Allu Arjun Thanks to Hansika Motwani: ఈ మ‌ధ్య ఏ పాట‌లో చూసినా ఒక హుక్ స్టెప్ క‌చ్చితంగా ఉంటుంది. ఎలా అంటే రీల్స్ చేసేందుకు వీలుగా క‌చ్చితంగా అలాంటి ఒక స్టెప్ కంపోజ్ చేస్తున్నారా డ్యాన్స్ మాస్ట‌ర్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ పాట‌లో చూసినా క‌చ్చితంగా అలా వైర‌ల్ అయ్యే స్టెప్ట్స్ క‌నిపిస్తున్నాయి. ఇక ఈ మ‌ధ్య రిలీజైన 'పుష్ప - 2'  సినిమాలోని పాట కూడా అంతే. ఇన్ స్టా తెరిస్తే చాలు ఆ పాట మీద రీల్స్. చిన్న పిల్ల‌ల నుంచి పెద్ద‌వాళ్ల దాకా.. 'సూసేకి అగ్గిర‌వ్వ‌మాదిరి' అంటూ రీల్ చేసేస్తున్నారు. చాలామంది సెల‌బ్రిటీలు కూడా ఆ పాట‌కి కాలు క‌దిపారు. ఇక ఇప్పుడు హ‌న్సిక కూడా ఆ రీల్ చేసింది. 


థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. 


హ‌న్సిక చ‌క్క‌గా ప‌సుపు రంగు లంగా ఓణీ వేసుకుని, కొంత‌మంది డ్యాన్స‌ర్ల‌తో క‌లిసి 'సూసేకి అగ్గిర‌వ్వ‌మాదిరి' అంటూ రీల్ చేసి పోస్ట్ చేసింది. ఆ రీల్ చూసిన 'పుష్ప - 2'  హీరో అల్లు అర్జున్ ఫిదా అయిపోయిన‌ట్లు ఉన్నారు. వెంట‌నే ఆ రీల్‌‌ను త‌న ఇన్ స్టా స్టోరీలో పెట్టి.. 'థ్యాంక్యూ హ‌న్ను' అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు అది నెట్టింట్లో వైర‌ల్ అవుతుంది. హ‌న్ను అంటూ ఎంత క్యూట్ గా అన్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు అటు హ‌న్సిక‌, ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్. 






అల్లు అర్జున్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. 


ముంబైకి చెందిన బ్యూటీ హ‌న్సిక ఎంతోమంది కుర్ర‌కారు మ‌న‌సులు దోచేసింది. హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మ‌డు.. తెలుగులో అల్లుఅర్జున్ స‌ర‌స‌న 'దేశ‌ముదురు' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ప‌ద‌హారేళ్ల ప్రాయంలోనే దేశ‌ముదురు సినిమా చేసింది ఈ అమ్మ‌డు. ఆ త‌ర్వాత  తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల‌తో న‌టించింది. లీడింగ్ స్టార్ హీరోయిన్ గా కొన‌సాగింది. ఈ మ‌ధ్య‌కాలంలో పెద్ద‌గా సినిమాల్లో క‌నిపించలేదు. తీసిన సినిమాలు కూడా పెద్ద‌గా రానించ‌లేదు. అయితే, ఎప్పుడు అల్లు అర్జున్ ప్ర‌స్తావ‌న వ‌చ్చినా ఆయ‌న గురించి చాలా పాజిటివ్ గా చెప్తారు హ‌న్సిక‌. అల్లు అర్జున్ లేక‌పోతే ఈ రోజు తాను లేను అంటూ చాలా సంద‌ర్భాల్లో చెప్పారు హ‌న్సిక‌. అంత‌టి బాండింగ్ ఉంటుంది అల్లు అర్జున్, హ‌న్సిక మ‌ధ్య‌. 


ఇక సినిమాల విష‌యానికొస్తే అల్లు అర్జున్ 'పుష్ప - 2' బిజీగా ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే ఆయ‌న లుక్ రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ పైన ఒక పాట‌, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న మీద తెర‌కెక్కించిన పాట సూప‌ర్ హిట్ అయిన విష‌యం తెలిసిందే. యూట్యూబ్ లో రికార్డ్ స్థాయి వ్యూస్ తో దూసుకెళ్తుంది ఆ పాట‌. ‘పుష్ప - 2’ సినిమా ప‌లు వాయిదాల త‌ర్వాత ఆగ‌స్టు 15న రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే, ఇప్పుడు అది కూడా వాయిదా ప‌డేలా క‌నిపిస్తోంది. దీంతో అభిమానులు నిరాశ ప‌డుతున్నారు. అయితే, దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.


Also Read: న‌న్ను ఎవ్వ‌రూ అరెస్ట్ చేయ‌లేదు.. ఫ్యామిలీ విష‌యాల్ని బ‌జారుకి ఈడ్చ‌కండి: పృథ్వీరాజ్