Seethe Ramudi Katnam Today Episode సుమతి గురించి పూర్తిగా మర్చిపోయావని తన భర్త, ప్రీతిల కోసం అయినా సుమతి అత్తమ్మ కుటుంబాన్ని వెతకాలి కదా అని మహాలక్ష్మితో సీత అంటుంది. సుమతి అన్న కుటుంబం గురించి తెలిస్తే మామ, ప్రీతిలకు మేనమామ ఉంటారు కదా అని సీత అంటుంది. సీత మాటలకు షాక్ అయిన మహాలక్ష్మి వాళ్ల గురించి తెలుసుకోవడం తన భర్త జనార్థన్‌కు ఇష్టం లేదు అని చెప్తుంది. 


సీత: ఇష్టం లేనిది మామయ్యకు కాదు మీకు. మీ దగ్గర ఏదో రహస్యం ఉంది దాన్ని కాపాడుకోవడం కోసం సుమతి అత్తమ్మని దాస్తున్నారు.
మహాలక్ష్మి: అదంతా నీకు అనవసరం సీత.
సీత: అయితే మా టీచర్‌ గురించి కూడా మీకు అనవసరం. ఆవిడ నచ్చినన్ని రోజులు ఇక్కడే ఉంటారు.
మహాలక్ష్మి: నన్నే ఎదురిస్తున్నావా. ఆవిడ రహస్యాల కోసం నన్నే కాదు అంటున్నావా.
సీత: ఇంటికి వచ్చే వారికి నేనే మీ కోడలు అని చెప్పరు కానీ మా టీచర్ గురించి అడుగుతున్నారా. ఇంటికి వచ్చిన వాళ్లతో ఈ ఇంటి కోడలు మా అక్క కాదు నేనే అని చెప్పి ఉంటే మీ పరువు ఏమై ఉండేది. అలా చెప్పకుండా నేను మీ గౌరవాన్ని కాపాడాను. అలాగే మీరు కూడా మా టీచర్ గౌరవాన్ని గొప్పతన్నాని ఒప్పుకోండి.
మహాలక్ష్మి: నీకు మీ టీచర్‌కి టైం దగ్గర పడింది సీత. నేను ఏంటో చూపిస్తాను.
విద్యాదేవి: సీత గొడవ ఎందుకు.. నేను మీకు ఏమవుతాన్ని నన్ను వెనకవేసుకొని వస్తున్నావ్.
సీత: మరి నేను మీకు ఏమవుతాను టీచర్ నా కోసం మా ఇంటికి వచ్చి నా కాపురం నిలబెట్టారు. మా అక్క జీవితం సరిదిద్దారు. 
విద్యాదేవి: సరే నేను ఎవరు అని తెలుసుకోవాలి అని నీకు లేదా.
సీత: చెప్పాలి అనుకుంటే మీరే చెప్తారు కదా. 
విద్యాదేవి: నిజమే సీత చెప్పాల్సిన టైం వస్తే నీకు మొత్తం చెప్తాను. అవును మీ సుమతి అత్తమ్మ గురించి నీకు అనుమానం ఉందా మహాలక్ష్మి గారిని అడిగావు.
సీత: అవును టీచర్ సుమతి అత్తమ్మ మాయం అవ్వడం వెనక మహాలక్ష్మి అత్తయ్య హస్తం ఉందని నాకు అనుమానంగా ఉంది. 
విద్యాదేవి: మనసులో.. కరెక్ట్ సీత మహాలక్ష్మి వల్లే నా జీవితం ఇలా అయింది. సమయం వస్తే నీకు మొత్తం చెప్తా.


రామ్ గదిలో ఉంటాడు. సీతని చూసి రావమ్మా సీతమ్మ అని హుషారుగా పాట పాడుతాడు. సీమంతం గురించి చెప్పినందుకు భార్యని పొగుడుతాడు. ఇక సీతని ఎత్తుకొని గిరగిరా తిప్పుతాడు. తర్వాత సీతతో నీ ప్రేమలో పడిపోయాను అని అంటాడు. ఇక సీత ఫస్ట్‌నైట్ గురించి అడుగుతుంది. దానికి రామ్ మన గురించి మన పిన్ని ఆలోచిస్తుంది అని అంటాడు. పిన్ని చెప్పే వరకు ఏ నిర్ణయం తీసుకోను అని అంటాడు. కొన్ని నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని సీత అంటుంది. తన పిన్ని గురించి ఏమీ అనొద్దని రామ్ అంటాడు. 


మధుకి తన తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బుని జలజ తీసి వంట గదిలో దాచేస్తుంది. తర్వాత మహాలక్ష్మికి కాల్ చేస్తుంది. మధు మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నాను అని ఏ అవకాశం దొరికినా మీ ఇంటికి పంపిస్తాను అని చెప్తుంది. డబ్బు దాచేసిన విషయం కూడా చెప్తుంది. సూర్య, మధులకు గొడవలు పెడుతున్నాను అని వాళ్లని త్వరలోనే వాళ్లని విడదీసేస్తాను అని అంటుంది. ఇక డబ్బుని దాచేయ్‌మని అంటుంది. ఇక మహాలక్ష్మి మధు మనసు మార్చుకొని ఇక్కడికి వస్తే సరేసరి లేదంటే మరో ఆప్షన్ వెతుక్కోవాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది. 


విద్యాదేవి ఇళ్లంతా తిరుగుతూ వెతుకుతుంది. సీత అక్కడికి వస్తుంది. ఏం వెతుకుతున్నారు అని సీత అడిగితే మీ సుమతి అత్తయ్య ఫొటో కోసం వెతుకుతున్నాను అని చెప్తుంది. ఇళ్లంతా వెతికినా ఎక్కడా ఫొటో లేదు ఏంటి అని అడుగుతుంది. మహాలక్ష్మి సీత విద్యాదేవిల మాటలు వింటుంది.


సీత: కావాలనే సుమతి అత్తమ్మ ఫొటో లేకుండా చేశారు టీచర్.
విద్యాదేవి: అదేంటి. ఎందుకు అని అలా చేశారు. 
సీత: మీకు చెప్పాను కదా టీచర్. నేను ఈ ఇంటికి వచ్చిన కొత్తలో సుమతి అత్తమ్మ ఫొటో కనిపిస్తే తీసుకొచ్చి హాల్‌లో పెట్టాను. రోజూ ఆ ఫొటోకి పూజ చేశాను. 
మహాలక్ష్మి: నేను ఆ దరిద్రాన్ని కాల్చి బూడిద చేశాను. 
సీత: అది ఇష్టం లేని మహాలక్ష్మి అత్తయ్య ఓ రోజు ఆ ఫొటో ముందు దీపం పెట్టిన నెపంతో ఫొటో కాల్చేసింది. అది ప్రమాదవశాత్తు కాలిందో లేక మహాలక్ష్మి అత్తయ్య కాల్చేసిందో తెలీదు.
రామ్: స్టాపిట్ సీత. ఎందుకు టీచర్ గారికి పిన్ని గురించి తప్పు తప్పుగా చెప్తున్నావ్. అప్పుడు మధుకి కూడా ఇలాగే పిన్ని గురించి లేని పోనివి చెప్పావ్. మీరు సీత మాటలు పట్టించుకోవద్దు టీచర్. మా పిన్ని అమ్మ మంచి ఫ్రెండ్స్. బతికున్నప్పుడు మా అమ్మ పిన్నికి సాయం చేసింది. అమ్మ పోయాక పిన్ని ఈ ఫ్యామిలీకి ఎంతో చేసింది. అలాంటి మా పిన్ని గురించి ఎవరు తక్కువ చేసి మాట్లాడినా నేను ఒప్పుకోను. నా దృష్టిలో మా పిన్ని అంటే మా అమ్మే. మా అమ్మకు మరో రూపమే పిన్ని. ఇంకెప్పుడు పిన్నిని ఎవరి దగ్గర బ్యాడ్ చేయకు సీత నాకు నచ్చదు. 
సీత: విన్నారు కదా టీచర్ ఇది ఆయన వరస. వాళ్ల పిన్నిని ఒక్క మాట అననివ్వరు. కన్న తల్లి ఫొటో ఒక్కటి కూడా లేదు అని మాత్రం పట్టించుకోడు. 
మహాలక్ష్మి: రామే కాదు ఈ ఇంట్లో ఎవరూ సుమతి గురించి ఆలోచించకుండా చేశాను. 
విద్యాదేవి: ఈ ఇంట్లో మీ అత్తమ్మ ఫొటో లేకపోతే ఏంటి సీత. అందరి మనసుల్లో ఉంటుంది కదా. మీ మామయ్య గుండెల్లో మీ అత్తమ్మ ఫొటో పదిలంగా ఉంటుంది కదా. ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లల్ని కన్నారు కదా. ఆ ప్రేమ ఎప్పటికీ పోదు. ఎవరూ దాన్ని తుడిచేయలేదు. 
సీత: మా అత్తమ్మ, మామయ్య ప్రేమ పెళ్లి చేసుకున్నారు అని మీకు ఎలా తెలుసు. కొంప తీసి మీకు కూడా మా అత్తమ్మ స్నేహితురాలా. ఈ విషయాలు మీకు ఎలా తెలుసు. ఎవరు చెప్పారు. 
విద్యాదేవి: అది నువ్వే చెప్పావు సీత. 
మహాలక్ష్మి: విద్యాదేవి ఈ ఇంటి విషయాల్లో ఎక్కువ చనువు తీసుకుంటుంది. అతి త్వరలో వీళ్లిద్దరినీ ఇంటి నుంచి పంపేయాలి. పంపిచేస్తాను.


మహాలక్ష్మి సుమతి బతికే ఉందని.. ఇంటికి ఎందుకు రాలేదు అని ఆలోచిస్తుంది. ఇక గతంలో తనని కలవడానికి పంపించిన మెసేజ్ గుర్తు చేసుకుంటుంది. ఇలాంటి టైంలో సీతకు సుమతి బతికే ఉందని తెలిస్తే తన పని అయిపోతుందని.. సుమతి ఎక్కడున్నా వెతికి పట్టుకొని చచ్చే వరకు చంపాలి అని సుమతి ఫొటోలు అన్నీ కాల్చేశాను అని ఏమైనా ఉన్నాయా అని తన చీరలు అన్నీ దులిపి చూస్తుంది. ఇక సీత అటుగా వస్తుంటుంది. ఒక చీరలో సుమతి, మహాలక్ష్మి కలిసి తీసుకున్న ఫొటో దొరుకుతుంది. అది చూస్తూ మహాలక్ష్మి ఈ రోజు నీ గురించి వెతకడం మొదలు పెడతాను అని ఎక్కడున్నా వదలను అని అంటుంది. మహాలక్ష్మి చేతిలో ఉన్న ఫొటో ఎగిరి సీత వస్తున్న వైపు వెళ్తుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నకు అడ్డంగా దొరికిపోయిన కార్తీక్‌, దీపలు - కార్తీక్ చేసిన పనికి ఫైర్‌ బ్రాండ్‌గా మరదలు పిల్ల!