Daily Horoscope Predictions in Telugu


మేష రాశి


ఈ రోజు మీరు పని విషయంలో చాలా స్పృహతో ఉంటారు. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. విదేశాలలో ఉద్యోగం పొందాలి అనుకున్నవారి అడుగులు ముందుకుపడతాయి. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. 


వృషభ రాశి


ఈ రోజు కార్యాలయంలో మీ సహోద్యోగులు మీ పనిలో లోపాలు వెతికే పనిలో పడతారు...మీరు అశ్రద్ధగా వ్యవహరించొద్దు. మీ ఆలోచనలు అనైతిక కార్యక్రమాలవైపు మళ్లే ప్రమాదం ఉంది. ఆదాయంలో పెద్దగా మార్పులుండవు. ఆరోగ్యం బావుంటుంది. 


మిథున రాశి


ఈ రోజు ఇంటి పనులపై పెద్దగా ఆసక్తి చూపించరు. ఏదో విషయంలో నిరాశంగా ఉంటారు. మీ లక్ష్యాల నుంచి మిమ్మల్ని దూరం చేసే ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి.. వాటి నుంచి బయటపడితే కానీ కెరీర్లో వృద్ధి ఉండదు. ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు. యోగా, ధ్యానం చేయండి. 


Also Read: ధనస్సు, మకరం, కుంభం, మీన రాశులవారికి ఈ వారం ( 23 June To 29 June 2024) ఆదాయం, ఆనందం!
 
కర్కాటక రాశి


ఈ రోజు ఈ రాశి వ్యాపారులు పెద్ద ఒప్పందం కుదుర్చుకుంటారు. ఉద్యోగులపై ఒత్తిడి తగ్గుతుంది. కుటుంబంతో సంతోష సమయం స్పెండ్ చేస్తారు. బాధ్యతలపట్ విధేయత చూపిస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు మీపై ఉంటాయి. 


సింహ రాశి


ఈ రోజు మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కార్యాలయంలో స్నేహితుల నుంచి సరైన సహాయం అందుకుంటారు. పనితీరుని మెరుగుపర్చుకోవాలి. నూతన ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఈ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆహారం పట్ల నిరాశక్తత ఉంటుంది. 


కన్యా రాశి


ఈ రోజు వ్యాపారంలో పెద్దగా రిస్క్ తీసుకోకండి. ఉద్యోగులు పనివిషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనవసర కోపాన్ని వీడండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. 


తులా రాశి


ఈ రోజు పాత స్నేహితులను కలుస్తారు. మానసిక ఒత్తిడి కారణంగా మీ లక్ష్యాలపై దృష్టి పెట్టడం మీకు కష్టంగా ఉంటుంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. కొత్తగా పరిచయం అయినవారిని ఎక్కువగా నమ్మేయవద్దు. 


Also Read: జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది! 


వృశ్చిక రాశి 


ఈ రోజు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో విభేదాలు చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. కార్యాలయంలో కొత్త స్నేహితులను పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. 


ధనుస్సు రాశి


ఈ రోజు కొన్ని విషయాలకు సంబంధించి టెన్షన్ ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ప్లాన్ చేసుకుంటారు. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుంటారు...ఆలోచనాత్మకంగా మాట్లాడండి. అనవసర విషయాలపై దృష్టి పెట్టొద్దు. 


మకర రాశి


అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. కుటుంబ సభ్యుల అవసరాలకు డబ్బు ఖర్చు చేస్తారు.  భవిష్యత్తుపై చాలా నమ్మకంగా ఉంటారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. 


Also Read: జూన్ 23 నుంచి జూన్ 29 వారఫలాలు: ఈ 4 రాశుల ఉద్యోగులు, వ్యాపారులు, రాజకీయ నాయకులకు ఈ వారం గ్రహాలు అనుకూలం!


కుంభ రాశి


ఈరోజు ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు.  పని ఒత్తిడి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనుకోని ప్రయాణం చేయాల్సి రావొచ్చు. 


మీన రాశి


ఈ రోజు మీ ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తుల కొనుగోలు గురించి ఆలోచిస్తారు. మీపై కుట్రపన్నాలి అనుకున్న శత్రువుల ప్రయత్నాలు విఫలం అవుతాయి. రోజంతా బిజీగా ఆనందంగా గడిచిపోతుంది. 


గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. మీ  వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.