జూన్ 28 మంగళవారం రాశిఫలాలు (Horoscope 27-06-2022)  


మేషం 
ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. పిల్లల కెరీర్ విషయంపై ఆందోళన చెందుతారు. కొత్తగా పెళ్లైన వారి జీవితంలో కొన్ని ఇబ్బందులుంటాయి. కార్యాలయంలో మీ పురోగతి చూసి మీ సహోద్యోగులు కుళ్లుకుంటారు. అధికారులతో మీకు సాన్నిహిత్యం ఉంటుంది. వ్యాపారం బాగానే సాగుతుంది. తల్లిదండ్రుల కోపానికి గురికావొద్దు. 


వృషభం
ఈ రోజంతా మీరు చాలా బిజీగా ఉంటారు. కొన్ని పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి. ఓ శుభవార్త వినే అవాకాశం ఉంది. స్థిరాస్తి వ్యవహారాలను ఆషామాషీగా తీసుకోవద్దు. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. భవిష్యత్ కోసం పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. అనవసరంగా కోపానికి గురికావొద్దు.


మిథునం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. మీ పిల్లల్ని చూసి సంతోషంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న వస్తువులు ఇప్పుడు దొరికే అవకాశం ఉంది. రోజంతా సంతోషంగా ఉంటారు. గతంలో ఇచ్చిన అప్పులు కూడా వసూలవుతాయి. మీపై కుట్రలకు కొందరు ప్రయత్నిస్తారు జాగ్రత్తగా ఉండాలి. 


Also Read:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, కార్యసిద్ధినిచ్చే ఆంజనేయ భుజంగ స్తోత్రం


కర్కాటకం
ఈ రోజు మీకు సంపన్నమైన రోజు అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోష సమయం గడుపుతారు. కుటుంబలో ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీకి సంబంధించిన సమాచారం వింటారు. పాత స్నేహితులను కలుస్తారు.  బెట్టింగ్‌లో డబ్బు పెట్టుబడి పెట్టేవారు కాస్త ఆలోచించడం మంచిది. మీ బాధ్యతల విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించండి. 


సింహం
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. ఆస్తిలో పెట్టుబడి పెట్టడం మంచిది, వాహనం కొనాలనే మీ కోరిక నెరవేరుతుంది.  కుటుంబ సభ్యులతో కలిసి మతపరమైన యాత్రకు వెళతారు. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఇంట్లో ఒకరి అనారోగ్యం కారణంగా కొంత కలత చెందుతారు. ఉద్యోగులకు బాగానే ఉంది. ఎవ్వరికీ అప్పు ఇవ్వకండి.


కన్య
ఈ రోజంతా మీరు యాక్టివ్ గా ఉంటారు. డబ్బుకి సంబంధించిన కొన్ని పథకాల గురించి తెలుసుకుంటారు..వాటిలో ఆవేశంగా పెట్టుబడి పెట్టొద్దు..ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. మీ పనితీరులో మార్పు వస్తుంది. పిల్లల భవిష్యత్ కి సంబంధించి కొన్ని పెట్టుబడులు పెట్టడం సరైన సమయం. మీ జీవిత భాగస్వామితో కొన్ని ప్రేమపూర్వకమైన పనులు చేస్తారు. 


Also Read:  ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు


తుల 
ఈ రోజు మీ గౌరవం పెరుగుతుంది. డేటింగ్ లో ఉన్నవారు, ప్రేమికులు రాజీపడాల్సి ఉంటుంద లేకపోతే గొడవలు తప్పవు. కార్యాలయంలో మీ ప్రత్యర్థుల కుట్రలకు బలికాకుండా చూసుకోండి. మీ పనితీరుపై ఉన్నతాదికారులు సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులు చదువు ఓ వ్యసనం అన్నట్టు మారిపోతారు. వ్యాపారులు ఆలోచించి ఆచి తూచి అడుగేయాలి. కుటుంబ సభ్యుల భవిష్యత్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.


వృశ్చికం
సామాజిక రంగాల్లో పని చేసే వ్యక్తులకు ఈ రోజు మంచి రోజు అవుతుంది. కొన్ని అపవాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. చిరు వ్యాపారులు ఆశించిన ప్రయోజనాలు పొందుతారు. కొన్ని విమర్శల కారణంగా బాధపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 


ధనుస్సు 
ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. ఆఫీసులో వాతావరణం మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కానీ అందరితో ఉత్సాహంగా కలసిపోతారు. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. సమయానికి డబ్బు చేతికందుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. 


మకరం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. గతంలో వచ్చిన నష్టాన్ని భర్తీచేసుకుంటారు. విద్యార్థులు కష్టపడితేనే ఫలితం సాధించగలరు. వ్యాపారం చేసే వ్యక్తులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే జాగ్రత్తగా ఉండాలి. గృహ జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో ఏదైనా వివాదం మీ ఒత్తిడికి కారణం అవుతుంది.


Also Read:  ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది


కుంభం 
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. రోజు ఆరంభంలో కొత్త ఆశాంతిగా అనిపిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తిచేస్తారు. స్నేహితులను కలుస్తారు. అత్తవారింటివైపు వారితో తగాదాలు ఉంటే మౌనంగా ఊరుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఏదైనా అసమ్మతి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం క్షీణించవచ్చు. 


మీనం
ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఏదైనా లావాదేవీ చేయడంలో మీకు ఇబ్బంది ఉంటుంది.  స్నేహితులతో బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.తల్లిదండ్రులకు చెప్పి చేసే పనులు సక్సెస్ అవుతాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలి అనుకునేవారికి మంచి సమయం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు