Niharika Konidela: ఏపీ ఎన్నికలు అనేవి మామూలు సెన్సేషన్ క్రియేట్ చేయలేదు. పాలిటిక్స్ అంటే ఐడియా లేని వారు కూడా ఏపీ ఎన్నికల్లో తర్వాత ఏం జరుగుతుందో అని ఆసక్తిగా ఎదురుచూశారు. అలా ఎదురుచూసిన వారిలో మెగా ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈసారి ఎలక్షన్స్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాల్గొనడం, మెగా ఫ్యామిలీ అంతా ముందుకొచ్చి తనకు మద్దతు తెలపడంపై ప్రేక్షకులు బాగా ఫోకస్ పెట్టారు. ఇక ఈ ఎన్నికల్లో పవన్‌కు తన మద్దతును ప్రకటించలేదు అల్లు అర్జున్. దీంతో మెగా ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. దానిపై నిహారిక కొణిదెల తాజాగా స్పందించింది.


నిహారికకు ప్రశ్న..


మెగా హీరో సాయి దుర్గా తేజ్.. తాజాగా అల్లు అర్జున్‌ను తన ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో అన్‌ఫాలో చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. మెగా ఫ్యాన్స్ అంతా ఒకవైపు, అల్లు ఫ్యాన్స్ అంతా ఒకవైపు చేరి దీనిగురించి చర్చించుకుంటున్నారు. కానీ ఇతర మెగా హీరోలు మాత్రం ఈ విషయంపై స్పందించడానికి ఇష్టపడలేదు. పైగా ఎవరి సినిమాల్లో వారు బిజీగా ఉంటూ దీని గురించి మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు. తాజగా నిహారిక కొణిదెల.. తను నిర్మిస్తున్న ‘కమిటీ కుర్రోళ్లు’ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యింది. దీంతో సాయి దుర్గా తేజ్.. అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంపై తనకు ప్రశ్న ఎదురయ్యింది.


మీరు చెప్తేనే తెలుస్తుంది..


సాయి దుర్గా తేజ్.. అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేయడంపై మీ స్పందన ఏంటని నిహారికను అడగగా.. ‘‘సారీ. ఈ విషయం మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. నాకు దీని గురించి తెలియదు. కానీ ఏదైనా కూడా వాళ్ల కారణాలు వాళ్లకు ఉంటాయి’’ అని సింపుల్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది ఈ మెగా వారసురాలు. మెగా ఫ్యామిలీ అంతా ఒకటే, అల్లు అర్జున్ కూడా ఇందులో భాగమే అనుకున్న ఫ్యాన్స్‌లో ఈ విషయం మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అల్లు శిరీష్‌ను ఫాలో చేస్తూనే ఉన్న సాయి దుర్గా తేజ్.. కేవలం అల్లు అర్జున్‌నే అన్‌ఫాలో చేయడమేంటి, ఇదంతా ఎన్నికల వల్లేనా అని చాలా సీరియస్‌గా చర్చించుకుంటున్నారు కూడా.


అదే కారణం..


అసలు ఏం జరిగిందంటే.. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటికి దిగారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి తన వారసుడు రామ్ చరణ్ వరకు అందరూ ఆయనను సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చారు. అల్లు అర్జున్ కూడా మొదట్లో తాను పవన్ కళ్యాణ్‌కే సపోర్ట్ చేస్తున్నట్టుగా పరోక్షంగా తెలిపాడు. కానీ ఎన్నికల ప్రచారాల విషయానికి వచ్చేసరికి అల్లు అర్జున్.. నంద్యాల వెళ్లి అక్కడ వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి మద్దుతునిచ్చాడు. దీంతో మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా షాకయ్యారు. పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత మెగా ఫ్యామిలీ సెలబ్రేషన్స్‌లో కూడా తను ఎక్కడా కనిపించలేదు. ఇంతలోనే సాయి దుర్గా తేజ్.. అల్లు అర్జున్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేశాడు.


Also Read: పవన్‌తో పెళ్లికి ముందు అన్నా లెజినోవా ఏం చేసేవారో తెలుసా? రష్యా, సింగపూర్‌లో అన్ని కోట్ల ఆస్తులున్నాయ్!