Samsung Galaxy Z Fold 5 and Flip 5 Price: శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, గెలాక్సీ ఫ్లిప్ 5లపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు జూలై 26వ తేదీన లాంచ్ కానున్నాయి. వీటి ధరలు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లూ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌తో రానున్నాయి. లాంచ్‌కు ముందు ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ వీటి ధర, ముందస్తు ఆఫర్ గురించి లీక్ చేశారు.
దేని ధర ఎంత?
అభిషేక్ యాదవ్ లీక్ చేసిన వివరాల ప్రకారం భారతదేశంలో శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 ధర రూ. 1,49,999గా ఉండనుంది. ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 1,43,999కే కొనుగోలు చేయవచ్చు. అదేవిధంగా శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 ధర రూ.99,999గా నిర్ణయించనున్నారు. అయితే ప్రారంభ ఆఫర్ కింద మీరు దీన్ని రూ. 94,999కి కొనుగోలు చేయగలుగుతారు.
మరోవైపు మీరు ఈ ఫోన్‌ను ఈఎంఐలో తీసుకోవాలనుకుంటే శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5ను రూ. 9,428, శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5ను రూ. 6,285 నెలవారీ ఈఎంఐకు కొనుగోలు చేయవచ్చు. ఇది అధికారిక ధర కాదు. లాంచ్ అయినప్పుడు దీని గురించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.
శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5, ఫ్లిప్ 5 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
శాంసంగ్ గెలాక్సీ ఫ్లిప్ ఫోన్‌లో 6.7 అంగుళాల మెయిన్ డిస్‌ప్లే, 3.4 అంగుళాల కవర్ డిస్‌ప్లే అందించనున్నారు. ఈ ఫోన్‌లో కనిపించే కవర్ డిస్‌ప్లే మోటొరోలా ఫోన్ కంటే చిన్నదిగా ఉంటుంది. మోటొరోలా ఫ్లిప్ ఫోన్‌లో 3.6 అంగుళాల కవర్ డిస్‌ప్లే అందించారు.
ఇక శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5లో 7.6 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లే, 6.2 అంగుళాల కవర్ డిస్‌ప్లే ఉండవచ్చు. ఫోటోగ్రఫీ కోసం ట్రిపుల్ కెమెరా సెటప్ అందించనున్నారు. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉండనున్నాయి. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ కెమెరాను చూడవచ్చు.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial