Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode కార్తీక్ జ్యోత్స్నకి కాల్ చేసి బయటకు తీసుకెళ్తా అని చెప్తారు. జ్యోత్స్న ఎగిరి గంతేసినంత పని చేస్తుంది. తాను అనుకున్నది ఒకటి దానికి బావ రివర్స్‌లో ఛాన్స్ ఇచ్చాడు అని అనుకుంటుంది. జ్యోత్స్న కార్తీక్‌తో చాలా విషయాలు మాట్లాడాలి అనుకుంటుంది. ఇక శౌర్యని తీసుకొని దీప స్కూల్‌కి వస్తుంది. రావడం రావడమే శౌర్య ఫ్రెండ్ ఓ అబ్బాయి కనిపించి మీ నాన్న రాలేదా అని అడుగుతాడు. దానికి శౌర్య తన తండ్రి ఊరు వెళ్లాడని చెప్తుంది. ఇక శౌర్య లోపలికి వెళ్లకుండా తనకు భయం ఉందని అంటుంది. శౌర్య కార్తీక్‌కి కాల్ చేస్తుంది. దీప ఫోన్ తీసుకొని కట్ చేస్తుంది. 


శౌర్య: కార్తీక్ వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది. మనల్ని ఎవరూ ఏమీ అనరు.
దీప: అలా ఏం ఉండదు. మనల్ని కూడా ఎవరూ ఏమీ అనరు శౌర్య పద..
శౌర్య: కార్తీక్ ఫోన్ చేయడంతో.. నాకు భయంగా ఉంది నువ్వు స్కూల్‌కి రావా. త్వరగారా..


కార్తీక్‌ శౌర్యతో నేను పక్కనే ఉన్నాను వస్తున్నా అని అంటాడు. స్కూల్‌ దగ్గరకు వెళ్లాడు. శౌర్య  దీపకు ఇంగ్లీష్ రాదు అని అందుకే నిన్ను పిలిచాను అంటుంది. ఇక కార్తీక్ కాసేపు ఉండి వెళ్తాను అంటాడు. దీప ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అని అనుకుంటుంది. ముగ్గురు పేరెంట్స్ మీటింగ్‌కి వెళ్తారు. ఓ వ్యక్తి శౌర్యని కార్తీక్ దీప చేతులు పట్టుకొని తీసుకెళ్లడం ఫొటో తీస్తాడు. మరోవైపు జ్యోత్స్న హ్యాపీగా రెడీ అవుతుంది. 


సుమిత్ర: జ్యోత్స్న బ్రేక్‌ఫాస్ట్‌కి పిలుస్తుంటే రావు ఏంటే.
జ్యోత్స్న: రావడం కాదు మమ్మీ నేను వెళ్తున్నాను. బావ బ్రేక్ ఫాస్ట్‌కి బయటకు వెళ్దామన్నాడు. సో నేను బయటకు వెళ్తున్నాను.
సుమిత్ర: కార్తీక్ దీపల గురించి చెప్పి అత్తయ్య దీని మనసు ఎక్కడ పాడు చేస్తుందో అని భయపడ్డాను. కానీ ఇప్పుడు ఇది బాగానే ఉంది. జ్యో నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండు. ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకు. రుజువులు లేకుండా నోటి మాటతో నమ్మేది అబద్ధం. రుజువులు ఉన్నా నమ్మడానికి ఆలోచించేది నిజం. ఈ రెండు అర్థం చేసుకొనే వయసు నీకు లేదు. మన చుట్టూ ఉన్న వాళ్లు చాలా చెప్తారు. అవి పట్టించుకోవద్దు కార్తీక్ చాలా మంచోడు. నిన్ను బాగా చూసుకుంటాడు. 


జ్యోత్స్న తల్లికి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకొని లవ్‌యూ మమ్మీ అని చెప్తుంది. ఇంతలో జ్యోత్స్నకు కార్తీక్, దీపలు శౌర్య చేయి పట్టుకొని తీసుకెళ్తున్న ఫొటోని జ్యోత్స్న ఫ్రెండ్ శ్రీవాణి పంపిస్తుంది. అది చూసి జ్యోత్స్న షాక్ అయిపోతుంది. స్కూల్ దగ్గరకు వెళ్తుంది. జ్యోత్స్న నేనుగా మీటింగ్ దగ్గరకు వెళ్లి వాళ్లని చూసి కోపంగా చూస్తుంది. జ్యోత్స్నని దీప చూసి షాక్ అవుతుంది. శౌర్య కూడా జ్యోని చూసి కార్తీక్‌కి చెప్తుంది. ఇక జ్యోత్స్న తాను కార్తీక్ తరుఫున వచ్చాను అని చెప్తుంది. 


