ద్రౌపది (Draupadi)
పతినే ప్రత్యక్ష దైవంగా భావించే స్త్రీని పతివ్రత అంటారు. అంటే భర్త తప్ప మరో పురుషుడి స్పర్శ కూడా తెలియని స్త్రీ అని అర్థం. అలాంటప్పుడు పాండవులు ఐదుగురితోనూ పిల్లలు కన్న ద్రౌపది పతివ్రత ఎలా అవుతుందంటారు కొందరు. అయితే ఐదుగురు భర్తలతోనూ ద్రౌపది కాపురం చేసింది కానీ ఆ సమయంలో ఆమె పాటించిన నియమాలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు.చేతులెత్తి నమస్కరిస్తారు..
- ఐదుగురి భర్తలతో కాపురం చేసేటప్పుడు ద్రౌపది చాలా నియమాలు పాటించేది. ఓ భర్త దగ్గరనుంచి మరో భర్త దగ్గరకు వెళ్లేటప్పుడు అగ్నిలోంచి నడిచి వెళ్లేది. పునీతుల్ని చేయడంలో అగ్నిని మించినదేముంది. అలా అగ్నిలో నడిచి వెళ్లేటప్పుడు ఆమె పవిత్రతను పొందేది.
- ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే...పాండవులు లెక్కకే ఐదుగురు అని చెబుతారు కానీ ఇంద్రుడే ఇలా జన్మించాడని, ఇంద్రుడి భార్య శచీదేవి ద్రౌపదిగా జన్మించిందని మరో పురాణగాథ.
- పాండవులు ,ద్రౌపది… నవమాసాలు తల్లి గర్భంలో పెరిగి యోనిజులుగా జన్మించినవారు కాదు..వీళ్లు అయోనిజులు( యోని ద్వారా బయటకు రాలేదు).
- పాండురాజు భార్యలైన కుంతీమాద్రిలు దుర్వాసన మహర్షి సంతాన మంత్ర మహిమతో పంచపాండవులకు తల్లులయ్యారు. అలా యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్విని దేవతలు తమ వద్దనున్న ఇంద్రుని పంచ ప్రాణాలను పంచ పాండవులుగా అనుగ్రహించి.. జన్మనెత్తేలా చేస్తారు. కాబట్టి పంచపాండవులు ఐదుగురు కలిస్తేనే ఇంద్రుడు.
- ద్రౌపది అగ్ని నుంచి పుట్టింది..అది కూడా శిశువుగా పుట్టలేదు ఏకంగా యుక్తవయసుతో జన్మించింది. పాంచాలరాజు అయిన ద్రుపదుడికి అగ్ని ద్వారా జన్మించింది. అందువల్లే ఈమెను యజ్ఞసేని అంటారు. యఙ్ఞకుండం నుంచి ఉద్భవించిన కారణజన్మురాలు.
- పాంచాల రాజ్యానికి రాణి కావడం వల్ల పాంచాలి అనే పేరు, అగ్ని దేవుడి ద్వారా జన్మించడం వల్ల యగ్నసేని అనే పేరు, ఐదుగురికి భార్య అవడం వల్ల మహాభారతి అనేపేర్లు వచ్చాయి. మత్స్య యంత్రాన్ని ఛేదించిన అర్జునుడిని ద్రౌపది వరించింది. ఇంటికి వచ్చీ రాగానే అమ్మా నేను ఒక మంచి బహుమతిని గెలుచుకొని తెచ్చాను అని తల్లి కుంతితో అంటాడు. ఐదుగురు సమానంగా పంచుకోండి నాయనా అని అంటుంది. దీనిఫలితంగా పంచాలిగా మారింది ద్రౌపది
- ద్రౌపదికి కలిగిన సంతానమే ఉప పాండవులు. ధర్మరాజు కు ద్రౌపది కి ప్రతివింధ్యుడు, భీముడికి శ్రుతసోముడు, అర్జునుడికి శ్రుత కీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శ్రుత సేనుడు కలిగారు.
Also Read: మహాభారత యుద్ధంలో ఏరోజు ఎంతమంది చనిపోతారో ముందు రోజు రాత్రే క్లారిటీ ఇచ్చేసిన కృష్ణుడు
ద్రౌపది పుట్టుక వెనుక
కురుసభలో దుశ్శాసనుడు, అడవిలో సైంధవుడు, విరాటుని కొలువులో కీచకుడు ఇలా ఎంత మందితో అవమానాలు ఎదుర్కొన్న ద్రౌపది..దురహంకార రాజులను నాశనం చేయడానికే అగ్నిలోంచి పుట్టుకొచ్చింది. త్వష్ట్రప్రజాపతి కుమారుడైన ‘త్రిశిరుని ’ సంహరించిన ఇంద్రుడికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించి స్వర్గలోకాధిపత్యాన్ని కోల్పోతాడు. ఆ దోష నివారణకు తపస్సు చేస్తున్న కాలంలో రాక్షసుల ఆగడాలకు భయపడిన శచీదేవి అగ్ని దేవుడిని ప్రార్థిస్తుంది. తన భర్త తిరిగివచ్చే వరకూ ఆశ్రయం ఇమ్మని అడుగుతుంది. తన భర్త అయిన మహేంద్రుడు ఐదురూపాలతో భూలోకంలో జన్మించాడని తెలుసుకుని శచీదేవి...యఙ్ఞ కుండం నుంచి ద్రౌపతిగా జన్మించి పాంచాలిగా మారింది.
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..