ఆగస్టు 13 రాశిఫలాలు (Horoscope 13th August 2022)


మేషం
ఈ రోజు మీ ఆలోచనలో కొన్ని మార్పులు చేసుకోకుంటే కొందర్ని దూరం చేసుకోవాల్సి ఉంటుంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వద్దు. వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు ఇప్పట్లో ఆ ఆలోచన చేయవద్దు. కొత్త ఆలోచనలు,ప్రణాళికలు వేసుకోవచ్చు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. మానసిక వ్యాధుల నుంచి విముక్తి పొందుతారు. 


వృషభం
రోజు రోజుకి కెరీర్లో ఒక్కో అడుగు ముందుకేస్తారు. ఉద్యోగులకు సహోద్యోగులు సహకారం అందిస్తారు. సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్న వారికి ఈరోజు మంచి రోజు అవుతుంది. మీ ఆలోచనా విధానంలో చిన్న మార్పైనా తీసుకురావాలి. మీ జీవిత భాగస్వామి యొక్క మాటలను వినండి, అర్థం చేసుకోండి. 


మిథునం
పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమికులు ఆ దిశగా ఈ రోజు అడుగులు వేయొచ్చు. కుటుంబ సభ్యుల నుంచి ఆమోదం లభిస్తుంది. ఇంటా బయటా మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మంచిరోజు. మీ పనితీరు, మాటతీరుతో ఆకట్టుకుంటారు. 


Also Read: ఈ 5 రాశుల అబ్బాయిలను పెళ్లిచేసుకున్న అమ్మాయిలు అదృష్టవంతులు


కర్కాటకం
ఈ రోజు మీకు సవాల్ లా ఉంటుంది. మీ రెగ్యులర్ కార్యకలాపాలపై శ్రద్ధ వహించండి. ఇంటి పనులు,కార్యాలయ పనులతో పాటూ మీ ఆరోగ్యాన్ని పెంచుకునే పనులు చేయడం మంచిది. మీరు తలపెట్టిన పనులకు కుటుంబం,స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఉంటాయి కానీ  నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు


సింహం
ఈ రోజంతా బిజీగా ఉంటారు. మీ స్నేహితుల కారణంగా కొంత టెన్షన్ పడతారు. కుటుంబ సభ్యుల కోపానికి గురికావొద్దు. తలపెట్టిన పని సమయానికి పూర్తిచేయగలుగుతారు. కొత్త వాహనం కొనుగోలు చేయాలి అనుకునేవారికి మంచి సమయం. 


కన్య 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండే మహిళలకు మంచి రోజు, ఆర్థిక లాభాలు అందుకుంటారు. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలుగుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. మీ సంబంధాలలో ఏర్పడిన చీలికలను పరిష్కరించుకోండి. కంటికి సంబంధించిన సమస్య ఇబ్బంది పెడుతుంది. 


Also Read: చేతిలో డబ్బు నిలవాలంటే ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి!


తుల 
చట్టపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబం అంతా కలసి చేస్తున్న వ్యాపారంలో ఫలితాలు ఈ రోజు అనుకూలంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులు మంచి ఉద్యోగం పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. 


వృశ్చికం
కొన్ని ఇబ్బందుల నుంచి ఈ రోజు రిలీఫ్ లభిస్తుంది. కుటుంబ సంబంధాలు బలపడతాయి. కుటుంబ సభ్యులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు సమసిపోతాయి. సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు.కార్యాలయంలోని అధికారులు కూడా మీ పనిని మెచ్చుకుంటారు. వ్యక్తిగత విషయాల్లో మీరు ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవచ్చు.


ధనుస్సు 
ఆన్ లైన్లో పనిచేస్తున్నవారు ఏదైనా పెద్ద సంస్థలో చేరడం ద్వారా లాభాలు పొందుతారు. మీ టార్గెట్స్ సాధించేందుకు తొందరపడకండి. తల్లి ఆరోగ్యం క్షీణించడం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి.


Also Read: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!


మకరం
సామాజిక రంగాల్లో పనిచేసే వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది, ప్రజాదరణ మరింత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా శత్రువులు కూడా మీ ముందు నిలబడలేరు. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త  పెట్టుబడికి దూరంగా ఉండాలి లేదంటే సమస్యలు తప్పవు. కుటుంబంలో పెద్దల సలహాలు పాటిస్తే కొన్నిసమస్యల నుంచి బయటపడతారు. గతంలో ఇచ్చిన రుణాన్ని తిరిగి పొందుతారు. 


కుంభం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. సామాజికంగా చురుకుగా ఉంటారు కానీ కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతారు. మీరు పనిచేసే రంగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నా..మీ తెలివితేటలతో పరిష్కరించుకుంటారు. ప్రస్తుత పరిస్థితుల కారణంగా, వ్యాపార కార్యకలాపాలు బలహీనంగా ఉంటాయి. విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధపడతారు. 


మీనం
ఈ రోజంతా ఆనందంగా ఉంటారు.పనిలో ఖచ్చితంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. అవసరానికి డబ్బు చేతికందుతుంది. తల్లి తరపువారినుంచి గౌరవం పొందుతారు.మీ రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త వహించాలి లేదంటే వారినుంచి మీకు హాని తప్పదు. మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేయవచ్చు. వ్యాపారం చేసే వారికి మంచి రోజు.