Horoscope 13th July 2022: గురు పౌర్ణమి రోజు ఈ రాశులవారు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు, జులై 13 బుధవారం రాశిఫలాలు

Horoscope 13-07-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

Continues below advertisement

జులై 13 బుధవారం రాశిఫలాలు (Horoscope 13-07-2022)

Continues below advertisement

మేషం
ఎవరికైనా ఆర్థిక సహాయం చేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. రిస్క్ తీసుకోవద్దు.  ఆహారాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులతో కలిసి బయటకు వెళతారు. ప్రత్యర్థులకు మీ పట్ల అసూయ భావం ఉండవచ్చు. పిల్లల కదలికలను పర్యవేక్షించాలి. 

వృషభం
ఈరోజంతా  మీరు కొంత గందరగోళంలో కూరుకుపోవచ్చు. కార్యాలయంలో సహోద్యోగుల కారణంగా నష్టపోతారు. రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులు తమ ప్రవర్తనను మార్చుకోవాలి. మీ జీవిత భాగస్వామి ఆలోచనలను పరిగణలోకి తీసుకోండి.  బంధువులతో సమావేశం అవుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. 

మిథునం
గుర్తుతెలియని వ్యక్తుల వల్ల  మీ పనులు దెబ్బతినే అవకాశం ఉంది. క్రయ, విక్రయాలకు సంబంధించిన వ్యక్తులు లాభపడతారు. కెరీర్ సంబంధిత సమాచారం అందుబాటులో ఉంటుంది.  ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. స్నేహితులను కలుస్తారు.  మీరు వ్యాపారంలో భారీ లాభాలను పొందవచ్చు

Also Read: జులై 13 తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, వినాయకుడి 32 పేర్లు మీకోసం

కర్కాటకం
ప్రేమికులు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారు. వ్యాపారంలో వేగం తగ్గుతుంది. కొత్త పనుల వల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేసినందుకు సంతోషంగా ఉంటారు. వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.  కెరీర్ మార్పుకోవాలి అనుకుంటే ఇదే మంచి సమయం.  ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మీ ఆహారాన్ని నియంత్రించండి.

సింహం
ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. జూదం-లాటరీ వ్యవహారంలో డబ్బు వృధా కావచ్చు. పని ఒత్తిడి మిమ్మల్ని అతలాకుతలం చేస్తుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకండి. పిల్లల అవసరాలు తీరుస్తారు. ఆస్తి వివాదం నుంచి బయటపడతారు.

కన్యా
అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందుతారు.  నిరుద్యోగులు కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనే ఆలోచన చేస్తారు. పని పట్ల మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీ దినచర్యను మెరుగుపరచుకోవచ్చు. వ్యాపారులకు లాభిస్తుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి సలహా తీసుకోవలసి రావొచ్చు. మిత్రులను కలుస్తారు.

Also Read: కుంభం నుంచి మకరంలోకి వక్రంలో శని, ఈ రాశులవారికి అరాచకంగా ఉంది

తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది.  ఎలాంటి వివాదంలో భాగం కావద్దు. డబ్బు లావాదేవీల్లో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఉద్యోగంలో మీ పనితీరు సగటుగా ఉంటుంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా మీరు వ్యాపారంలో నష్టపోవాల్సి రావచ్చు.మీ తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిందే. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. 

వృశ్చికం
అనవసర పనులకు సమయాన్ని వృథా చేయకండి.అనారోగ్య సమస్యలుంటాయి జాగ్రత్త.  అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వస్తుంది. ఎవరినీ నమ్మవద్దు. విమర్శలకు భయపడవద్దు.

ధనుస్సు 
మీరు మీ ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఎవరితోనైనా మనస్పర్థలు రావచ్చు. మీ పని సాఫీగా సాగుతుంది. కొత్తగా , సృజనాత్మకంగా ఏదైనా చేయాలని ప్లాన్ చేస్తారు. జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ మీకు సహకరిస్తారు. చాలా ప్రభావవంతమైన వ్యక్తితో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. రాజకీయ చర్చల్లో పాల్గొంటారు.

Also Read: మకర రాశిలోకి శని తిరోగమనం, ఈ రాశులవారికి యోగదాయకం

మకరం
కార్యాలయంలో అధికారుల నుంచి  ఒత్తిడి పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు సంబంధించిన చిక్కుముడులు ఉండొచ్చు. మీ నూతన ప్రయత్నాలను ఎవరికీ చెప్పకండి. కుటుంబం కోసం కొంత సమయం కేటాయించాలని నిర్ధారించుకోండి.  కోపం తగ్గించుకోండి.  వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి

కుంభం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.  యోగా వ్యాయామం చేయడం మంచిది. దగ్గరి బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులు ప్రయాణం చేయవలసి రావచ్చు. మీ సలహాలు చాలామందికి ఉపయోగపడతాయి. పాత పెట్టుబడుల ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. వివాదాస్పద కేసుల్లో విముక్తి లభిస్తుంది. ఓ శుభవార్త వింటారు. 

మీనం
మోసపూరిత ధోరణులు ఉన్నవారి పట్ల జాగ్రత్త వహించండి. కర్మాగారాల్లో పనిచేసే వారు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి విచారకర వార్తలు వినే అవకాశం ఉంది.  పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించడానికి ఇది మంచి సమయం. మీరు సాధించిన విజయాలతో సంతృప్తి చెందుతారు. జీవిత భాగస్వామికి బహుమతులు అందజేస్తారు. 

Continues below advertisement