Prudhvi Raj Gives Clarity About His Arrest: సీనియర్ నటుడు పృథ్వీరాజ్ అరెస్ట్, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ అంటూ వార్త వైరల్ అయ్యింది. మొదటి భార్యకు భరణం ఇవ్వని కేసులో ఆయన్ను అరెస్ట్ చేశారని కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, వెబ్ సైట్స్ రాశాయి. అయితే, ఆ వార్తలపై స్పందించారు పృథ్వీ రాజ్. తనని ఎవ్వరూ అరెస్ట్ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. తనపై తప్పుడు వార్తలు రాసిన వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వీడియోలో చెప్పారు పృథ్వీ. ఇది కుటుంబ విషయం అని, తెలసుకోకుండా ఎందుకు అలా ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. భరణం ఇవ్వాల్సిన దాంట్లో ఇప్పటివరకు రూపాయి కూడా ఆపలేదని చెప్పారు.
పృథ్వీరాజ్ ఏమన్నారంటే?
‘‘అందరికీ నమస్కారం.. పృథ్వీరాజ్ అరెస్ట్, ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. కోర్టులో లొంగిపొమ్మన్నారు, తీసుకెళ్లి విచారిస్తున్నారు అంటూ వార్తలు రాశారు. మొదటి భార్యకి భరణం కట్టడం లేదు. ఆమెకు బాకీ ఉన్నాడు. అందుకే కోర్టు అరెస్టు వారెంట్ ఇష్యూ చేసింది అని ప్రచారం చేశారు. అసలు విషయం తెలుసుకోకుండా ఎందుకు అలా రాస్తారు? ఈ చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్లు పృథ్వీ గారు ఏం జరిగింది అని అడిగితే.. నేనే చెప్పేవాడిని కదా? ఎందుకు అలా తెలుసుకోకుండా రాస్తున్నారు? న్యాయస్థానం పరిధిలో, ఫ్యామిలీ కోర్టులో ఈ ఇష్యూ చాలా ఏళ్ల నుంచి నడుస్తుంది. దాంట్లో భాగంగా వాళ్లు ఒక అమౌంట్ చెప్పారు. ప్రతి నెల పదో తారీఖున డబ్బులు పంపాలి. పంపిస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతి నెల అకౌంట్ నుంచి అటోమెటిక్ గా కట్ అవుతుంది. పృథ్వీ రాజు అలాంటి వాడు, ఇలాంటి వాడు అని క్యారెక్టర్ అసాసినేషన్ చేయాల్సిన అవసరం లేదు. అసలు విషయం మీరు తెలుసుకోవాలి కదా? ఏది పడితే అది రాయొద్దు దయచేసి’’ అని అన్నారు.
చట్టపరమైన చర్యలు..
‘‘ఈ విషయంపై నా లాయర్స్ ని కూడా కనుకున్నాను. వాళ్లే ఆశ్చర్యపోయారు. ఏంటిది ఏమీ లేకుండా ఇలా ఎలా వచ్చింది? అసలు విషయం తెలుసుకోకుండా ఎలా రాస్తారు? అని అన్నారు. నా గురించి ఎవరైతే తప్పుడు వార్తలు రాశారో వాళ్లపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాను. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ విషయం కోర్టులో ఉంది. ఫ్యామిలీ విషయం. దాన్ని కూడా బజారుకు ఈడుస్తారా? భరణం ఎంత కట్టాలి? ఎంత కడుతున్నాను అవి కోర్టుకు తెలుసు. కోర్టు కూడా మీరేనా? ఒక మనిషి క్యారెక్టర్ ని దిగజార్చేలా చేయకండి, రాయకండి. న్యాయపరంగా కోర్టు ఎంత కట్టమందో అంత కట్టేస్తున్నాను. జూన్ నెలది కూడా కట్టేశాను. నిజనిజాలు తెలుసుకుని మాట్లాడండి. ఇంత కంటే ఎక్కువ మాట్లాడను. అందరూ నాకు మిత్రులు. ఏదైనా రాసేముందు అడగండి. నేను కచ్చితంగా క్లారిటీ ఇస్తాను. మా లాయర్లతో మాట్లాడి ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో త్వరలోనే వెల్లడిస్తాను అని వివరణ ఇచ్చారు పృథ్వీరాజ్.
Also Read: మహారాజ రివ్యూ: తమిళంలో బ్లాక్ బస్టర్ రిపోర్ట్, మరి తెలుగులో? - విజయ్ సేతుపతి 50వ సినిమా ఎలా ఉందంటే?