Singer Abhijeet Bhattacharya About AR Rahman: వివాదాస్పద బాలీవుడ్ సింగర్ అభిజీత్ భట్టాచార్య ఇటీవల ఆస్కార్ అవార్డు గ్రహీత, పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి షాకింగ్ ఆరోపణలు చేశారు. రెహమాన్ ఒకప్పుడు పద్మ భూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత అవార్డులను అందుకున్న ఆర్టిస్ట్‌లను సైతం తన స్టూడియోలో గంటల తరబడి వేచి ఉండేలా చేసే వాడని షాకింగ్ కామెంట్స్ చేశారు. అర్థరాత్రి కాల్ చేసి రమ్మన్నారు రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో సీనియర్ సింగర్ అభిజీత్ భట్టాచార్య మాట్లాడుతూ. రెహమాన్ సంగీతం అందించిన 'దిల్ హి దిల్ మే' చిత్రంలోని 'ఏ నజ్నీన్ సునో నా' పాటను రికార్డ్ చేసిన సమయాన్ని నెమరువేసుకున్నారు. "రెహమాన్‌తో మీ కెరీర్‌లో ఒకే ఒక్కసారి మాత్రమే ఎందుకు వర్క్ చేశారు ?" అనే ప్రశ్నకు అభిజీత్ స్పందిస్తూ... "అప్పట్లో నాకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్స్ నుంచి కాల్స్ వచ్చేవి. అను మాలిక్ లాంటి వారు సైతం నా కోసం వెయిటింగ్‌లో ఉండేవారు. ఆనంద్-మిలింద్, జతిన్-లలిత్ ఇలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అవకాశాలు ఇస్తూ కాల్స్ చేసేవారు. నేను డబ్బింగ్‌లో బిజీగా ఉండేవాడిని. అలాంటి టైమ్‌లోనే నేను రెహమాన్‌ను కలవడానికి వెళ్లి హోటల్‌లో వెయిట్ చేశాను. కానీ ఆ రోజు వర్క్ జరగలేదు. నెక్స్ట్ డే ఉదయాన్నే రికార్డింగ్ ఉంటుందేమో అనుకున్నాను.
తెల్లవారుజామున 2 గంటలకు కాల్ చేసి, నన్ను స్టూడియోకి రమ్మన్నారు. నేను నిద్రపోతున్నానని చెప్పాను. ఇక ఉదయాన్నే వెళ్తే రెహమాన్ అక్కడ లేడు. ఆయనకు సాధారణ సమయాల్లో పని చేసే అలవాటు లేదు. నేనేమో ఒక క్రమపద్ధతిలో పని చేయడం అలవాటు చేసుకున్నాను. ఇలా క్రియేటివిటీ పేరుతో తెల్లవారుజామున 3:33 గంటలకు రికార్డ్ చేస్తామని వాళ్లు చెప్పడం ఏంటో నాకు అర్థం కాలేదు" అంటూ ఆరోజు జరిగిన స్టోరీని వెల్లడించారు.
'పద్మ భూషణ్' గ్రహీతలకు అవమానం అభిజీత్ ఇంకా మాట్లాడుతూ.. ఆ రోజు రెహమాన్ అసిస్టెంట్ ఒకరు స్టూడియోలో ఉన్నారని, ఆయనే స్టూడియోలో జరిగే పనులకు బాధ్యత వహించారని అన్నారు. "నా గదిలో ఎయిర్ కండిషనింగ్ కారణంగా నాకు జలుబు వచ్చింది. కానీ ఆ అసిస్టెంట్ నన్ను పాడమని పట్టుబట్టాడు. నేను సూపర్ ఫ్లాప్ సినిమాలకు చాలా హిట్ పాటలు పాడాను. వాటిలో ఇది కూడా ఒకటి. తరువాత నేను రెహమాన్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను. ఎన్నిసార్లు అడిగినా ఆయన ఎప్పుడొస్తారు అన్న విషయాపై సరైన సమాధానం రాలేదు. రెహమాన్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందేనని అన్నారు. కానీ నాకు కమిట్‌మెంట్లు ఉన్నాయని చెప్పడంతో చివరికి రెహమాన్ రాకుండానే వెళ్లిపొమ్మన్నారు.
ఇక రికార్డింగ్ సమయంలో పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీతలతో సహా పలువురు ప్రసిద్ధ కళాకారులు కింద బెంచ్ మీద కూర్చుని, దాదాపు మూడు గంటలు రెహమాన్ కోసం వెయిట్ చేయడం నేను కళ్లారా చూశాను. అలా చేయడం కళాకారులను అవమానించడమేనని అనిపించింది" అంటూ అప్పట్లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించారు అభిజీత్. కాగా ఏఆర్ రెహమాన్, అభిజీత్ భట్టాచార్య 1999లో రిలీజ్ అయిన మూవీ 'దిల్ హి దిల్ మే'లోని 'ఏ నజ్నీన్ సునో నా' అనే ఒకే ఒక్క పాటకు కలిసి పనిచేశారు.