జ్యోత్స్న: ఇతను కార్తీక్ మా బావ. తను శౌర్యకి గార్డీయన్. తను చాలా బిజీ పర్సెన్ అలాంటి ఆయన టైంని మీరు మీటింగ్‌కి పిలిచి వేస్టే చేస్తున్నారు అని తెలిసి ఇక్కడికి వచ్చాను. అతని టైం వేస్ట్ చేయడం నాకు ఇబ్బందిగా ఉంది.
కార్తీక్: జ్యోత్స్న..
జ్యోత్స్న: బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా టైం అవ్వలేదా బావ. సార్ మీరు మా బావ ఫోన్ నెంబరు ఇచ్చారు అనే కదా తనని పిలిపించారు. ఇప్పటి నుంచి శౌర్యకి గార్డీయన్‌గా నేను ఉంటాను. నా ఫోన్ నెంబరు తీసుకోండి. శౌర్య నీకు ఏమైనా అవసరం ఉంటే మీ శ్రీవాణి మిస్ నా ఫ్రెండే తనకి నువ్వు చెప్తే తను నాకు చెప్తుంది.
దీప: మనసులో.. వెళ్లిపోండి కార్తీక్ బాబు అంటే వినలేదు. చెప్పగానే వెళ్లిపోయి ఉంటే జ్యోత్స్న మరోసారి తప్పుగా అనుకునేది కాదు. 
జ్యోత్స్న: శ్రీవాణి నీకు అర్థమైంది కదా నెంబరు మార్చు. లేకపోతే దీప కూడా మా బావకి కాల్ చేసి రమ్మనడానికి ఇబ్బంది పడుతుంది కదా. దీపకు అంత అవసరం రాకుండానే మా బావ వస్తాడు అనుకో. ఏం బావ బ్రేక్‌ఫాస్ట్ అంటే రెస్టారెంట్‌లో అనుకున్నా స్కూల్‌లో అనుకోలేదే.
కార్తీక్: శౌర్య ఫోన్ చేసి వెయిట్ చేస్తున్నా అంటే వచ్చాను. జ్యోత్స్న: మరి నేను కూడా వెయిట్ చేస్తున్నా కదా చెప్పాలి కదా. నువ్వు చెప్పకపోయినా నేను వచ్చాను కదా. మనం ఇక్కడ మాట్లాడుకుంటే బాగోదేమో. దీప మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఇక ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు దీప. గార్డీయన్‌గా నేను ఉన్నాను కదా అంతా నేను చూసుకుంటా. బావ ఇక మనం బయల్దేరుదామా.
దీప: ఇప్పుడు దీని గురించి జ్యోత్స్న నన్ను ఎన్ని మాటలు అంటుందో ఏంటో.


దీప హోటల్‌కి వెళ్తుంది. జ్యోత్స్న కార్తీక్‌లు కారులో బయల్దేరుతారు. జ్యోత్స్న తన బావ ఒక్కడి వల్లే మనస్శాంతి లేకుండా పోతుందని తిట్టుకుంటుంది. ఇక దీప హోటల్ దగ్గరకు వెళ్తుంది. ఇక కార్తీక్ తనలో తాను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని జ్యోత్స్నతో చెప్పే వరకు తనకు ఈ ఇబ్బందులు తప్పవని కార్తీక్ అనుకుంటాడు. జ్యోత్స్న హోటల్ దగ్గరకు వెళ్లి సెటైర్లు వేస్తుంది. కడియం కార్తీక్ గురించి చెప్పబోతే దీప ఆపేస్తుంది. ఇక నీకు ఏం కావాలి జ్యోత్స్న అని దీప అడిగితే మా బావ కావాలి అని జ్యోత్స్న చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.  


Also Read: ‘జగధాత్రి’ సీరియల్‌: మీనన్ ను పట్టుకున్న జేడీ – సాధును బెదిరించిన కమలాకర్