రియల్‌మీ సీ51 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అవ్వడానికి సిద్ధం అవుతోంది. దీనికి సంబంధించిన రెండర్లు, కీలక స్పెసిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ లీక్డ్ రెండర్ల ప్రకారం ఈ ఫోన్ కార్బన్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కానుంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఇందులో అందించారు. యూనిసోక్ టీ612 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుందని తెలుస్తోంది. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఈ ఫోన్‌లో ఉండనున్నాయి. ఈ ఫోన్‌లో వెనకవైపు రెండు కెమెరాలు ఉండనున్నాయి. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా అందించనున్నారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉండనుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
ప్రముఖ టిప్‌స్టర్ పరాస్ గుగ్లానీ దీనికి సంబంధించిన రెండర్లు, స్పెసిఫికేషన్లను లీక్ చేశారు. ఇటీవలే లాంచ్ అయిన రియల్‌మీ సీ55, సీ53ల తరహాలోనే ఇప్పుడు లాంచ్ కానున్న సీ51లో కూడా యాపిల్ డైనమిక్ ఐల్యాండ్ తరహా ఫీచర్ ఉండనుంది. ఎల్ఈడీ ఫ్లాష్ కూడా వెనకవైపు అందించారు. దీంతోపాటు వాల్యూమ్ రాకర్స్, పవర్ బటర్ ఫోన్‌కు ఎడమవైపు ఉన్నాయి.
ఈ లీకుల ప్రకారం... ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ టీ ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 6.7 అంగుళాల భారీ ఎల్సీడీ డిస్‌ప్లేతో రియల్‌మీ సీ51 లాంచ్ కానుంది. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.ర్యామ్‌ను 8 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.
రియల్‌మీ సీ53 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఇటీవలే మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్‌లో కంపెనీ 108 మెగాపిక్సెల్ కెమెరాను అందించింది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న వాటర్ డ్రాప్ నాచ్ తరహా డిస్‌ప్లే కూడా అందించారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ రియల్‌మీ సీ53లో ఉంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా 12 జీబీ వరకు ర్యామ్‌ను పెంచుకునే అవకాశం ఉంది.
ఈ ఫోన్‌లో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999గా ఉంది. టాప్ ఎండ్ మోడల్ అయిన 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.10,999గా నిర్ణయించారు. జులై 26వ తేదీన ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ.కాం వెబ్ సైట్లలో దీని సేల్ ప్రారంభం కానుంది.
Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial