శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు
జులై 20 బుధవారం పంచాంగం


తేదీ: 20-07 -2022
వారం:  బుధవారం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం,దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు,ఆషాఢ మాసం,బహుళ పక్షం
తిథి  : సప్తమి బుధవారం మధ్యాహ్నం 12.25 వరకు తదుపరి అష్టమి
నక్షత్రం:  రేవతి  సా 6.02 వరకు తదుపరి అశ్విని
వర్జ్యం :  ఉదయం 5.58 నుంచి 7.33 వరకు
దుర్ముహూర్తం :  ఉదయం 11.40 నుంచి 12.32వరకు  
అమృతఘడియలు  : మధ్యాహ్నం 3.37 నుంచి 5.12 వరకు  
సూర్యోదయం: 05:38
సూర్యాస్తమయం : 06:34


( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)


 


పుష్యమి కార్తె ప్రారంభం


 జోతిష్యులు 27 నక్షత్రాలు, గ్రహాల ఆధారంగా జాతకాలు,పంచాంగాలు తయారు చేశారు. సూర్యోదయం సమయానికి ఏ నక్షత్రం చంద్రుడికి దగ్గరగా ఉంటే ఆ రోజుకు ఆ నక్షత్రం పేరు పెట్టారు. పౌర్ణమి రోజు చంద్రుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ నెలకు ఆ పేరు పెట్టారు. కానీ తెలుగు రైతులు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగం తయారుచేసుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుచుకుంటున్నారు. అయితే వీరి లెక్కల ప్రకారం సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు. అలా సంవత్సరానికి 27 కార్తెలు. తెలుగు రైతులంతా తమ అనుభవం నుంచి సంపాదించుకున్న వ్యవసాయ విజ్ఞానాన్ని కార్తెలుగా వాటిని అందరకీ అర్థమయ్యేలా సామెతల రూపంలో అందరకీ అర్థమయ్యేలా చెప్పారు. అందులో ఒకటి పుష్యమి కార్తె.


జులై 20 బుధవారం నుంచి పుష్యమి కార్తె ప్రారంభం 
చంద్రుడు ఒక్కొక్క నక్షత్రం సమీపంలో 14 రోజుల పాటు ఉంటాడు. ఏ నక్షత్రం సమీపంలో ఉంటే ఆ కార్తెకు ఆ పేరు పెడతారు. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగిసే వరకు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉంటాయి.ప్రస్తుతం చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి చేరువలో ఉండటం వల్ల దీనికి పుష్యమీ కార్తె అనే పేరు వచ్చింది. 


27 నక్షత్రాలే 27 కార్తెలు
1.అశ్వని, 2.భరణి, 3.కృత్తిక, 4.రోహిణి 5.మృగశిర 6. ఆరుద్ర 7.పునర్వసు 8.పుష్యమి 9.ఆశ్లేష 10.మఖ 11.పుబ్బ 12.ఉత్తర 13.హస్త 14. చిత్త 15.స్వాతి 16.విశాఖ 17.అనూరాధ 18.జ్యేష్ట 19.మూల 20.పూర్వాషాడ 21.ఉత్తరాషాడ 22.శ్రావణ 23.ధనిష్ట 24.శతభిషం 25.పూర్వాభాధ్ర 26.ఉత్తరాభాధ్ర 27.రేవతి


Also Read: దక్షిణాయన పుణ్యకాలం అంటే ఏంటి, ఎప్పటి వరకూ దక్షిణాయనం


Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!