జ్యోతిష్యశాస్త్రం ప్రకారం  నవ గ్రహాల్లో శనికి అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహాలన్నింటిలో శని గ్రహమే అత్యంత నెమ్మదిగా ప్రయాణిస్తుంది. జులై 11 వరకూ కుంభరాశిలో ఉన్న శని... జులై 12 నుంచి కుంభ రాశి నుంచి మకరంలోకి తిరోగమనం చేయనున్నాడు. ఇదే రాశిలో అక్టోబర్ 20 వరకూ వక్రంలో ప్రయాణించి..ఆ తర్వాత కూడా ఇదే రాశిలో సంచరిస్తాడు. శని తిరోగమనం దశలో ఉన్నప్పుడు ఆ ప్రభావం 12 రాశులపైనా పడుతుంది. క్టోబరు 23 వరకూ శని వక్రంలోనే ఉంటాడు. అయితే శని అంటే చెడు మాత్రమే చేస్తాడనుకుంటే పొరపాటే. ఎందుకంటే శని వక్రదిశలో ఉన్నప్పుడు కూడా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలుంటాయి. ఆ రాశులేంటంటే...


మేషం
మకరంలో శని సంచారం మేషరాశివారికి యోగదాయకంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కలిసొస్తాయి. వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేసేందుకు ఇదే మంచి సమయం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయాల్లో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఆర్థికంగా చిన్న  చిన్న ఇబ్బందులు ఎదురవుతాయి.   వివాదాలకు దూరంగా ఉండాలి. వివాహితులు జీవిత భాగస్వామితో గొడవ పెట్టుకోవద్దు. ఓవరాల్ గా శని తిరోగమనం వల్ల మీకు లాభాలే ఎక్కువ.


వృషభం
మకరంలో శని సంచారం వృషభ రాశివారికి మేలు చేస్తుంది.  ఉద్యోగుల ఆత్మగౌరం పెరుగుతుంది. ఆదాయం, ఆరోగ్యం రెండింటింలోనూ శుభఫలితాలు అందుకుంటారు.  కుటుంబ పరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది.   కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు మరి కొంత సమయం వేచి ఉండాలి.


సింహం
శని తిరోగమనం సింహరాశివారికి ప్రయోజనకరంగా ఉంటుంది. శని 6వ స్థానంలో ఉండటం వలన ఈ రాశి వారు చేస్తోన్న ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలున్నాయి.  ఈ సమయంలో మీ ఎదుటి వారితో మాట్లాడేటపుడు జాగ్రత్త. జీవితంలో ఉన్నతి లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి.


Also Read: శుక్రవారం రోజు పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!


కన్య
మకరంలో శని తిరోగమనం అంటే ఈ రాశి వారికి శని ఐదవ ఇంట సంచరిస్తాడు. ఈ సమయంలో మీరు శుభవార్త వింటారు. వ్యాపారులకు లాభాలొస్తాయి. మకరంలో శని సంచారం విద్యార్థులకు కలిసొస్తుంది.  ఉద్యోగులకు అంతా మంచిసమయం, ప్రమోషన్ లేదా జీతం పెరుగుదలకు సంబంధించిన సమచారం వింటారు. ఆరోగ్య విషయంలో మాత్రం నిర్లక్ష్యం వద్దు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టొద్దు. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది జాగ్రత్త.


వృశ్చికం
వృశ్చిక రాశివారికి మూడోఇంట సంచరిస్తున్నాడు. ఈ సమయం మీకు మొత్తం అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో లాభపడతారు. స్టాక్ మార్కెట్లో తెలివిగా పెట్టుబడులు పెట్టండి. చమురు, గని , యంత్ర వ్యాపారులకు కలిసొస్తుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 
 
మీనం
శని తిరోగమనం ఈ రాశివారికి ఉపయోగకరంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి సమయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారులకు మంచి సమయం.


Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!