Garuda Purana: ప్రజలు సాధారణంగా జ‌న‌నాన్ని ఆనందంగా స్వాగతిస్తారు. కానీ, మరణం ఆయా కుటుంబాల్లో బాధాకరమైన, విచారకరమైన ఘ‌ట‌నగా మిగిలిపోతుంది. మృత్యువు భయక‌ర‌మైన‌ద‌ని ప్ర‌జ‌లు నమ్ముతారు. పుట్టుక సాధారణమైనట్లే మరణం కూడా సాధారణ ప్రక్రియ. భగవద్గీత ప్రకారం, మరణం అనేది ఆత్మ పరివర్తన ప్రక్రియ. ఒక వ్యక్తి శరీరం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు, ఆత్మ తన శరీరాన్ని మరణం ద్వారా భర్తీ చేస్తుంది. ప్రజలు మరణానికి చాలా భయపడతారు, దాని వెనుక కారణం మరణ సమయంలో అనుభవించే బాధలు. మరణ సమయంలో చాలా మంది స్వరం కోల్పోతారు. వ్యక్తి ఏడవడం ప్రారంభిస్తాడు. మరణంలో ఒక వ్యక్తి తన స్వరాన్ని ఎందుకు కోల్పోతాడో తెలుసా?


జీవితం మొత్తం కళ్ల ముందు క‌నిపిస్తుంది
గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తికి మరణ స‌మ‌యం ఆస‌న్న‌మైనప్పుడు, ఆ వ్యక్తికి దివ్య దృష్టి క‌లుగుతుంది. ఆ వ్యక్తి ప్రపంచంలోని ప్రతిదాన్ని చూడటం ప్రారంభిస్తాడు. అతను మరణానికి ముందు తన మొత్తం జీవితంలోని సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుంటాడు. ఒక క్షణంలో, ఆ వ్యక్తి కళ్ళ ముందు మొత్తం జీవితం పునరావృతమవుతుంది. ఆ తరువాత, అతను తన కొత్త జీవిత ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు.


తేలు కుట్టినట్లు నొప్పి
మరణ సమయంలో, యమ దూతలు ఆ వ్యక్తి వద్దకు వచ్చి వెంటనే అతని ప్రాణాలను తీయడానికి ప్రయత్నిస్తారు. ఆ సమయంలో ఒక వ్యక్తి 100 తేళ్లు కుట్టిన బాధను అనుభవిస్తాడు. దీనితో పాటు, ఒక వ్యక్తి  నోరు లోపల నుండి పొడిగా మార‌డం ప్రారంభమవుతుంది. అతని నోటి నుంచి లాలాజలం బయటకు వ‌స్తుంది. గరుడ పురాణం ప్రకారం, పాపుల జీవిత శక్తి శరీరం యొక్క దిగువ భాగం నుంచి బ‌య‌ట‌కు వెళుతుంది.


యమదూతలు భయంక‌రంగా ఉంటారు
ఒక వ్యక్తికి చివరి ఘడియ వచ్చినప్పుడు, ఇద్ద‌రు యమ దూతలు అతని వద్దకు వస్తారు. గరుడ పురాణం ప్రకారం, యమదూతలు చూడటానికి చాలా భయంకరంగా ఉంటారు. పెద్ద‌ పెద్ద కళ్లు ఉన్న ఆ యమ దూతల‌ను చూసి పాపులు భయపడి మలవిసర్జన చేయడం ప్రారంభిస్తారని గరుడ పురాణం చెబుతోంది.


ఆత్మ‌ను బంధిస్తారు
మరణ సమయంలో, వ్యక్తి శరీరం నుంచి బొటనవేలు పరిమాణంలో ఒక జీవి బయటపడుతుంది. యమ దూతలు దానిని స్వాధీనం చేసుకుని, బంధించి యమలోకానికి బ‌య‌లుదేర‌తారు.


నరకానికి ప్రయాణం
ఒక వ్యక్తిని మరణానంతరం నరకానికి తీసుకువెళ్లినప్పుడు, యమరాజు దూతలు అతన్ని భయపెట్టి, న‌ర‌కంలో అనుభ‌వించాల్సిన‌ బాధల‌ను వివరిస్తారు. ఈ సమయంలో, వ్యక్తి తన పాపాలన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. త‌న త‌ప్పుల‌కు ప‌శ్చాత్తాప‌ప‌డుతూ బాధ, భయంతో నరకానికి ప్రయాణిస్తాడు. భగవద్గీత, గరుడ పురాణం, కఠోపనిషత్తు వంటి మత గ్రంథాలలో మరణం గురించి చాలా విషయాలు వివ‌రించారు. దీని కారణంగా, మరణ సమయంలో ఒక వ్యక్తి స్వరం ఆగిపోతుంది. అతని శరీరం నొప్పిని అనుభవించడం ప్రారంభిస్తుంది.


Also Read : రోజూ ఈ 4 నియమాలు పాటిస్తే మోక్షం పొందుతారు!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.


Also Read : దానం చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా - దాన‌ధ‌ర్మాల విష‌యంలో గ‌రుడ పురాణం ఏం చెబుతోందో తెలుసా!