దిష్టి తగలడం అంటే..!
'నరుడి దృష్టి సోకితే నల్లరాయి కూడా  నలిగిలిపోతుంది' అనే మాట తరచూ వినిపిస్తుంటుంది. దిష్టి అంటే ఏంటో అందరికీ తెలియకపోయినా..ఈ మాట వినని వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే దిష్టి తీయడమనే ప్రక్రియ ఎప్పటినుంచో ఉంది. ఎందుకంటే...ప్రతి ఒక్కరి కంటి నుంచి విద్యుత్ ప్రసారం జరుగుతూ ఉంటుంది. ఆ విద్యుత్ ప్రవాహం అవతలివారిపై అనుకూల దిశగా పనిచేస్తే పర్వాలేదు కానీ  వ్యతిరేక దిశలో పనిచేసినప్పుడు  తలనొప్పి ,వికారం, వాంతులు సహా ఒంట్లో నలతగా అనిపిస్తుంటుంది. ఇలాంటప్పుడే దిష్టి తగిలింది అంటారు


దృష్టి లేదా దిష్టి దోషం తొలగిపోవడానికి ఉప్పుతో దిష్టి తీస్తారు, ఎండుమిరపకాయలు-తలవెంట్రుకలు వినియోగిస్తారు, నూనెలో నానబెట్టిన వస్త్రంతో చేసిన పోడుగాటి ఒత్తిని దిష్టితీసి కాలుస్తారు, నల్లతాడు కడతారు, చీపురు-పేడతో దిష్టి తీస్తారు, పాత చెప్పులు చుట్టూ తిప్పి నేలపై కొడతారు. ఈ వస్తువులను మూడుసార్లు చుట్టూ తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించిన విద్యుత్ కిరణాలను విచ్ఛిన్నం చేయడం అని అర్థం. 


Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!


దిష్టి, దృష్టి కేవలం వ్యక్తులకు మాత్రమే కాదు వారి వృత్తి, వ్యాపారల మీద, పంటపొలాలు, ఇళ్లపైనా ప్రభావం చూపిస్తాయి. అందుకే ఇళ్లకు-కార్యాలయాలకు గుమ్మడికాయ, కొబ్బరికాయ దిష్టి తీసి కట్టేవారు కొందరైతే...అందరూ నడిచే దారిలో పడేస్తే దిష్టి పోతుందని భావించేవారు మరికొందరు. ముఖ్యంగా అమావాస్య రోజుల్లో దిష్టి తీస్తే చాలా పవర్ ఫుల్ అంటారు. వ్యాపారులు అయితే నిత్యం రాత్రి దుకాణం మూసేసే సమయంలో నిమ్మకాయతో దిష్టి తీసి బయటపడేస్తుంటారు. 


దిష్టి తీసినవి తొక్కితే ఏమవుతుంది?
ఇలా చేయడం ద్వారా మనుషులకు అయినా, వారి వ్యాపార సంస్థలకు అయినా, ఇళ్లకు అయినా దృష్టిదోషం పోతుందన్నది వారి విశ్వాసం..అంతవరకూ సరే..మరి ఇలా దిష్టి తీసిపడేసినవి తొక్కితే ఏమవుతుందన్నది చాలామంది సందేహం. దిష్టి తీసి పడేసిన వస్తువులు తొక్కితే అనారోగ్యం పాలవుతారని, అప్పటినుంచీ అంతా చెడే జరుగుతుందని భావించేవారున్నారు. అందుకే రోడ్డుపై ఎక్కడైనా దిష్టితీసినవి పడి ఉంటే వాటిని తొక్కకుండా ఉండేందుకుజాగ్రత్త పడతారు. వాస్తవానికి వీటిని తొక్కినంతమాత్రాన ఏమీ జరిగిపోదన్నది పండితుల మాట.


Also Read:   ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!


చెడుని ఆకర్షిస్తాయి అంతే!
గుమ్మడి కాయ, కొబ్బరికాయ, నిమ్మకాయ..ఈ మూడు తమలో ఉన్న మంచిని బయటకు వెదజల్లి వెంటనే చెడుని ఆకర్షిస్థాయి. అందుకే ఈ మూడు వస్తువులు దిష్టి తీయడానికి , ఇళ్లు-వ్యాపార సంస్థల ముందు కట్టడానికి ఉపయోగిస్తారు. చెడుని ఆకర్షిస్తాయని చెప్పారు కదా..మరి వాటిని తొక్కితే చెడుజరుగుతుంది కదా అనే సందేహమూ మీకు రావొచ్చు..ఇక్కడ మరో క్లారిటీ ఏంటంటే ఈ మూడు వస్తువులు చెడును ఆకర్షిస్తాయి అంతే కానీ వీటిని తొక్కినా, దాటినా వాటివల్ల చెడు జరుగుతుందన్నది అపోహ మాత్రమే. ఏం జరగదు కదా అని కావాలని తొక్కుకుంటూ వెళ్లకండి.. పొరపాటున తొక్కితే ఏదో జరుగుతుందని భయపడకండి అని చెబుతున్నారు పండితులు...


Also Read:  ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే