28 మంగళవారం పంచాంగం


శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు


తేదీ: 28- 06 - 2022
వారం: మంగళవారం


శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం


తిథి  :  సోమవారం రాత్రి తెల్లవారు జామున 4.43 కి వచ్చిన  అమావాస్య మంగళవారం మొత్తం ఉంది. అంటే బుధవారం సూర్యోదయం వరకూ అమావాస్య ఉంది.  
వారం : మంగళవారం
నక్షత్రం:  మృగశిర రాత్రి 6.32 వరకు తదుపరి ఆరుద్ర
వర్జ్యం :  తెల్లవారుజామున 3.56 నుంచి 5.36 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 8.16 నుంచి 9.00 వరకు తిరిగి రాత్రి 10.56 నుంచి 11.39 వరకు
అమృతఘడియలు  : ఉదయం  8.50 నుంచి 10.35 వరకు
సూర్యోదయం: 05:31
సూర్యాస్తమయం : 06:34


Also Read: ఈ రోజు ఈ రాశివారికి సంపన్నమైన రోజు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


Also Read: ఈ రాశులకు చెందిన ప్రేమికుల బంధం బలపడుతుంది, జూన్ 27 నుంచి జులై 3 వరకూ వార ఫలాలు


మంగళవారం ఆంజనేయుడికి ప్రీతికరమైన రోజు. కొందరు అమ్మవారికి పూజ చేస్తే మరికొందరు హనుమాన్ కి జై అంటారు. ఈ సందర్భంగా ఆంజనేయుడి భక్తుల కోసం శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం


శ్రీ ఆంజనేయ భుజంగ స్తోత్రం (Anjaneya Bhujanga Stotram) 
ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం
జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం
తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం
భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం |1|


భజే పామరం భావనీ నిత్యవాసం
భజే బాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రికా కుందమందారహాసం
భజే సంతతం రామ భూపలహాసమ్ |2|


భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషితానేక గౌర్వాణ పక్షం
భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం
భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ |3|


కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం
ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం
వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్
జయశ్రీ సమేతం భజే రామదూతమ్ |4|


చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం
కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం
మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం
భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ |5|


రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే
సరోషే సమారోపితే మిత్రముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే
నటంతం వహంతం హనూమంతమీడే |6|


ఘనద్రత్నజంభారి దంభోళిధారం
ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం
పదాఘాత భీతాబ్ధభూతాధివాసం
రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ |7|


మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం
మహారోగపీడాం మహతీవ్రపీడాం
హరత్యాస్తుతే పాదపద్మానురక్తో
నమస్తే కపిశ్రేష్ట రామప్రియాయహ |8|


సుధాసింధు ముల్లంఖ్యనాధో ప్రదీప్త
స్సుధా చౌషధీస్తా ప్రగుప్తప్రభావా
క్షణద్రోణశైలస్య సారేణసేతుం
వినా భూస్వ్యయం కస్సమర్థః కపీంద్రాః |9|


నిరాతంక మావిశ్యలంకాం విశంకో
భవానేవ సీతాతి శోకాపహరీ
సముద్రాంతరంగాది రౌద్రం వినిద్రం
విలంఘ్యోరు జంఘాస్తుతా మర్త్యసంఘమ్ |10|


రమానాధరామా క్షమానాధరామా
మశోకే సశోకాం విహాయ ప్రహర్షం
వనాంతర్ఘనాం జీవనాం దానవానాం
విపాత్యప్రహర్షాద్ధనూమాన్ త్వమేవా |11|


జరాభారతో భూరిపీడాం శరీరే
నిరాధారణారూఢా గాఢప్రతాపే
భవత్పాదభక్తిం భవద్భక్తిరక్తిం
కురుశ్రీ హనూమాన్ ప్రభోమే దయాళో |12|


మహాయోగినోం బ్రహ్మరుద్రాదయోవా
నజానంతి తత్త్వం నిజం రాఘవస్య
కధం జ్ఞాయతే నీద్పషేనిత్యమేవ
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే |13|


నమస్తే మహాసత్త్వబాహాయ తుభ్యం
నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయతుభ్యం
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం |14|


నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం
నమస్తే సదా రామభక్తాయ తుభ్యం
నమస్తే కృతామర్త్యకార్యాయ తుభ్యం |15|


హనూమ ద్భుజంగ ప్రయాతం ప్రభాతే
ప్రదోషేపివా చార్థరాత్రోపిమర్త్యః
పఠన్ నశ్యతోపి ప్రముక్తా ఘజాలో
సదాసర్వదా రామభక్తిః ప్రయాతిః |16|


ఈ స్తోత్రాన్ని మూడు పూటలా పఠించిన వారికి సమస్తపాపాలు నశించి..హనుమంతుడి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతారు. 


Also Read: ఈ వారం ఈ రాశివారు మౌనంగా ఉండడం బెటర్ , ఆ రెండు రాశులవారికి అద్భుతంగా ఉంది