈ రాశి ఉద్యోగులు   కార్యాలయంలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలుంటాయి. సాయంత్రం అయ్యేసరికి అనారోగ్యంగా ఉన్నట్టు అనిపిస్తుంది. 


మకరం
ఈ రాశివారు ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ప్రతి పనీ ఓపికతో చేయండి


కుంభం
ఈ రోజు కుంభ రాశి వారు తమ బిజీ రొటీన్ నుంచి కొంత సమయాన్ని కుటుంబం కోసం వెచ్చిస్తారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ సంబంధాలు బలంగా ఉంటాయి.ఉద్యోగులు, వ్యాపారులు,విద్యార్థులకు మంచి రోజు.


మీనం 
ఈరోజు మీరు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవలసి రావొచ్చు. కెరీర్లో పురోగతికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ మొండి స్వభావం కారణంగా కొన్ని తప్పులు చేస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి.