త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ.  వాహనాలు, ఆయుధాలతో పాటు హిందూ దేవుళ్లు, దేవతల  రాజభనాల సృష్టికర్త అని చాలా మంది నమ్ముతారు. ద్వారకా నగరాన్ని విశ్వకర్మే సృష్టించాడని చెబుతారు. ఏటా సూర్య భగవానుడు సింహ రాశి నుంచి కన్యా రాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతి వేడుక  జరుపుకుంటారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 17 శుక్రవారం అంటే ఈ రోజే ఆ వేడుక. ఈ రోజున హస్తకళాకారులు విశ్వకర్మ పూజలో భాగంగా తమ పనిముట్లను ఉంచి ఆరాధిస్తారు. ఈ రోజున వాటిని ఏ పనికీ ఉపయోగించరు. తాము క్షేమంగా ఉండాలని..నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షింతగా ఉంచాలని.. తాము చేపట్టే ప్రతి పనిలో విజయం సాధించేలా చేయాలని విశ్వకర్మని ప్రార్థిస్తారు.


Also Read: అర్థరాత్రి వేణుగానం, గజ్జెల శబ్దాలు…ద్వాపరయుగం నుంచి కలియుగం వరకూ అంతుచిక్కని రహస్యం..ఆ ఆలయంలో చీకటి పడ్డాక ఏం జరుగుతుంది..!


విశ్వకర్మను దైవ వడ్రంగి, స్వయంభు అని పిలిచేవారు. ఈ పండుగ ఎక్కువగా అస్సాం, ఉత్తరప్రదేశ్, కర్నాటక, పశ్చిమబెంగాల్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాల్లో ఎక్కువగా జరుపుకుంటారు. నేపాల్ లోనూ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. విశ్వకర్మ జయంతి రోజున దేవాలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. విశ్వకర్మ  వాహనం అయిన ఏనుగును కూడా ఈ రోజు పూజిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తారు. అన్నదానాలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల గాలిపటాలు కూడా ఎగురవేస్తారు. వేదాలు విశ్వకర్మను సర్వపాప సంహర్తగా పేర్కొన్నాయి. సృష్టి ఆదినుంచి సుప్రసిద్ధులైన శిల్పకారులు ఐదుగురున్నారు. వీరు విశ్వకర్మకు జన్మించినవారే.



  1. కమ్మరి (అయోకారుడు) - ఇనుము పని

  2. సూత్రకారుడు(వడ్రంగి ) వర్ధకుడు - కొయ్య పని

  3. కాంస్యకారి (కంచరి) తామ్ర కారుడు - రాగి, కంచు, ఇత్తడి పని

  4. స్తపతి ( శిల్పి) శిల్ప కారుడు - రాతి పని

  5. స్వర్ణకారి (స్వర్ణకారుడు) - బంగారు పని


సాధారణంగా సృష్టికర్త అంటే బ్రహ్మదేవుడనే అనుకుంటాం. కానీ  కొన్ని పురాణాల ప్రకారం విశ్వకర్మను బ్రహ్మ దేవుని కుమారుడని చెబుతారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేదానికి ఎలాంటి ఆధారాలు లేవు.


Also Read: కృష్ణాష్టమి రోజు కృష్ణుడి అడుగులు వేసి స్వామిని ఇంటి లోపలకు ఆహ్వానించడం వెనుక ఇంత అంతరార్థం ఉందా..!


Also Read: రుక్మిణి తయారుచేయించిన శ్రీకృష్ణ విగ్రహం… ద్వారక నీట మునిగాక ఎక్కడకు చేరిందంటే


Also Read: సీతాదేవి నాకన్నా అందంగా ఉంటుందా అని అడిగిన సత్యభామకి శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు…!