Nivetha Pethuraj About Viral Video: నివేద పేతురాజు, నరేష్ అగస్త్య కీలక పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'పరువు'. జూన్ 14న జీ తెలుగు ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ సిరీస్ ని ప్రొడ్యూస్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది ఈ సిరీస్. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో నిర్వహించింది సినిమా టీమ్. ఈ సందర్భంగా నివేదా పేతురాజు గతంలో వైరల్ అయిన వీడియో గురించి మాట్లాడారు. తనకు చాలా కాల్స్ వచ్చాయని, అమ్మ కూడా ఫోన్ చేసి తిట్టారని చెప్పుకొచ్చారు. ఆమె ఏమన్నారంటే?
మీరే నాకు స్ఫూర్తి..
వెబ్ సిరీస్ లు చేయడం చాలా కష్టమైన పని అని, అలాంటిది సుస్మిత గారు ధైర్యం చేశారని అన్నారు నివేద. ఈ సందర్భంగా ఆమె సిరీస్ గురించి మాట్లాడుతు.. "గోల్డ్ బాక్స్, సుస్మిత గారికి చాలా చాలా థ్యాంక్స్. వెబ్ సిరీస్ చేయడం అనేది చాలా కష్టం. ఇలాంటి ఒక స్టోరీని ఎంపిక చేసుకోవడం ఇంకా కష్టం. మీ ధైర్యానికి హ్యాట్సాఫ్. సినిమా ఫీల్డ్ లో, పర్సనల్ గా, చాలా విషయాల్లో మీరే నాకు స్ఫూర్తి. దీనికంటే ముందు నేను హిందీలో ఒక వెబ్ సిరీస్ చేశాను. అది నాకు చాలా కష్టంగా అనిపించేది. స్టోరీని అర్థం చేసుకోవడం ఇబ్బంది పడేదాన్ని. క్యారెక్టర్ నుంచి డీవీయేట్ అయ్యేదాన్ని. కానీ, సిదార్థ, రాజ్ మీరు అద్భుతంగా రాశారు. నేను మిమ్మల్ని గుడ్డిగా నమ్మాను. ఔట్ పుట్ చాలా చాలా సూపర్ గా వచ్చింది. ఒక యాక్టర్ గా పరువులో చేసిన డాలీ క్యారెక్టర్ ఎప్పటికీ నా ఫేవరెట్" అని చెప్పారు నివేద.
చాలామంది కాల్స్ చేశారు..
'పరువు' ప్రమోషన్స్ లో భాగంగా నివేదాకి సంబంధించి ఒక వీడియో గతంలో వైరల్ అయ్యింది. ఆమె కారు డిక్కీని ఓపెన్ చేయమని పోలీసులు అడిగితే తెరవకుండా వాళ్లతో గొడవ పెట్టుకుంది. నిజంగానే నివేదా అలా పోలీసులతో గొడవ పడింది అనుకున్నారు అందరూ. కానీ, అది 'పరువు' ప్రమోషన్స్ కోసం తీసిన వీడియో అని తర్వాత జీ క్లారిటీ ఇచ్చింది. ఆ వీడియోపై స్పందించారు నివేద. వీడియో చూసి ఎవరైనా కాల్స్ చేశారా? ఎలాంటి కామెంట్లు పెట్టారు అని అడిగిన దానికి ఆమె చాలా కాల్స్ వచ్చాయని, తన తల్లి కూడా కాల్ చేసిందని చెప్పారు.
"ఆ వీడియో ఐడియా శ్వేతది. నిజానికి హైదరాబాద్ లో చేద్దాం అనుకున్నాం ఆ వీడియో. చెన్నైలో చేయాల్సి వచ్చింది. అనుకున్నదానికంటే బాగా వైరల్ అయ్యింది. నేను మాములుగా ఒక వైట్ డ్రెస్ లో ఉన్నాను. కనీసం మేకప్ కూడా చేసుకోలేదు. దీంతో అందరూ నిజం అని నమ్మేశారు. చాలామంది కాల్ చేశారు. మా అమ్మ కూడా కాల్ చేశారు. పోలీసులతో నీకు ఎందుకు గొడవ? అని అన్నారు. అప్పుడు చెప్పాను పరువు ప్రమోషన్ కోసం అది అని అన్నాను. చాలా చాలా కాల్స్ వచ్చాయి. థ్యాంక్యూ జీ టీమ్. నిజానికి నా కార్ డిక్కీలో అంతా ట్రాష్ ఉంటుంది. బాటిల్స్.. అదే వాటర్ బాటిల్స్ ఉంటాయి" అని వీడియోపై స్పందించారు నివేద.
Also Read: మనుషులను చంపి, వారి మాంసాన్ని అమ్మే భార్యభర్తలు - ఈ ఆఫర్ వెజిటేరియన్లకు మాత్రమే!