శ్రీ శుభకృత్ నామసంవత్సరం(2022-2023)లో మిథున రాశి ఫలితాలు
మిథునరాశి : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆదాయం : 11 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 2 అవమానం : 2
శ్రీ శుభకృత్ నామసంవత్సరంలో మిథున రాశి స్త్రీ పురుషులకు ధనం, కుటుంబం, సంపద, సంతానం, గౌరవానికి కారకుడైన గురుడు 10 వ స్థానంలో ఉన్నాడు. రాహువు 11 స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో ఉన్నప్పటికీ..అంటే అష్టమశని నడుస్తున్నప్పటికీ అంతగా హానిచేయడు. పెద్దహోదాగల వ్యక్తులకో పరిచయాలు ఏర్పడతాయి, సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు, అధికారం వహించే శక్తిసామర్థ్యాలు వీరిసొంత. ఇంకా ఈ ఏడాది వీరికి ఎలా ఉందంటే...
- ఆదాయ మార్గాలు పెరుగుతాయి, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి
- పాత ఇంట్లో మార్పులు ...లేదా.. నూతన స్థలం కొని స్థిరాస్తిని వృద్ధి చేయడం జరుగుతుంది
- కొన్ని సమస్యల నుంచి బయటపడతారు, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకుంటారు
- గడిచిన ఏడాదిలో పడిన బాధలు, ఇబ్బందులు, గుప్త శత్రువులనుంచి ఈ ఏడాది ఉపశమనం లభిస్తుంది
- 11వ స్థానంలో ఉన్న రాహువు కార్యసిద్ధినీ గౌరవాన్ని ప్రసాదిస్తాడు. జీవితాశయాలు నెరవేరుతాయి
- గురు, శని, కేతు దోషాలవల్ల అడుగడుగునా విఘ్నాలు ఎదురవుతాయి కానీ తెలివిగా పనులు పూర్తిచేస్తారు
- వివాదాలకు దూరంగా ఉండాలి, వచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి
- ఉద్యోగస్తులకు శాంతం అవసరం, విద్యార్థులు కష్టపడితేకానీ ఫలితాలు పొందలేరు, నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది
- వ్యాపారులకు ఈ ఏడాది శుభసమయం, ఉమ్మడివ్యాపారాలు బాగా సాగుతాయి
- బాధ్యతలను ధర్మబద్ధంగా నిర్వర్తించండి.
- అవివాహితులకు వివాహం జరుగుతుంది, దళారులు-వివాహ సంబంధం ఏజెన్సీలను విశ్వసించవద్దు
- బంధువులతో తెగిపోయిన బంధాలు బలపడతాయి, సంతానం భవిష్యత్ పై శ్రద్ధ వహించండి
- శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూల సమయం
- నగదు, విలువైన వస్తువుల విషయంలో నిర్లక్ష్యం తగదు, ఇతరులకు బాధ్యతలు అప్పగించవద్దు
- కుటుంబంలో పెద్దల గురించి ఆందోళన చెందుతారు
- సోదరుల మధ్య ఆస్తి వివాదాలు జఠిలమవుతాయి, న్యాయ నిపుణులతో సంప్రదించాల్సి వస్తుంది. రాజీమార్గంలో సమస్యలు పరిష్కరించుకోవటం క్షేమదాయకం.
- వ్యవసాయ రంగాల వారికి ఆశాజనకంగా ఉంటుంది, పంటల దిగుబడి బాగుంటుంది.గిట్టుబాటు ధర విషయంలో సమస్యలెదురవుతాయి.
- వైద్యరంగాల వారికి ఆదాయాభివృద్ధి. రవాణ, ఎగుమతి దిగుమతి రంగాల వారికి ఆశాజనకం. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం.
- ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు
- మీ ఆలోచనా విధానం, సంస్కారం వల్ల ఇంటా-బయటా గౌరవం లభిస్తుంది
- అష్టమశనివలన అధైర్యంగా అనిపించినా అదిబయట పడకుండా దూసుకుపోయే లక్షణం ఉంటుంది
ఒక్కమాటలో చెప్పాలంటే మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి. ఎంతటివారినైనా ఆకర్షించగలరు, పట్టుదలతో పనులు సాధించుకుంటారు...
నోట్: పండితుల సూచనలు, కొన్ని పుస్తకాల ఆధారంగా రాసిన విషయాలివి...వీటిని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం
ఏబీపీ దేశం వ్యూయర్స్ అందరకీ శ్రీ శుభకృత్ నామ సంవత్సరం శుభాకాంక్షలు.
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో
Also Read: ఉగాది నుంచి ఈ రాశివారు ఆ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే
Also Read: ఈ ఉగాది నుంచి ఈ రాశివారికి మహర్థశ పడుతుంది, ఆ ఒక్క విషయంలో తప్ప