Garuda Purana: మీరు పెళ్లి చేసుకోబోతున్నారా లేదా మీరు పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నట్లయితే, పెళ్లికి ముందు మీ భవిష్యత్ జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాల గురించి ముందుగా తెలుసుకుంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. సంతోషకరమైన, విజయవంతమైన వైవాహిక జీవితానికి సంబంధించిన అనేక రహస్యాలు గరుడ పురాణంలో పేర్కొన్నారు.
సాధారణంగా ప్రజలు గరుడ పురాణాన్నిఎవరైనా చనిపోయిన తర్వాత మాత్రమే చదవాల్సిన పుస్తకంగా భావిస్తారు. కానీ మరణం, మోక్షం, పాపం-పుణ్యం, స్వర్గం-నరకం, పునర్జన్మతో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలనూ ఈ గ్రంథంలో వివరించారు. వాటిని అనుసరించడం ద్వారా మీరు చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు. గరుడ పురాణంలో సరైన జీవిత భాగస్వామి గురించి కూడా ప్రస్తావించారు. ఈ పుస్తకం ప్రకారం, పెళ్లికి ముందు, మీరు మీ కాబోయే జీవిత భాగస్వామి గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పెళ్లికి ముందు ఈ విషయాలు తెలిస్తే మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది, కుటుంబంలో విబేధాలు, శత్రుత్వాలు ఉండవు.
అలవాట్లు
వివాహానికి ముందు, మీరు మీ భవిష్యత్ జీవిత భాగస్వామి అలవాట్ల గురించి తెలుసుకోవాలి. వైవాహిక జీవితంతో పాటు కుటుంబ, సామాజిక జీవితానికి ఇది చాలా ముఖ్యం. పెళ్లయ్యాక ఇబ్బందులు ఎదురవకూడదనుకుంటే, పెళ్లికి ముందే మీ జీవిత భాగస్వామి అలవాట్లను తెలుసుకోవడం మంచిది. ఇది మీ వైవాహిక జీవితాన్ని అర్థవంతంగా ఉంచుతుంది.
Also Read : మరణ సమయంలో స్వరం ఎందుకు పోతుందో తెలుసా?
సహనం
సంయమనంతో ఉన్న వ్యక్తి ప్రతి క్లిష్ట పరిస్థితిలో తన కుటుంబాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి, పెళ్లికి ముందు, మీ భాగస్వామికి సహనం లేదా స్వీయ నియంత్రణ ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. సహనం, సంయమనం ఉన్న వ్యక్తిని వివాహం చేసుకోవడం మంచిది.
కోపం
కోపంగా ఉన్న వ్యక్తి తన ప్రవర్తన ద్వారా అన్ని సంబంధాలను కోల్పోతాడు. అందుకే పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామి స్వభావాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. కోపం భార్యాభర్తల మధ్య సంబంధాలలో చీలికను సృష్టిస్తుంది. మితిమీరిన కోపంతో ఉన్న స్త్రీ లేదా పురుషుడు తన జీవిత భాగస్వామిని కఠినమైన పదాల ద్వారా బాధపెడతారు.
మాటతీరు
మీరు చిన్నచిన్న పదాలతో మధురంగా మాట్లాడితే అందరి హృదయాలను గెలుచుకోవచ్చు. జీవిత భాగస్వామికి ఈ గుణం ఉంటే మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కాబట్టి మధురంగా లేదా అందంగా మాట్లాడే జీవిత భాగస్వామిని ఎంచుకోండి.
Also Read : ఇలా చేస్తే దురదృష్టం కూడా అదృష్టమే..!
పరస్పర గౌరవం
మహిళలు ప్రతి వ్యక్తినీ గౌరవించాలని గరుడ పురాణం చెబుతోంది. ఏ వ్యక్తితోనూ ముఖ్యంగా భర్తతో ఎప్పుడూ పరుషమైన మాటలు మాట్లాడకండి. పెళ్లయిన ఇంట్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరితో బాగా మాట్లాడాలి. ఎవరూ తప్పుడు మాటలు మాట్లాడకూడదు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.