Dussehra 2022: దుర్గతిని దూరం చేసి సద్గతిని ఇచ్చే తల్లి కనకదుర్గమ్మ. లలితా సహస్రనామంలో అమ్మవారికి ‘సద్గతి ప్రదా’ అని ఒక నామం ఉంది. గత జన్మలలో వాసనల వల్ల ఈ జన్మలో దుష్ట విషయాలపై ఆసక్తి కలిగిఉంటారు. ఆ తల్లిని ఉపాసిస్తే గురుమండల రూపిణి అయి, గురు రూపంలో దగ్గరకు వచ్చి తన శక్తిమంతమైన వాక్కులతో గత జన్మ  వాసన దూరంచేసి... దుర్గుణాలను సుగుణాలుగా మార్చేస్తుంది. నిత్యం 'దుర్గా' అనే నామాన్ని ఎవరు స్మరిస్తారో వారు సద్గతి వైపు ప్రయాణం చేస్తారు.‘దుర్గా’ అంటే దుంఖం దూరమవుతుంది. 


Also Read: శరన్నవరాత్రుల్లో ఏ అలంకారాన్ని దర్శించుకుంటే ఎలాంటి ఫలితం పొందుతారు!


"ఓం దుం దుర్గాయైనమః" ద్ + ఉ + ర్ + గ్ + అ అనే ఐదు బీజాక్షరాలు కలిసిన నామం దుర్గ
'ద' కారం - దైత్యాన్ని ( మనిషిలో ఉన్న రాక్షస గుణాలను) పోగోడుతుంది
'ఉ' కారం - తలపెట్టిన పనులకు విఘ్నాలు రాకుండా చేస్తుంది
'ర' కారం- రోగాలు రాకుండా రక్షిస్తుంది
'గ' కారం- చేసిన పాపాలను పోగొడుతుంది
'అ' కారం - శత్రు నాశనం చేస్తుంది. 
అందుకే దుర్గా అని పలికితే ఆపదలు ఉండవు.


Also Read: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!


శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ (Durga Apaduddharaka Stotram)


నమస్తే శరణ్యే శివే సానుకమ్పే
నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే |
నమస్తే జగద్వంద్య పాదారవిందే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ||


నమస్తే జగచ్చిన్త్య మానస్వరూపే
నమస్తే మహాయోగి విఙ్యానరూపే |
నమస్తే నమస్తే సదానంద రూపే
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 


అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః |
త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 


అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే
అనలే సాగరే ప్రాంతరే రాజ గేహే
త్వం ఏకా గతి ర్దేవి నిస్తార నౌకా
నమస్తే జగత్తారిణీ త్రాహి దుర్గే || 


అపారే మహదుస్తరేఽత్యన్త ఘోరే
విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ |
త్వం ఏకా గతి ర్దేవీ నిస్తార హేతుర్
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ||


నమశ్చండికే చండ దుర్దండ లీలా
సముత్ ఖండి తాకండితా శేష శత్రో
త్వం ఏకా గతి ర్దేవి వినిస్తార బీజం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ||


త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే || 


నమో దేవి దుర్గే శివే భీమనాదే
సరస్వత్యరుంధత్యమెాఘ స్వరూపే
విభూతిః సతాం కాళరాత్రీః సతీ త్వం
నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ||


శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
ముని మనుజ పశూనాం దస్యుభిస్త్రాసితానాం
నృపతి గృహ గతానాం వ్యాధిభిః పీడితానాం
త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ||


ఇతి సిద్ధేశ్వరతన్త్రే హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టక స్తోత్రం సంపూర్ణం
ఓం శాంతిఃశాంతిఃశాంతిః !!
శ్రీ మాత్రే నమః
ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః !!