Ammalaganna Amma Durgama


"అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె
ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్"


పోతన రాసిన ఈ పద్యం తెలిసో, తెలియకో అలా చదివినా చాలు మంచి ఫలితం పొందుతారు. ఎందుకంటే కొన్ని శ్లోకాలను, పద్యాలను గురువులు పక్కన లేకుండా, పూర్తిగా చదవడం రాకుండా చదవకూడదు. ముఖ్యంగా అమ్మవారికి సంబంధించిన పూజల విషయంలో అస్సలు ప్రయోగం చేయకూడదు. ఇక బీజాక్షరాలను అస్సలే తప్పు చదవకూడదు. కానీ ఈ పద్యం పోతన ఇచ్చిన గొప్ప కానుక. 


Also Read:  ఈ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్


ఈ పద్యంలో అమ్మలను కన్న దేవతా స్త్రీలైన వారి మనస్సుల యందు ఏ అమ్మవారు ఉన్నదో, అటువంటి అమ్మని మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్...ఈ నాలుగింటి కోసం నమస్కరిస్తున్నాను..అలాంటి దుర్గమ్మ మాయమ్మ అని అర్థం. 
అమ్మలగన్నయమ్మ - లలితాసహస్రం 'శ్రీమాతా' అనే నామంతో ప్రారంభమవుతుంది. శ్రీమాతా అంటే 'శ' కార, 'ర' కార, 'ఈ' కారములతో  సత్వ, రజస్తమోగుణాధీశులైన శక్తి. బ్రహ్మశక్తి, రుద్రశక్తి, విష్ణుశక్తి. సరస్వతి, పార్వతి, లక్ష్మీదేవి, ఈ ముగ్గురికీ అమ్మ. ఈ మూడు శక్తులను త్రిమూర్తులకు ఇచ్చిన పెద్దమ్మ ఎవరో ఆయమ్మ... అంటే, 'లలితాపరాభట్టారికా' స్వరూపం. ఈ అమ్మవారికి, దుర్గా స్వరూపానికి బేధం లేదు. 
ముగ్గురమ్మల మూలపుటమ్మ- మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతులుగా కొలిచే తల్లులు. 
'చాలా పెద్దమ్మ' -మహాశక్తి. అండపిండబ్రహ్మాండం అంతటా నిండిపోయిన బ్రహ్మాండమైన శక్తి స్వరూపం. శక్తి స్వరూపం చిన్నా, పెద్దా బేధం లేకుండా సమస్త జీవులలో నిండిపోయినదని అర్థం. అలా ఉండడం అనేది మాతృత్వం.
'సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ'- దేవతలకు శత్రువైన వాళ్ల అమ్మకు కడుపుశోకం మిగిల్చిన అమ్మ లేదా రాక్షసులు నశించడానికి కారణమైన అమ్మ.
'తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున నుండెడి అమ్మ'- మనకి అష్టమాత్రుకలు బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, మహేంద్రి , చాముండా, కౌమారి, వారాహి, మహాలక్ష్మి. ఈ అష్టమాత్రుకలు శ్రీచక్రముం దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరం అమ్మవారిని లోపల కొలుస్తూ ఉంటారు. ఈ అష్టమాత్రుకలకు శక్తిని ఇచ్చిన అమ్మవారు ఎవరో ఆవిడే వేల్పుటమ్మల మనంబున ఉండెడి యమ్మ. 'దుర్గ మాయమ్మ'- ఈ దుర్గమ్మ ఉన్నదే ఆవిడే లలితాపరాభట్టారికా. అ అమ్మ, మా యమ్మ
'మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదల్- ఆవిడ నాకు దయతో మహత్వ, కవిత్వ, పటుత్వ, సంపదలను ఇవ్వాలి.


Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!
అమ్మవారికి శాక్తేయ ప్రణవములు అని కొన్ని బీజాక్షరములు ఉన్నాయి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సౌహ్ అని పిలుస్తారు. వీటిని ఎలా పడితే అలా ఉపాసన చెయ్యకూడదు. అందుకో బమ్మెర పోతన ఇలా చెప్పారు..
మహత్వానికి బీజాక్షరము 'ఓం'
కవిత్వానికి  బీజాక్షరం 'ఐం'
పటుత్వానికి  భువనేశ్వరీ బీజాక్షరము ' హ్రీం'
సంపదల్, లక్ష్మీదేవి 'శ్రీం'
ఓం, ఐం, హ్రీం, శ్రీం, అమ్మలగన్నయమ్మ 'శ్రీమాత్రేనమః'. 
ఎక్కడున్నా అమ్మలగన్నమ్మ శ్లోకం చదివితే ఓం, ఐం, హ్రీం, శ్రీం, శ్రీమాత్రేనమః అనేస్తున్నామన్నమాట. అంటే ఆ తల్లి ఉపాసన చేస్తున్నట్టే. 
మీ కోర్కెలు ధర్మబద్ధం అయితే ఆ తల్లి తప్పనిసరిగా తీరుస్తుంది..ముందస్తుగా ఏబీపీ వ్యూయర్స్ కి దసరా శుభాకంక్షలు