మేష రాశి 


దేవగురువు బృహస్పతి, చంద్రుడు సంచారం మేష రాశివారికి శుభఫలితాలనిస్తుంది. వీరికి ధార్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగులు పనిపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారంలో లాభాలొస్తాయి. విద్యార్థులు చదువుపై దృష్టిసారిస్తారు. 


వృషభ రాశి


ఈ రోజు ఈ రాశివారు చాలా బిజీగా ఉంటుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. పరిగెత్తేటప్పుడు,వ్యాయామం చేసేటప్పుడు జాగ్రత్త. ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగులు, వ్యాపారులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు.


మిథున రాశి


అనవసరంగా ఖర్చు చేయకండి. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఆర్థిక ప్రయోజనాలు ఉండవచ్చు. శారీరక సమస్యలు పెరుగుతాయి జాగ్రత్త. ఈ రోజు మీరు సామాజిక సేవలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది కానీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది.


Also Read: హోలీ శుభాకాంక్షలు, కలర్ ఫుల్ విషెస్ చెప్పేయండిలా!


కర్కాటక రాశి


ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు ఈ రోజు విజయవంతమవుతాయి. సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆశీశ్సులు మీపై ఉంటాయి.


సింహ రాశి


సింహ రాశి వారికి ఈ రోజు శుభదినం. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మానసిక అశాంతి, విచారం, ఉదాసీనత తొలగిపోతాయి. తల్లిదండ్రుల ఆశీస్సులు, తోబుట్టువుల మద్దతుతో సంతోషంగా ఉంటారు. మీ కోపాన్ని నియంత్రించుకోండి..సున్నితంగా మాట్లాడండి.


కన్యా రాశి 


ఈ రాశివారికి నిర్భయ భావన ఉంటుంది. క్లిష్టమైన పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు ఉంటుంది. భార్య అనారోగ్యం మిమ్మల్ని బాధపెడుతుంది. వృధా ఖర్చులు చేయాల్సి రావొచ్చు.


తులా రాశి


ఈ రాశివారికి ధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సేవ చేయాల్సిన అవసరం వస్తే వెనకడుగు వేయకండి. కొత్త పెట్టుబడులు పెట్టేముందు జాగ్రత్తపడాలి. అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం మంచిది


వృశ్చిక రాశి



ఈ రోజు ఓ విషయంలో మీ మనసు కలత చెందుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం. ఓర్పు, ప్రతిభతో శత్రువులపై విజయం సాధిస్తారు. న్యాయపరమైన విషయాల్లో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది. పెండింగ్ లో ఉన్న వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆర్థిక లాభం ఉంటుంది.


ధనుస్సు రాశి


ఈ రోజు మీకు కలర్ ఫుల్ గా ఉంటుంది. అవసరమైన దగ్గర తెలివితేటలు ప్రదర్శిస్తారు. ఒకరికి సహాయం చేయాలన్న భావన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. అదృష్టం కలిసొస్తుంది..లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. 


Also Read: కామం దహించి ప్రేమ-సౌభాగ్యం వెల్లివిరిసిన రోజు హోలీ, రంగుల వేడుక వెనుక ఎన్నో పురాణ కథలు


మకర రాశి 


ఈరోజు ఆర్థిక విషయాలలో మిశ్రమంగా ఉంటుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించండి. ప్రియమైనదాన్ని కోల్పోవచ్చు. మరోవైపు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి, ఇష్టం లేకపోయినా ఖర్చు పెట్టక తప్పదు. జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది.


కుంభ రాశి 


అదృష్టం పరంగా ఈ రోజు శుభదినం. పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు వ్యాపారంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. కొత్త పెట్టుబడులు పెట్టేముందు మాత్రం ఆలోచించండి...ఇప్పుడు పెట్టే పెట్టుబడుల వల్ల భవిష్యత్తులో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహాయసహకారాలు లభిస్తాయి.


మీన రాశి 


ఒకరికి చేసిన సహాయం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ రోజు కొంత అశాంతి, చికాకు ఉండొచ్చు. చిన్న విషయానికి జీవిత భాగస్వామితో వివాదం పెట్టుకుంటారు. మీరు ఓ అడుగు వెనక్కు వేస్తేనే సమస్యను పరిష్కరించుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన  చెందుతారు.