weekly horoscope 23 june 2024 to 29 june 2024


సింహ రాశి (Leo Weekly Horoscope)


ఈ వారం మీకు గ్రహాలు అనుకూల ఫలితాలనిస్తున్నాయి. వ్యాపారంలో మంచి లాభాలొస్తాయి. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడతారు. ఉద్యోగులు ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం వింటారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలలో మధురానుభూతి ఉంటుంది.  స్నేహితులతో సరదాగా గడుపుతారు..అయితే..మీ సన్నిహితుల్లో ఒకరు మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది అప్రమత్తంగా వ్యవహరించండి. వారాంతంలో పని ఒత్తిడి పెరుగుతుంది. 


కన్యా రాశి  (Virgo Weekly Horoscope)


ఈ వారం మీలో ప్రతిభకు తగిన ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగులు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందడుగు వేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆలోచనలలో సమతుల్యతను కాపాడుకోండి. హోటళ్ల వ్యాపారులకు ఈ వారం చాలా అనుకూలమైనది. పెండింగ్‌లో ఉన్న పనులు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి. వారం ప్రారంభం సాధారణంగా ఉంటుంది కానీ గడిచేకొద్దీ అన్నీ శుభఫలితాలే పొందుతారు. ఆర్థిక సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శని ప్రభావం వల్ల శత్రువు మీపై ఆధిపత్యం చెలాయిస్తారు. వైవాహిక సంబంధాలలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త. 


Also Read: ఈ రాశులవారికి ఈరోజు అనుకోని ఖర్చులు , వైవాహిక జీవితంలో సమస్యలు - జూన్ 23 రాశిఫలాలు


తులా రాశి (Libra Weekly Horoscope)


ఈ వారం ఈ రాశివారు ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్లాన్ చేసుకుంటారు. రాజకీయాలతో సంబంధం ఉండేవారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయడానికి ప్రయత్నించండి... ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆభరణాల కోసం ఎక్కువ డబ్బులు ఖర్చుచేస్తారు. మీ ఆలోచనా విధానం ప్రశంసనీయంగా ఉంటుంది. ఇక రాదు అనుకున్న డబ్బు చేతికందుతుంది..అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది.  ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలకు సంబంధించిన విషయాలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నూతన  వ్యాపారం లేదా ఉద్యోగం ప్రారంభించినట్లయితే..ఆరంభంలో కొన్ని ఒడిదొడుకులు తప్పవు. 


వృశ్చిక రాశి (Scorpio Weekly Horoscope)
 
ఈ వారం మీపై మీరు పూర్తి విశ్వాసంతో ఉంటారు. వ్యాపారులు పెద్ద పెట్టుబడి పెట్టే అవకాశం పొందుతారు. ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ వారం పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువులకోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి..చదువులో ప్రతిభ ప్రదర్శిస్తారు. ఈ రాశి రాజకీయనాయకులపై ప్రజలకు విశ్వసనీయత పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన వల్ల మీరు ప్రయోజనాలు  పొందుతారు. అప్పు ఇవ్వొద్దు..చేయొద్దు. మారుతున్న వాతావరణం కారణంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. స్వార్థపూరిత ఆలోచనలకు దూరంగా ఉండాలి.  


Also Read: భూమ్మీద మొదటి నగరం కాశీ..చివరి నగరం కూడా ఇదే - మనిషిని విశ్వంలో ఐక్యం చేసే వారణాసి సృష్టి ఎలా జరిగిందో తెలుసా!


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.