Daily Horoscope Predictions in Telugu

మేష రాశి 

ఈ రోజు ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధమవడంలో బిజీగా ఉంటారు. ఉద్యోగ, వ్యాపారాలలో అవసరమైన చర్చల్లో పాల్గొంటారు. మీ మాటతీరు అందర్నీ ఆకట్టుకునేలా ఉంటుంది. వైవాహిక జీవితం బావుంటుంది. 

వృషభ రాశి

ఈ రోజు అధిక ఖర్చుల వల్ల ఆందోళన చెందుతారు. వైవాహిక జీవితంలో సమన్వయ లోపం ఉంటుంది. మీ భావాలను వ్యక్తీకరించడానికి రోజు మంచిది కాదు. పాత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగండి. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. 

మిథున రాశి

ఆరోగ్యం బాగుంటుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ ప్రణాళికలన్నీ విజయవంతమవుతాయి. వ్యాపారంలో కూడా ఆశించిన పురోగతి కనిపిస్తుంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న సందేహం ఈరోజు తీరుతుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు

Also Read: భూమ్మీద మొదటి నగరం కాశీ..చివరి నగరం కూడా ఇదే - మనిషిని విశ్వంలో ఐక్యం చేసే వారణాసి సృష్టి ఎలా జరిగిందో తెలుసా!

కర్కాటక రాశి

ఈ రోజు కొన్ని అనారోగ్య సమస్యలు వేధిస్తాయి. సోమరితనం అధికంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి.  కార్యాలయంలో సమస్యల గురించి కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు మీ శ్రమపై మాత్రమే దృష్టి పెట్టాలి. 

సింహ రాశి 

కుటుంబంలో మీ ప్రభావం పెరుగుతుంది. చాలా రోజుల తర్వాత పాత స్నేహితులను కలిసే అవకాశం మీకు లభిస్తుంది. ప్రేమ వివాహానికి సంబంధించి  కుటుంబ సభ్యుల నుంచి సమ్మతి లభిస్తుంది. ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఉన్నత విద్యకు సంబంధించిన ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

కన్యా రాశి

ఈ రోజు మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు. కొనసాగుతున్న పనుల్లో ఆటంకాలు ఉండవచ్చు. ప్రియమైన వారి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది.  ఇంట్లో, బయట కొన్ని ఆందోళనలు ఉంటాయి. మీ దినచర్యను క్రమశిక్షణగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

తులా రాశి 

ఈ రోజు కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ప్రత్యర్థులు మీపై పైచేయి సాధించాలనే ప్రయత్నంలో విఫలం అవుతారు. కార్యాలయంలో  సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కొత్త స్నేహితులు ఏర్పడతారు. రోజంతా చాలా ప్రశాంతంగా ఉంటారు. 

Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!

వృశ్చిక రాశి

మీకు దగ్గరగా ఉన్నవారి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. సహోద్యోగులపై నమ్మకం తగ్గుతుంది. విద్యార్థులు చదువులో కష్టపడాలి. ఎవరిపైనా మీరు ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు. పనితీరు మెరుగుపడుతుంది. 

ధనస్సు రాశి

ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఈ రోజు మంచిరోజు కాదు. సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. వ్యాపారంలో నూతన పెట్టుబడులు పెట్టేందుకు మంచి రోజు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. నూతన పాలసీలో పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించండి.

మకర రాశి

ఇతరులపై ఎక్కువగా ఆధారపడకండి. వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడతాయి.  రోజంతా కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సాయంత్రం ప్రియమైన వారితో చర్చించడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఆరోగ్యం జాగ్రత్త

Also Read: కలి మళ్లీ ఎప్పుడొస్తాడు.. కలియుగం అంతమయ్యాక సత్యయుగ పాలన అయోధ్య కేంద్రగా ఉండబోతోందా!

కుంభ రాశి 

ఈ రోజు మీలో ఆత్మవిశ్వాసం, సానుకూలత పెరుగుతుంది. ప్రియమైన వారితో సంబంధాలు బలపడతాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఉండవచ్చు. ఇతరుల మనోభావాలను గౌరవిస్తారు. 

మీన రాశి 

రోజంతా బిజీగా ఉంటారు. స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని చిక్కుముడులు ఏర్పడతాయి. వృత్తికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబానికి సమయం కేటాయించండి. 

Also Read: రామాయణ, మహాభారత యుద్ధాలకు ఓ కారణం ఉంది..మరి కల్కిని ధర్మసంస్థాపన దిశగా నడిపించిన సందర్భం ఏంటి!

గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.