Holi Celebrations in Different States:  హోలీ వేడుకలు దక్షిణాది కన్నా ఉత్తరాదిన బాగా జరుపుకుంటారు. రాథా కృష్ణుల ఊరేగింపు, హోలికాదహనానికి గుర్తుగా మంటలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా సందడే సందడి. దేశంలో వివిధ ప్రాంతాల్లో విభిన్నంగా జరుపుకుంటారు హోలీ వేడుకలు


మథుర 
శ్రీ కృష్ణుడి జన్మ స్థలం అయిన మథుర బృందావనం లో హోలీ వేడుకలు అంబరాన్నంటుతాయి. ఇక్కడ ప్రజలు హోలీని 16 రోజులపాటు జరుపుకుంటారు.


గుజరాత్ 
గుజరాత్ లో హోలీని చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు. మంటలు వేసి దాని చుట్టూ చేరి నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తారు. 


మహారాష్ట్ర 
మహారాష్ట్రలో హోళిక అనే రాక్షసి దిష్టిబొమ్మ దహనం చేస్తారు. హోళీ  వేడుకకు  వారం ముందు యవకులు ఇంటింటికి తిరిగి పాత చెక్క సామానులు సేకరిస్తారు. ఉదయం వేసిన మంటలు సాయంత్రం వరకూ మండుతూనే ఉంటాయి. ఈ మంటలకు ప్రత్యేకంగా చేసిన స్వీట్లను నైవేద్యంగా సమర్పిస్తారు.


Also Read: 2023 మార్చినెల రాశిఫలాలు, అపనిందలు, ఆకస్మిక ప్రమాదాలు - మార్చిలో ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాలి!


మణిపూర్ 
మణిపూర్ లో ఓ ఆచారం ఉంది. మగపిల్లలు ఆడపిల్లలకు డబ్బులు ఇస్తేనే ఆడపిల్లలు వారి మీద రంగులు చల్లుతారు. రాత్రి సమయంలో చిన్నాపెద్దా అందరూ కలిసి ఒక చోట చేరి మంటల చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. ఇక్కడ వారం రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తారు. చివరిరోజు కృష్ణుడి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహిస్తారు.


శాంతినికేతన్
పశ్చిమ బెంగాల్ శాంతినికేతన్ లో హోలీ ఘనంగా జరుపుకుంటారు. పెద్దలు, యువకులు రంగు నీళ్ళు చల్లుకుంటూ ఆనందిస్తారు. వీధుల్లో రాధ, కృష్ణుడు విగ్రహాలను పల్లకీలో ఊరేగిస్తూ .. నాట్యం చేస్తూ భక్తి పాటలు పాడతారు.


ఉదైపూర్
రాజస్థాన్ లోని ఉదైపూర్ లో హోలీ వేడుకలను కాస్త భిన్నంగా జరుపుకుంటారు. రంగులు జల్లుకోనేది కామన్..కర్రలను కుప్పగా పోగు చేసి వీధి చివరలో లేదా ఖాళీ మైదానంలో దహనం చేస్తారు.


రూప నగర్
పంజాబ్ లోని రూప నగర్ లో సిక్కులు భారీ ఎత్తున హోలీ వేడుకలను జరుపుకుంటారు. ఆనంద్ పూర్ సాహిబ్ లో అంగరంగ వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి విదేశాల్లో స్థిరపడ్డ సిక్కులు సైతం పాల్గొని ఆనందిస్తారు.


బర్సాన
ఉత్తర ప్రదేశ్ లోని బర్సాన హోలీ వేడుకలకు దేశంలోనే ప్రసిద్ధి చెందినది. ఇక్కడి హోలీ ని లాల్ మార్ హోలీ అని పిలుస్తారు. స్థానికంగా 'మార్' అంటే కొట్టు అని. హోలీ రోజున స్త్రీలు కర్రలతో పురుషులను కొడతారు. రాధా కృష్ణా ఆలయంలో సంప్రదాయ నృత్యాలు, భక్తి పాటలు పాడతారు



అహ్మదాబాద్
అహ్మదాబాద్ లో హోలీ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే సంబరం ఆకట్టుకుంటుంది. కుండలో మజ్జిగ పోసి దానిని ఒక త్రాడు సహాయంతో వ్రేలాడదీస్తారు. యువకులు ఆ కుండను పగలగొట్టటానికి ప్రయత్నిస్తుంటే, అమ్మాయిలు వారిని ఆపేందుకై రంగు నీళ్ళు జల్లుతుంటారు. ఎవరైతే కుండను పగలగోడతాడో వారిని హోలీ రాజుగా ప్రకటిస్తారు.


ఇంఫాల్
మణిపూర్ రాజధానైనా ఇంఫాల్ లో హోలీ 6 రోజులపాటు జరుపుకుంటారు. రాత్రుళ్ళు జానపద నృత్యాలతో, పాటలతో ఆనందిస్తారు. యువకులు అమ్మాయిలకు తమతో 'గులాల్' ఆట ఆడమని డబ్బులిస్తారు. తెలుపు, పసుపు తలపాగా ధరించి 'గులాల్' ఆడుతూ నృత్యం చేస్తారు.


జైపూర్
హోలీ వేడుకలు జైపూర్ లో ఘనంగా జరుపుకుంటారు. ఏనుగులకు, ఒంటెలు, గుర్రాలకు వివిధ రంగులు పూసి అలంకరిస్తారు. ఆతరువాత వాటిని వీధుల్లో ఊరేగింపుగా తీసుకొస్తారు. కళాకారులు సంప్రదాయ రాజస్థానీ నృత్యాలను చేస్తారు. 


ఒడిశా
ఒడిశాలో పూరీ జగన్నాథ్ ఆలయం సహా స్థానికంగా ఉన్న జగన్నాథుడి ఆలయాల్లో రాధాకృష్ణుల విగ్రహాలు ఉంచి ప్రత్యేక పూజలు జరిపించి ఆ తరువాత వేడుకలు ప్రారంభిస్తారు.