weekly horoscope 23 june 2024 to 29 june 2024
ధనుస్సు రాశి (Sagittarius Weekly Horoscope)
ఈ వారం ధనస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. గత కొన్నాళ్లుగా ఉన్న ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి. ఉద్యోగులు కార్యాలయంలో పురోగతి సాధించే అవకాశాలను పొందుతారు...అయితే పని విషయంలో బాధ్యతగా వ్యవహరించాలి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. విదేశీ ప్రయాణాల వల్ల ప్రయోజనం పొందుతారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. అనుకున్న ప్రణాళికలను చక్కగా అమలు చేయడంలో విజయం సాధిస్తారు. అతి విశ్వాసం కారణంగా నష్టపోయేప్రమాదం ఉంది. కళారంగంలో ఉండేవారికి కొన్ని ఒడిదొడుకులు తప్పవు. గుర్తుతెలియని వ్యక్తులతో లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అహంకారాన్ని దరిచేరనివ్వొద్దు.
Also Read: జూన్ ఆఖరి వారం మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశులవారికి అద్భుతంగా ఉంటుంది!
మకర రాశి (Capricorn Weekly Horoscope)
ఈ రాశి వ్యాపారులు ఈ వారం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుంది. అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందుతారు. సాంకేతిక విద్యలో ఉన్నవారు మంచి ఫలితాలు పొందుతారు. మీ పనితీరులో మార్పులు చేసేందుకు ప్రయత్నిస్తారు. న్యాయపరమైన విషయాల్లో చిక్కుకున్నవారికి ఆందోళన పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపుచేసుకుని ఆచరణాత్మకంగా విధులు నిర్వర్తించేందుకు ప్రయత్నించాలి. కుటుంబ సభ్యుల కారణంగా సంతోషంగా ఉంటారు. విదేశాలకు వెళ్లాలి అనుకునేవారికి మరికొన్నాళ్లు అడ్డంకులు ఎదురవుతాయి. అనారోగ్యం కోసం డబ్బులు ఖర్చుచేయాల్సి రావొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది.
కుంభ రాశి (Aquarius Weekly Horoscope)
ఈ రాశి నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. వ్యాపారం జోరందుకుంటుంది కానీ కొత్త ప్రయోగాలకు కొన్నాళ్లు దూరంగా ఉండడం మంచిది. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది. మీరు మీ జీవనశైలిలో చేసుకున్న మార్పుల కారణంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు పెళ్లిదిశగా అడుగేసేందుకు మంచి సమయం ఇది. ఏ విషయంపైనా ఎక్కువ చర్చలు పెట్టొద్దు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనుల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగం మారాలి అనే ఆలోచన చేస్తారు.
మీన రాశి (Pisces Weekly Horoscope)
ఈ వారం ఈ రాశివారు ప్రణాళిక ప్రకారం పనులు పూర్తిచేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం. కుటుంబంలో సంతోషం ఉంటుంది ..అయితే..మీ మనసులో ఉండే కొన్ని సందేహాల ప్రభావం మీ బంధంపై పడుతుంది. తప్పుడు విషయాలపై ఎక్కువ ఆసక్తి ప్రదర్శించవద్దు. వారం మధ్యలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పని ఒత్తిడి పెరుగుతుంది.
గమనిక: ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా ఫలితాల్లో మార్పులుంటాయి. మీ వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
Also Read: శంబల నగరం ఎక్కడుంది , ఇప్పటివరకూ ఎవరెవరు వెళ్లొచ్చారు - శంబల గురించి ఆశ్చర్యపోయే విషయాలివే!