Happy Father's Day 2024: తొలి అడుగు తన గుండెలపై వేయించుకుని తన ఊపిరిపోయేవరకూ ప్రతి అడుగులోనూ వెన్నంటే ఉండి నడిపించే నాన్న గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. ఆ ప్రేమకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం..ఈ జనరేషన్ అయితే లవ్ యూ నాన్న అని సంతోషంగా చెప్పేస్తున్నారు.. మరికొందరు బహుమతులు ఇచ్చి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు. అయితే పురాణపురుషులు మాత్రం తమ ప్రేమను మాటల్లో చెప్పలేదు..చేతల్లో చూపించారు. ఈ జాబితాలో చాలా మంది ఉన్నప్పటికీ..ముఖ్యంగా నలుగురి గురించి చెప్పుకోవాలి...వాళ్లే రాముడు, భీష్ముడు, పరశురాముడు, శ్రవణకుమారుడు...


దశరథుడు - శ్రీ రాముడు


అయోధ్యకు రాజైన దశరధుడి ముగ్గురి భార్యల్లో కౌశస్య తనయుడు శ్రీరాముడు. నలుగురు సోదరులలో పెద్దవాడైన రాముడు... దశరథుడి తర్వాత సింహాసాన్ని అధిష్టించాలి, పాలనా బాధ్యతలు స్వీకరించాలి. పెళ్లి జరిగింది, తెల్లారితే పట్టాభిషేకం జరుగుతుందన్న సమయంలో.. కైకేయి కోరిన వరాల కారణంగా రాముడు అడవులబాటపట్టాల్సి వచ్చింది. ఓ యుద్ధం సమయంలో సహాయం చేసినందుకు కృతజ్ఞతగా దశరథుడు ఇచ్చిన వరాలను కైకేయి...రాముడి పట్టాభిషేకం జరిగేముందు వినియోగించుకుంది. తనని చూడకుండా తండ్రి ఒక్క క్షణం కూడా జీవించి ఉండలేడని తెలిసినా, తండ్రి మానసిక క్షోభను అర్థం చేసుకున్నా.. ఒక్కమాటకూడా మాట్లాడకుండా అడవుల బాటపట్టాడు.  పితృవాక్య పరిపాలకుడిగా తండ్రిపై ప్రేమను ఇలా చాటుకున్నాడు రాముడు..


Also Read: ఎవ్వరూ చూడడం లేదు అనుకుంటే ఎలా...మిమ్మల్ని మౌనంగా గమనించే 18 సాక్షులు ఇవే!
 
శంతనుడు - భీష్ముడు


హస్తినాపురానికి రాజైన శంతనుడు..ఓ సమయంలో నది ఒడ్డున గంగాదేవిని చూసి వివాహం చేసుకోమని అడుగుతాడు. అయితే గంగాదేవి తనని ప్రశ్నించకూడదు అనే షరతు విధించి వివాహానికి అంగీరిస్తుంది. కానీ పుట్టిన సంతానాన్ని నీటిలో విసిరేస్తున్న గంగాదేవిని ఓ రోజు ప్రశ్నిస్తాడు శంతనుడు. వెంటనే తన చేతిలో ఉన్న బిడ్డను శంతనుడికి అప్పగించి వెళ్లిపోతుంది గంగాదేవి. తనే భీష్ముడు. ఆ తర్వాత కొంతకాలానికి వేటకు వెళ్లిన శంతనుడు సత్యవతి అనే జాలరి కన్యను చూసి వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. అయితే తమ కుమార్తెకు పుట్టినవారే రాజ్యానికి రాజు కావాలని సత్యవతి తల్లిదండ్రులు షరతు విధించడంతో శంతనుడు ససేమిరా అని వచ్చేస్తాడు. కానీ తండ్రి ఆనందం కోసం భీష్ముడు రాజ్యాన్ని త్యాగం చేస్తున్నానంటూ భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. 


జమదగ్ని- పరశురాముడు 


శ్రీ మహావిష్ణువు ఆవేశ అవతారంగా చెప్పే పరశురాముడు..జమదగ్ని, రేణుకకు జన్మించాడు. ఓరోజు జమదగ్ని మహర్షి..భార్యను గంగాజలం తీసుకురమ్మని పంపించాడు. అదే సమయానికి నది దగ్గర  చిత్రరథుడు అనే గంధర్వుడు అప్సరసలతో కలసి ఆడుతున్న జలక్రీడలను చూస్తుండిపోయింది రేణు.కాసేపటికి తేరుకుని గబగబా ఇంటికి చేరుకుంది. కానీ అప్పటికే పూజాసమయం మించిపోవడంతో  ఏం జరిగిందా అని తన తపోశక్తితో తెలుసుకున్నాడు జమదగ్ని. వెంటనే తన సంతానాన్ని పిలిచి..ఆమె తల తీసేయమని ఆజ్ఞాపించాడు. ఎవ్వరూ ముందుకు రాకపోయినా తండ్రిమాటను పాటిస్తూ చెప్పిన పని చేసన పరశురాముడు..తండ్రి ఏం కావాలో కోరుకోమనగానే తల్లిని బతికించమని ప్రార్థించాడు. అలా తండ్రి మాట జవదాటకుండానే తిరిగి తల్లిని బతికించుకున్నాడు.  


Also Read: ఈ ఆలయంలో 4 స్తంభాలు 4 యుగాలకి ప్రతీక - ప్రస్తుతం ఉన్న ఒక్క స్తంభం కూలిపోతే కలియుగాంతమే!


శ్రవణకుమారుడు


రామాయణ కాలానికి చెందిన వృద్ధ దంపతులకు జన్మించినవాడే శ్రవణకుమారుడు. వయసు మళ్లిన తల్లిదండ్రులను పోషించేందుకు చిన్నప్పటి నుంచీ చాలా కష్టాలు ఎదుర్కొన్నాడు శ్రవణకుమారుడు. కాశీకివెళ్లి గంగలో స్నానమాచరించాలన్న వారి కోరికమేరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వయసుపైబడి చూపుమందగించిన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని భుజంపై మోసుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. మార్గ మధ్యలో తల్లిదండ్రుల దాహం తీర్చేందుకు ఓ కొలను వద్దకు వెళ్లిన సమయంలో..నీటి సవ్వడి విని జంతువు అనుకుని చూసుకోకుండా బాణం వేసేసాడు దశరథుడు. ఆ తర్వాత శ్రవణకుమారుడి అరుపు విని అక్కడకు వెళ్లిన దశరథుడు పశ్చాత్తాపపడ్డాడు. ఆ పాప ఫలితమే దశరథుడికి కూడా చివరిక్షణాల్లో రాముడు దూరంకావడం.


Also Read: కలి ఎవరు? కల్కి ఎవరు? ధర్మ సంస్థాపన ఏంటి? యుగాంతం ముందు కనిపించే సంకేతాలేంటో తెలుసా!