బిజీ బిజీ లైఫ్ నుంచి కొద్దిగా విరామం తీసుకుని చాలా మంది లాంగ్ డ్రైవ్ కి షికారుకు వెళ్తుంటారు. ఆఫీసు పని ఒత్తిళ్లకు దూరంగా ఇష్టమైన ప్రదేశానికి వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తే వచ్చే ఆ ఆనందమే వేరు. బైక్ లేదా కారులో వెళ్తూ ఫ్రెండ్స్ తో వెళ్తుంటే వచ్చే కిక్కే వేరబ్బా. అంత బాగుంది కానీ ఒక్కటే సమస్య. ఏం తినాలి? రోడ్డు పక్కన ఉండే దాబాల్లో, ఎక్కడపడితే అక్కడ దొరికిన చిరుతిండి తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చేస్తాయి. కడుపు కూడా గడబిడ చేసేస్తుంది. అందుకే మనం రోడ్ ట్రిప్ కి వెళ్తున్నపుడు తినాల్సిన ఆహారం విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. చాలా మందికి తమతో పాటు ఏం స్నాక్స్ తీసుకుని వెళ్లాలో అర్థం కాదు. అందుకే మీ కోసం కొన్ని ఆరోగ్యకరమైన స్నాక్స్ గురించి చెప్పబోతున్నాం. మీతో పాటు ప్రయాణంలో వీటిని కూడా తీసుకెళ్ళి తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.


మ్యుసెల్లి బార్స్


మ్యుసెల్లితో తయారు చేసిన స్నాక్స్ మీకు మంచి ఆరోగ్యంతో పాటు శక్తిని కూడా పెంచుతాయి. ఎంతో రుచిగా ఉండే వీటిలో ఓట్స్  తో పాటు డ్రై ఫ్రూట్స్ కూడా ఉపయోగిస్తారు. రోడ్ ట్రిప్ కి వెళ్లేటప్పుడు చాలా సులభంగా తయారు చేసుకునే చిరుతిండి ఇది. బయట మార్కెట్లో కూడా ఇవి లభిస్తాయి. వీటితో మీ విహార యాత్రని ఆరోగ్యవంతంగా చేసుకోండి. ఈ ఫైబర్ రిచ్ పోషకాలతో నిండిన స్నాక్ తీసుకోవడం వల్ల గుండెకి మేలు చేస్తుంది.


పీనట్ బటర్ గ్రనోలా


ఫైబర్ రిచ్ ఓట్స్, ప్రోటీన ప్యాక్డ్ పీనట్ బటర్, క్రంచి రోస్ట్ చేసిన వేరుశెనగ పప్పులతో తయారు చేసే ఈ స్నాక్ లో శరీరానికి అవసరమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యకరమైన చిరుతిండి ఇది. వేరుశెనగ, బటర్ తో తయారు చేసిన ఈ బార్స్ నోటికి ఎంతో రుచిగా ఉంటాయి.


ప్రోటీన్ బార్స్


ఫైబర్ నిండిన ఆరోగ్యకరమైన చిరుతిండి. ఓట్స్, డ్రై ఫ్రూట్స్, గింజలతో తయాఉ చేసే ఈ బార్స్ చాలా హెల్తీ. దీన్ని తినడం వల్ల బోలెడన్ని ప్రోటీన్స్ అందుతాయి. రోడ్ ట్రిప్ సమయంలో తక్షణ శక్తిని ఇవి అందిస్తాయి. బయట మార్కెట్లో కూడా ఇవి అందబాటులో ఉంటాయి. ఇంట్లో కూడా చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, ఓట్స్ కలుపుకుని రెడీ చేసుకోవచ్చు.


మిక్సడ్ డ్రై ఫ్రూట్


బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, ఎండు ఖర్జూరం, అంజీరా, పిస్తా పప్పులు మొదలైన డ్రై ఫ్రూట్స్ తో కలిపు ఈ మిక్సడ్ డ్రై ఫ్రూట్ సలాడ్ చేసుకోవచ్చు. విభిన్న రుచులు కలిగిన ఈ సలాడ్ లో కొద్దిగా మసాలా కూడా జోడించుకోవచ్చు. ప్రయాణాల సమయంలో వెంట తీసుకెళ్లేందుకు అధ్బుతమైన స్నాక్ గా ఇది ఉపయోగపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచి గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.


గ్రనోలా కుకీస్


ఓట్స్ తో తయారు చేసే ఈ కుకీస్ చాలా రుచిగా ఉంటాయి. ఇవి మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. పొట్ట నిండుగా అనిపిస్తుంది. క్రంచీగా చాలా బాగుంటాయి.


హమ్మస్ అండ్ క్యారెట్


పొట్ట నించుగా ఉంచేందుకు ఆకలి పెరగకుండా చేసేందుకు ఈ హమ్మస్ అండ్ క్యారెట్ బాగా ఉపయోగపడతాయి. ప్రోటీన్ ప్యాక్డ్ ఫైబర్ రిచ్, ఎన్నో పోషక విలువలు కలిగిన సూపర్ టేస్టీ స్నాక్ ఇది. హమ్మస్ లో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. అలసటని తగ్గించి శక్తిని పెంచుతుంది. ఎక్కువసేపు ప్రయాణంలో గడిపే మీకు ఇది అద్భుతమైన చిరుతిండి. హమ్మస్ లో క్యారెట్ ముక్కలు డిప్ చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.


మఖానా


రోడ్డు ప్రయాణాల సమయంలో తినేందుకు అనువైన చిరుతిండి ఇది. ఎంతో రుచికరంగా ఉండే వీటిని కొద్దిగా ఉప్పు, కారం చల్లుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి. వీటిల్లో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. మానసిక, శారీరక ఉత్సాహాన్ని పెంచడానికి మఖానా మంచి ఎంపిక.


Also Read: గర్భం ధరించారా? ఈ జాగ్రత్తలు తీసుకోవడం తప్పని సరి


Also Read: బరువు తగ్గాలన్నా, జుట్టు పెరగాలన్నా అంజీరా తినెయ్యండి - మరెన్నో ప్రయోజనాలు