జులై 20 బుధవారం రాశిఫలాలు (Horoscope 20-07-2022)
మేషం
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. చాలా కాలంగా కార్యాలయంలో నిలిచిపోయిన ఏదైనా ముఖ్యమైన పని కచ్చితంగా పూర్తవుతుంది. మీకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది. వ్యాపారులు సక్సెస్ అవుతారు. ఆస్తికి సంబంధించిన వివాదాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృషభం
ఈరోజు మీరు మానసికంగా బాధపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు ఎవ్వరితోనూ అనవసరంగా వాదనలు పెట్టుకోవద్దు. కోపాన్ని నియంత్రించుకోండి. కొత్త వ్యాపారం, కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు కాదు. ఆర్థిక వ్యవహారాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కలిసొస్తాయి.
మిథునం
ఏదో గందరగోళంలో ఉంటారుకానీ ఆ పరిస్థితి నుంచి తొందరగానే బయటపడతారు. సహనం-శ్రమను బ్యాలెన్స్ చేసుకోవడం చాలా అవసరం. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఓ వ్యక్తితో మీకున్న వివాదం పరిష్కారం అవుతుంది. ఓ శుభవార్త వింటారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలుంటాయి. కొత్త బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.
Also Read: జులై 20 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, పుష్యమి కార్తె ప్రారంభం
కర్కాటకం
మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు ఇదే మంచి సమయం. ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి. అనవసర ఆలోచనతో కాలం గడపకుండా మీ పనిపై ఎక్కువ దృష్టిసారించండి. కష్టంగా ఉన్న విషయాలు మీకు క్రమంగా అనుకూలంగా మారుతాయి. మీ తెలివితేటలు,నైపుణ్యంతో ప్రత్యర్థులను అధిగమిస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
సింహం
ఈ రోజు మీరు అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. మితిమీరిన సిన్సియారిటీ కూడా పనికిరాదు. పిల్లల వైపు నుంచి శుభవార్త వింటారు. మాటలను నియంత్రించుకోవాలి. ఎక్కువ ఒత్తిడికి గురికావొద్దు. అనవసర వివాదాలు తెరపైకి రాకుండా జాగ్రత్త పడండి. సామాజిక సేవలో పాల్గొంటారు.
కన్య
కెరీర్ మార్చుకోవాలి అనుకుంటే ఇదే సరైన సమయం అని చెప్పొచ్చు. మీరు తలపెట్టే పనులకు స్నేహితులు, బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అందర్నీ గౌరవించండి. మీ కోసం తీసుకునే కొన్ని నిర్ణయాలలో కచ్చితత్వం ఉండేలా చూసుకోండి. వృత్తి ఉద్యోగాల్లో ఉండేవారికి మంచి సమయం. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు ఉంటాయి. పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు స్నేహితుల నుంచి సలహాలు తీసుకోండి.
తుల
ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి లేదా సహోద్యోగుల నుంచి పూర్తి స్థాయి మద్దతు పొందలేరు. ఈ పరిస్థితి మిమ్మల్ని మానసికంగా గందరగోళంలోకి నెట్టేస్తుంది. అలాంటప్పుడు మీ బలహీనతను బయటకు చెప్పొద్దు. ఉద్యోగం మారే ఆలోచన అస్సలు చేయకండి. ఆర్థిక పరిస్థితిలో పెద్దగా మార్పులుండవు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.
వృశ్చికం
ఈరోజు మీరు తలపెట్టిన పనులు అసంపూర్తిగా పూర్తవుతాయి. ఎవరితోనైనా కలిసి పనిచేయడం వల్ల సక్సెస్ అవుతారు. ప్రేమ వ్యవహారాల్లో అడుగు ముందుకు పడుతుంది. మీ మనసంతా ఆనందంగా ఉంటుంది. కొత్త కోర్సులు నేర్చుకోవడంపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు. దూర ప్రయాణం చేయాల్సి ఉంటుంది. వ్యాపారులు తగిన లాభాలు పొందుతారు.
ధనస్సు
మీ మనసులో ఏముందో ఎవరికైనా చెప్పాలనుకుంటే చెప్పండి. ఈరోజు మీరు ప్రతిపనినీ చాలా శ్రద్ధగా చేస్తారు. కొన్ని రహస్యాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తారు. మీ బాధ్యత పెరుగుతుంది. వ్యాపారం కోసం కొత్త వ్యక్తులను సంప్రదించాల్సి వస్తుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
మకరం
ఈ రోజు వ్యాపారులు చాలా కష్టపడితే కానీ లాభాలు పొందలేరు. ఉద్యోగులు ఉన్నతాధికారును పని విషయంలో సంతృప్తి పర్చలేరు. కష్టపడి పనిచేస్తే కానీ మంచి ఫలితాలు అందుకోలేరు. ఊహాగానాలతో సమయం వృధా చేయకండి.,
కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలు బావుంటాయి. రోజువారీ కార్యకలాపాలు ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగిపోతాయి.వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. ఇతరులకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు.
మీనం
వ్యాపారులు, ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఆర్థికంగా మరో మెట్టు ఎక్కుతారు. ఆకస్మిక ధనలాభాలు ఉండొచ్చు. సొంత పెట్టుబడి పెట్టేందుకు కూడా మంచి సమయం. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఓ శుభవార్త వింటారు..రోజంతా ఆనందంగా ఉంటారు.
Also Read: దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి, ఎప్పటి వరకూ దక్షిణాయనం