Ganesh Chaturthi 2023: విజయానికి మారు పేరు వినాయకుడు. ఏ పనైనా విఘ్నేశ్వరుడిని తలుచుకుని ప్రారంభిస్తే  ఎలాంటి విఘ్నాలు ఎదురైనా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఏ పని తలపెట్టినా, ఎంత పెద్ద పూజ, యజ్ఞయాగాలు చేసినా లంబోదరుడి ప్రార్థన లేకుండా మొదలుకాదు. అందుకే  చిన్నారులకు, విద్యార్థులకు గణనాథుడి శ్లోకాలు నేర్పించాలంటారు. ఎలాగూ వినాయక చవితి పండుగ వస్తోంది.. ఈసందర్భంగా పండుగ రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేసేందుకు , నిత్యం చదువుకునేందుకు వినాయకుడి శ్లోకాలు కొన్ని...


Also Read: వినాయక చవితికి ఇలాంటి బొమ్మను తెచ్చుకోండి!


శ్లోకం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే
ఏకదంత ముపాస్మహే


శ్లోకం
వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ
నిర్విఘ్నం కురుమే దేవ..సర్వకార్యేషు సర్వదా


శ్లోకం
మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర|
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే||


Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!


శ్లోకం
గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం|
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం||


శ్లోకం
సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః|
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః||


గణేశ గాయత్రి
ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి 
తన్నో దంతిః ప్రచోదయాత్


సిద్ధి వినాయక మంత్రం
ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే
సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్
సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా ||


శ్రీ గణేశ ద్వాదశ నామం


శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ||


అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో య స్సురాసురైః |
సర్వవిఘ్న హర స్తస్మైగణాధిపతయే నమః ||


గణానమధిపశ్చండో గజవక్త్ర స్త్రిలోచనః |
ప్రసన్నోభవ మే నిత్యంవరదాతర్వినాయక ||


సుముఖశ్చైకదంతశ్చ కపిలోగజకర్ణకః |
లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః ||


ధూమ్రకేతుః గణాధ్యక్షో భాలచంద్రో గజాననః |
ద్వాదశైతాని నామాని గణేశస్య చయః పఠేత్ ||


విద్యార్థీ లభతేవిద్యాం, ధనార్థీ విపులం ధనమ్ |
ఇష్టకామం తు కామార్థీ , ధర్మార్థీ మోక్షమక్షయమ్ ||


విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సంకటేచైవ విఘ్నస్తస్య నజాయతే ||


ఇతి ముద్గలోక్తం శ్రీగణేశ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణమ్ ||


ఏటా వినాయక చవితి భాద్రపద మాసం శుక్లపక్షంలో నాలుగో తిథి అయిన చవితి రోజు వస్తుంది. చవితి నుంచి చతుర్థశి వరకూ ప్రత్యేక పూజలందుకున్న గణనాథుడిని ఆ తర్వాత వైభవంగా గంగమ్మ ఒడికి చేరుతాడు. ఈ ఏడాది సెప్టెంబరు 18 సోమవారం వినాయకచవితి వచ్చింది.  వినాయక చవితి రోజు ప్రారంభమై తొమ్మిది రోజుల పాటూ ప్రత్యేక పూజలు నిర్వహించి...పదో రోజు ఊరేగింపుగా తీసుకెళ్లి గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఆ తొమ్మిది రోజులూ ఊరూవాడా సంబరమే. 


Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!


Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.