మేషం
ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి. మీ ఆరోగ్యం కొంచెం క్షీణించవచ్చు. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. పోటీ పరీక్షల కోసం విద్యార్థులు బాగా శ్రమించాల్సి ఉంటుంది.
వృషభం
కుటుంబంతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఆరోగ్యం క్షీణించవచ్చు. పెద్దల సలహాలు పాటించండి. ఉద్యోగులకు శుభసమయం.
మిథునం
విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఈ రోజంతా  చాలా ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటారు. మీ ప్రవర్తనను అంతా మెచ్చుకుంటారు. మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.  గౌరవం పెరుగుతుంది. పెట్టుబడులకు అనుకూల సమయం.


Also Read: అసలు గుడికి ఎందుకు వెళ్లాలి, ఇంత పరమార్థం ఉందా..!
కర్కాటకం
చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులను కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కలసి ఏదైనా టూర్ ప్లాన్ చేసుకోంటారు. అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు. కారణం లేకుండా ఖర్చు చేయవద్దు. ఆదాయం బాగానే ఉంటుంది.
సింహం
కొత్త ఆదాయ మార్గాలు ఎంచుకుంటారు. అవసరమైన లావాదేవీలు పూర్తవుతాయి. ప్రమాదకర పనులు చేయవద్దు. అనారోగ్య సూచనలున్నాయి. కార్యాలయంలో పని ఒత్తిడి పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం.
కన్య
వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. వాహనం జాగ్రత్తగా నడపండి లేదంటే గాయాలపాలయ్యే ప్రమాదం ఉంది. మీ వల్ల చాలామంది పనులు జరుగుతాయి. అవసరమైన వారికి సహాయం చేయండి. ఆహారం విషయంలో శ్రద్ధ వహించండి. 


Also Read:  2022 ఈ నాలుగు రాశుల వారికి కొత్తకొత్తగా ఉంటుంది, చాలా సమస్యల నుంచి రిలీఫ్ పొందుతారు..
తుల
అప్పిచ్చిన మొత్తం చేతికందుతుంది. విలువైన వస్తువుల భద్రతపై తగిన శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దినచర్యలో మార్పు ఉండొచ్చు. జూదం, లాటరీకి దూరంగా ఉండండి. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 
వృశ్చికం
తొందరపడి ఎవరితోనూ ఒప్పందాలు చేసుకోకండి. సమీప బంధువులను కలుస్తారు. ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటారు. ఈ రోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. పాత పెట్టుబడులు లాభాన్నిస్తాయి. పిల్లలతో ఎక్కువ సమయం గడపగలుగుతారు.
ధనుస్సు 
వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీ ప్రత్యర్థులపై నిఘా ఉంచండి. చేపట్టిన పనుల్లో మీ జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది, తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. వ్యాపారులు ఓ పనిపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 


Also Read: 2022 లో ఈ నాలుగు రాశులవారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందంటే...
మకరం
ఎవరితోనైనా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు తమ పని తాము చేసకుపోతారు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. 
కుంభం
మీరు బంధువులను కలిసేందుకు వెళతారు, మంచి సమాచారం పొందుతారు. స్నేహితుల నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్పిచ్చేటప్పుడు పూర్తి డాక్యుమెంట్లు పరిశీలించి ఇవ్వండి. బంధువులను కలుస్తారు. 
మీనం
రిస్క్‌తో కూడిన పనులు చేయవద్దు. ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. ఆస్తి విషయంలో వివాదాలు రావొచ్చు. మీ బాధ్యతలన్నింటినీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
Also Read: 2022 లో ఈ నాలుగు రాశుల వారు అన్నింటా విజయం సాధిస్తారు, ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం..
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
Also Read: ఈ రాశుల్లో పుట్టిన పిల్లలు గాడ్ గిఫ్టే... మీ పిల్లలు ఉన్నారా ఇందులో ఇక్కడ తెలుసుకోండి..
Also Read: 1 నుంచి 10వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 11 నుంచి 20వ తేదీ వరకూ పుట్టిన వారి ఆలోచనా విధానం ఇలా ఉంటుంది..
Also Read: 21 నుంచి 31వ తేదీల్లో పుట్టారా.. మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుందో తెలుసుకోండి…
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి