Horoscope Today  September 15, 2023: (సెప్టెంబరు 15 రాశిఫలాలు)


మేష రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు కాదు.  ఏదో ఒకదాని గురించి  మనసులో కొంచెం ఆందోళన ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తారు. విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. నిన్నటి వరకూ వెంటాడిన కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. 


వృషభ రాశి 
ఈ రోజు కొంత అలసటగా ఉంటుంది. అనుకోని కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుంది. అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. సమతుల ఆహాం తీసుకోవడం మంచిది. ఈరోజు ఎక్కడైనా పిల్లలకు మిఠాయిలు పంచిపెట్టడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. వ్యాపారం చేసే వారికి జాగ్రత్తగా ఉండాలి.. నూతన పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞుల సలహాలు స్వీకరించడం మరిచిపోవద్దు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది జాగ్రత్త. మీరు ప్రారంభించే పనులకు మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు ఉంటుంది. 


మిథున రాశి
ఈ రోజు ఈ రాశివారు కొన్ని చర్చలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులు ఈ రోజు పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టొద్దు. అనవసర ఒత్తిడికి లోనవుతారు, మానసిక సమస్యలతో బాధపడతారు.  ఉద్యోగులకు బాగానే ఉంటుంది. కెరీర్ కి సంబంధించి నిర్ణయం తీసుకునేందుకు ఇదే సరైన సమయం. వివాదాలకు దూరంగా ఉండాలి


కర్కాటక రాశి 
ఈ రోజు ఈ రాశివారి మంచి రోజు అవుతుంది. ఓ గుడ్ న్యూస్ వింటారు. ఈ రోజు మీరు మీ కుటుంబ సభ్యులు లేదా బంధువులకు సంబంధించిన ఏదైనా శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. బంధువుతో విభేదాలు రావొచ్చు. వ్యాపారం చేసే వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. ఆచి తూచి మాట్లాడడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. 


Also Read: వినాయక చవితికి ఇలాంటి బొమ్మను తెచ్చుకోండి!


సింహ రాశి
ఈ రోజు మీరు భారీ ప్రయోజనాలు పొందబోతున్నారు. పెండింగ్ డబ్బు  చేతికి అందుతుంది. రోజంతా సంతోషంగా ఉంటారు. మీ గౌరవం పెరుగుతుంది. మంచి పని కారణంగా మీరు ఈ రోజు ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పాత స్నేహితులను కలుస్తారు. వ్వాపారులు అజాగ్రత్తగా ఉండొద్దు.  ఏదైనా కొత్త పనిని ప్రారంభించే ముందు అనుభవజ్ఞుల నుంతి సలహా తీసుకోండి లేదంటే నష్టపోతారు.


కన్యా రాశి 
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీకు తెలిసిన వారి మొరటు ప్రవర్తన వల్ల మీరు గాయపడవచ్చు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి.  ఉద్యోగస్తులు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. అనుకోని పెద్ద ఆఫర్ పొందుతడంతో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.


తులా రాశి
ఈ రాశివారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు కుటుంబ సభ్యులతో సమయం స్పెండ్ చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఏదైనా పొట్టకు సంబంధించిన సమస్య ఉండొచ్చు. కెరీర్లో ముందుకుసాగేందుకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో అనవసర వాదనలు ఉంటాయి. మనస్సు విచారంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి అనిపిస్తుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే జాగ్రత్తగా ఉండాలి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఏవైనా సలహాలు తీసుకున్నాకే అడుగు ముందుకేయండి.
 
వృశ్చిక రాశి 
ఈ రాశివారికి ఈ రోజు తలపెట్టిన పనుల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి కానీ పనిని తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది. కుటుంబంతో గడిపిన సమయం చాలా గుర్తుండిపోతుంది. వ్యాపారం చేసే వారికి ఈరోజు జాగ్రత్త వహించాల్సిన సమయం...ఎవ్వరి సలహాలు పాటించవద్దు, మీ సొంత నిర్ణయం మీరు తీసుకుంటే మంచిది. కుటుంబ బాధ్యతలను పూర్తి చేయగలుగుతారు. పిల్లల భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.


Also Read: ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణకు మూహూర్తం ఫిక్స్!


ధనుస్సు రాశి 
ఈ రోజు ఈ రాశివారికి సమస్యాత్మకంగా ఉంటుంది. ఏ విషయాన్ని అయినా లోతుగా ఆలోచిస్తారు..ఇది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ రోజు మీరు మీ కుటుంబానికి సంబంధించిన ఓ ప్రత్యేకమైన వ్యక్తిని కలుస్తారు. సృజనాత్మక పనులు చేస్తారు. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. చదువుపై శ్రద్ధ పెంచాలి. వైవాహిక జీవితం బావుంటుంది. పెద్దల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. 


మకర రాశి 
ఈ రాశివారికి అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త. వ్యాపారులకు ఈరోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. షేర్ మార్కెట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టినట్లయితే, చాలా తెలివిగా పెట్టుబడి పెట్టండి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఈ రోజు అనుకూలమైన సమయం. కొన్ని కారణాల వల్ల కలత చెందుతారు. ప్రశాంతత లభించాలంటే కుటుంబానికి సమయం కేటాయించాలి. 


కుంభ రాశి
ఈ రోజు కుటుంబంలో మీ గౌరవం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావచ్చు. వ్యాపారులకు అస్సలు టైమ్ బాలేదు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిడికి లోనవుతారు. శ్రామికులకు ఈ రోజు అస్సలు మంచి రోజు కాదు. ఏదైనా పెద్ద విషయంలో వివాదం ఉండొచ్చు. 


మీన రాశి
ఈ రాశి ఉద్యోగులకు ఈ రోజు కొంత ఇబ్బందిగా ఉంటుంది. మీ ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉన్నారు మీరు అప్రమత్తంగా ఉండాలి.  పిల్లల కారణంగా మనసులో ఏదో బాధ ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వివాదాలు చుట్టుముడతాయి.  ఆధ్యాత్మి విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మాటలను నియంత్రించుకోవాలి. 


గమనిక:ఓ రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే చెందుతాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.