5 Facts About Anna Lezhneva: 2024 ఏపీ ఎన్నిక‌లు ముగిశాయి. అనూహ్యంగా ఎన్డీయే కూట‌మి విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు అంద‌రూ ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్న వ్య‌క్తి... ప‌వ‌న్ క‌ల్యాణ్. పిఠాపురం నుంచి దాదాపు 70వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన ఆయ‌న ఏపీ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ప‌వ‌న్ గెలుపుని అటు ఫ్యాన్స్, ఇటు కుటుంబ‌స‌భ్యులు గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇప్పుడు అంద‌రూ ప‌వ‌న్ క‌ల్యాణ్ భార్య అన్నా లెజినోవా గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఎన్నిక‌ల ముందు, ఆ త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ కి స‌పోర్ట్ గా అన్నా లెజినోవా ఉన్నార‌ని, హార‌తి ఇచ్చి వీర తిల‌కం దిద్ది, ఆయ‌న చెప్పులు చేత‌ప‌ట్టుకుని సింపుల్ గా, అంద‌రితో క‌లిసి పోతున్నార‌ని మాట్లాడుకుంటున్నారు. ర‌ష్య‌న్ అయిన‌ప్ప‌టికీ సంద‌ప్ర‌దాయ బ‌ద్దంగా చీర‌క‌ట్టుకుని, హార‌తి ఇచ్చి వీర‌తిల‌కం దిద్దింది అంటూ ప‌వ‌న్ ఫ్యాన్స్ తెగ సంబ‌ర‌ప‌డిపోతున్నారు. మ‌రి అన్నా లెజినోవా బ్యాగ్రౌండ్ ఏంటి? ఆమె గురించి కొన్ని విష‌యాలు తెలుసుకుందాం. 


అస‌లు ఎవ‌రీ అన్నా లెజినోవా? 


అన్నా లెజినోవా 1980లో రష్యాలో పుట్టారు ఆమె. యాక్టింగ్, మోడ‌లింగ్ చేశారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి 'తీన్మార్' సినిమాలో న‌టించారు. 2011లో వాళ్లిద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డ‌గా అది కాస్తా ప్రేమ‌గా మారింది. 2013 సెప్టెంబ‌ర్ 30న ఇద్ద‌రు పెళ్లి చేసుకున్నారు. అన్నా లెజినోవా అప్ప‌టికే తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. అన్నా లెజినోవా ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఒక కొడుకు. పేరు మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్. అన్నా లెజినోవాకి ఫ‌స్ట్ భ‌ర్త‌తో ఒక కూతురు ఉంది. ఆ పాప పేరు పొలినా అంజ‌నా ప‌వ‌నోవా. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ కి కూడా అప్ప‌టికే 1997లో నందిని అనే అమ్మాయితో వివాహం అయ్యింది. 2008లో వాళ్లిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత ‘బ‌ద్రి’ సినిమా టైంలో నటి రేణు దేశాయ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డి.. అది ప్రేమ‌గా మారింది. 2009లో వాళ్లిద్ద‌రి వివాహం చేసుకున్నారు. రేణు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఇద్ద‌రు పిల్ల‌లు వాళ్లే అకిరా నంద‌న్, ఆద్య‌. కొన్ని కార‌ణాల వ‌ల్ల 2012లో వాళ్లిద్ద‌రు విడాకులు తీసుకున్నారు. 


హోట‌ల్ బిజినెస్.. 


పవన్‌తో పెళ్లికి ముందు మోడ‌లింగ్, యాక్టింగ్ కెరీర్ గా ఎంచుకున్న అన్నాలెజినోవా.. హోట‌ల్ బిజినెస్ కూడా నిర్వ‌హిస్తున్నారు. సింగపూర్ లో ఆమెకు హోట‌ల్ చైన్స్ ఉన్నాయ‌ట‌. ర‌ష్యా, సింగ‌పూర్ లో క‌లిపి ఆమెకు దాదాపు రూ.1800 కోట్లు విలువ‌ చేసే ఆస్తులు ఉన్నట్లు సమాచారం.


విడిపోయారంటూ పుకార్లు.. 


అన్నా లెజినోవా, ప‌వ‌న్ క‌ల్యాణ్ పై పుకార్లు షికార్లు చేశాయి చాలాసార్లు. మెగా ఫ్యామిలీ ఫంక్ష‌న్స్, పార్టీల్లో అన్నా లెజినోవా పెద్ద‌గా క‌నిపించ‌రు. దీంతో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఆమె ఇద్ద‌రు విడిపోయార‌ని చాలా వార్త‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. వ‌రుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ కి రాక‌పోవ‌డం, క్లింకారా ఉయ్యాల ఫంక్ష‌న్ త‌దిత‌ర పార్టీల్లో క‌నిపించ‌క‌పోవ‌డంతో ఈ వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. అయితే, వాటిని ప‌టా పంచ‌లు చేస్తూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపు త‌ర్వాత ఆమె ప‌వ‌న్ తోనే ఉన్నారు. ఆయ‌నతో క‌లిసి ప్ర‌ధాని మోడీని క‌లిశారు. చిరంజీవి ఇంటికి వెళ్లారు, ప్ర‌మాణ‌స్వీకారినికి కూడా హాజ‌ర‌య్యారు. అంతేకాకుండా సంప్ర‌దాయ బ‌ద్దంగా చేయాల్సిన కొన్ని ప‌నుల‌ను కూడా ఆమె నెర‌వేర్చారు. 






ప్ర‌మాణ‌స్వీకారంలో ఎమోష‌న‌ల్.. 


ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎమ్మెల్యే కావాల‌ని, సీఎం కావాల‌నేది ప‌దేళ్ల క‌ల‌. పార్టీ పెట్టిన ప‌దేళ్ల‌కి ఆ క‌ల సాకారం అయ్యింది. అంత‌కుముందు ఎన్నో మాట‌లు ప‌డ్డారు. ఆయ‌న ఫ్యామిలీని, భార్య‌ను కూడా ఎన్నో మాట‌లు అన్నారు. వాట‌న్నింటికీ స‌మాధానంగా మంత్రిగా  ప్ర‌మాణ‌స్వీకారం చేశారు ప‌వ‌న్ క‌ల్యాణ్. ఆ క్ష‌ణం ప్ర‌పంచంలోని ప్ర‌తి అభిమాని ఆనందంతో ఎగిరి గంతేశారు. ఎమోష‌నల్ అయ్యారు. అన్నా లెజినోవా కూడా అంతే ఎమోష‌నల్ అయ్యారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే నేను అని ఆయ‌న ప్ర‌మాణ‌స్వీకారం చేస్తున్న టైంలో లెజినోవా ముఖం వెలిగిపోయింది. ఆమె ఎమోష‌న ల్ అయ్యారు. 


Also Read: హన్సికాకు థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్ - ఎందుకో తెలుసా?