వివిధ కారణాలతో మార్కెట్‌ అస్థిరతతో ఉన్నప్పుడు చాలా మంది భారతీయులు చిన్న పొదుపు పథకాలవైపు మొగ్గు చూపుతారు. పోస్టోఫీసు పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటారు. ఇది తమకు ఎప్పుడూ రక్షణగా ఉంటుందని వారి భావన. స్థిరమైన రాబడిని పొందడానికి ఇదో మంచి మార్గంగా భావిస్తారు. పోస్టాఫీసులో చిన్న పొదుపు పథకాలు అత్యంత విశ్వసనీయమైనదిగా వారి ఆలోచన. వీటి ప్రభుత్వ మద్దతు ఉంటుందని ఎప్పటికీ తమ డబ్బులు సురక్షితంగా ఉంటాయని అనుకుంటారు. వీటికి స్టాక్‌ మార్కెట్లకు సంబంధం ఉండదు.  


ఇలాంటి పోస్టాఫీస్‌లలో మంత్లీ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇలా చాలా స్కీమ్‌లు ఉన్నాయి. ఇవి ప్రతి త్రైమాసికం ప్రారంభంలో ప్రభుత్వం నిర్ణయించిన స్థిరమైన రాబడిని కలిగి ఉంటాయి. అనేక పోస్టాఫీసు పొదుపు పథకాలు బ్యాంకుల కంటే చాలా ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. 


నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో డబ్బు పెట్టుబడి పెట్టిన వారు జూన్ 30న వడ్డీ రేట్లపై అప్‌డేట్ అయ్యే అవకాశం ఉంది. PPF, NSC లేదా SSYని మార్చాలని ప్రభుత్వం పరిగణించవచ్చు. జూన్‌లో స్కీమ్ వడ్డీ రేట్లు, తద్వారా ఈ పథకాల పెట్టుబడిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. కేంద్రం ప్రతి త్రైమాసికం చివరిలో పోస్టాఫీసు పొదుపు పథకాలకు తాజా రేట్లు ప్రకటిస్తుంది. జూన్ 30 FY22-23కి Q1 ముగింపు. గత కొన్ని నెలలుగా, ప్రభుత్వం వడ్డీ రేట్లను మార్చకుండా ఉంచింది.


పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపై ప్రస్తుత వడ్డీ రేట్లు


పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్‌లపై ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి. ఇవి ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి, ఈ నెలాఖరు వరకు అంటే జూన్ 30 వరకు అమల్లో ఉంటాయి. 
1. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ - 7.1 శాతం


2. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్- 6.8 శాతం


3. సుకన్య సమృద్ధి యోజన- 7.6 శాతం


4. కిసాన్ వికాస్ పత్ర- 6.9 శాతం


5. సేవింగ్స్ డిపాజిట్- 4 శాతం


6. ఏడాదికి చేసే డిపాజిట్స్‌- 5.5 శాతం


7.  రెండేళ్ల సమయంతో డిపాజిట్- 5.5 శాతం


8. మూడేళ్ల గడువుతో చేసే డిపాజిట్- 5.5 శాతం


9. 5 ఏళ్ల కాల పరిమితి డిపాజిట్- 6.7 శాతం


10. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్- 5.8 శాతం


11. 5 ఏళ్ల సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్- 7.4 శాతం


12. 5 ఏళ్ల పాటు నెలవారీ ఆదాయం వచ్చే ఖాతా- 6.6 శాతం


PPF, SSY, MIS వడ్డీ రేట్లను ఇప్పుడు ప్రభుత్వం ఎందుకు పెంచాలని భావిస్తోంది?


దేశంలో పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ రెండు సమావేశాల్లో రెపో రేట్లను 90 బేసిస్ పాయింట్లు పెంచింది. రుణగ్రహీతలు అనేక రుణ కాల వ్యవధిలో ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి ఉంటుందని దీని అర్థం. పెట్టుబడిదారులు మంచి రాబడిని పొందవచ్చు. దీని ఫలితాలు ఇప్పటికే అనేక జాతీయం, ప్రైవేట్ బ్యాంకులు తమ FD, RD రేట్లు పెంచుతున్నాయి. అందుకే PPF వడ్డీ రేట్లు, MIS వడ్డీ రేట్లు, SSY వడ్డీ రేట్లు పెంచడానికి ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.