శుక్రవారం లక్ష్మీదేవి సెంటిమెంట్ చాలామంది ఉంది. ఈ రోజు కొన్ని నియమాలు పాటించడం ద్వారా ఇంట్లో ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని విశ్వశిస్తారు. అదే సమయంలో శుక్రవారం అస్సలు చేయకూడని కొన్ని పనుల గురించి కూడా తెలుసుకోవాలంటారు. అవేంటంటే...
- శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పూజలు చేస్తుంటారు. అందుకే ఈ రోజు ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మవారి విగ్రహాన్ని కానీ, ఫొటోను కానీ దేవుడి మందిరంలోంచి బయటకు తీయరాదు
- కొంతమది పాతది లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్తది ఉంచుతారు. పాత విగ్రహాన్ని మరిచిపోయి కూడా శుక్రవారం రోజు నిమజ్జనం చేయరాదు.కొత్త విగ్రహాన్ని పెట్టుకోవచ్చు కానీ పాతది తీయరాదు.
- శుక్రవారం రోజు అప్పు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. ఎవరికైనా సహాయం అవసరం అయితే చేయండి కానీ రుణం రూపంలో ఇచ్చి పుచ్చుకోవడాలు వద్దు.
- శుక్రవారం నాడు కొంతమంది వైభవ లక్ష్మీ ఉపవాసం పాటిస్తారు. ఈ రోజు అమ్మాయిలకు అన్నదానం చేస్తారు. అందుకే పొరపాటున కూడా అమ్మాయిలపై కోప్పడవద్దు ముఖ్యంగా ఇంట్లో ఆడపిల్లలుంటే వారిని తిట్టడం లాంటివి చేయరాదు.
- ఈ రోజు లక్ష్మీదేవి విగ్రహం ఎవ్వరికీ ఇవ్వకండి. విగ్రహాన్ని ఇంటికి తీసుకురావొచ్చు కానీ తీసుకెళ్లి ఇవ్వొద్దు. పొరపాటున కూడా అమ్మవారి ప్రతిమ శుక్రవారం రోజు మీ ఇంటి గడప దాటరాదు
- శుక్రవారం రోజున బూజు దులపడం అస్సలు చేయకూడదు
- మగవారు, ఆడవారు జుట్టు కత్తిరించడం, గోళ్ళు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం లాంటివి చేస్తే వారిపై లక్ష్మీ కటాక్షం ఉండదని చెబుతారు.
- ఈ రోజున మాసినబట్టలు ధరించకూడదు
- బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టడం, ఇతరులకు ఇవ్వడం అస్సలు వద్దు
Also Read: జూన్ 10న నిర్జల ఏకాదశి, ఈ నియమాలు పాటిస్తే ఆర్థిక, అనారోగ్య సమస్యలుండవ్
చేయాల్సిన పనులు
- శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద, వైభవం, శ్రేయస్సు వస్తుంది.
- ఈ రోజు దానధర్మాలు చేస్తే ఆ ఇంట లక్ష్మీదేవి ఎప్పటికీ కొలువుంటుందని చెబుతారు
- శాస్త్రాల ప్రకారం సంధ్యాసమయంలో కొంతసేపు ఇంటి ప్రధాన ద్వారం తెరిచి ఉండాలి, వెనుక ద్వారం మూసివేసి ఉండాలని చెబుతారు. ఆ సమయంలో అమ్మవారు ఇంట్లోకి అడుగుపెడుతుందని విశ్వాసం.
- పసుపు, ఎరుపు, ఆకుపచ్చ దుస్తులు ధరించి పూజచేయాలి
- తులసి మొక్క దగ్గర తప్పనిసరిగా దీపం వెలిగిస్తే సుమంగళి యోగం లభిస్తుంది
- అమ్మవారికి తెల్లటి పూలతో పూజిస్తే ఇంట్లో ప్రశాంతత లభిస్తుంది
- పాలతో పాయసం చేసి నివేదించాలి... ఈ పాయసం ఇంటికొచ్చిన వారికి పెట్టొచ్చు కానీ ఇల్లు దాటి బయటకు ఇవ్వరాదు
- శుక్రవారం రోజు లక్ష్మీగణపతి ఆలయాన్ని దర్శించుకుని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోర్కెలు నెరవేరతాయి
- శుక్రవారం ఉదయం, లేదా సాయంత్రం వెళల్లో దేవాలయాని వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగిపోతాయి
Also Read: మంగళసూత్రానికి పిన్నీసులు తగిలిస్తున్నారా!
Also Read: ఇంట్లో లక్ష్మీదేవి, కృష్ణుడు, ఆంజనేయుడి ఫొటోలు ఎలాంటివి ఉండాలంటే!