Chanakya Tips for Successful Marriage:  ఇద్దరు వ్యక్తులు గుడ్డిగా ఒకర్నొకరు విశ్వశించి జీవితం గడిపేస్తే అది సక్సెస్ ఫుల్ లైఫ్ అనిపించుకోదంటాడు ఆచార్య చాణక్యుడు. అందుకే మూడు ముళ్లు ముడిపడేలోగా కొన్ని విషయాల్లో క్లారిటీ అవసరం అని సూచిస్తున్నాడు. ముఖ్యంగా జాగ్రత్తలు తీసుకోవాల్సింది పురుషులే. ఎందుకంటే ఓ స్త్రీ తన కుటుంబాన్ని వదిలేసి మెట్టినింట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఆ కుటుంబ వృద్ధి, గౌరవం అంతా ఆమెపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే పెళ్లికి ముందే కొన్ని విషయాలపై స్పష్టత తీసుకోవడం ద్వారా వైవాహిక జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. మరి సక్సెస్ ఫుల్ పెయిర్ అని మీరు అనిపించుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చాణక్యుడు కొన్ని చిట్కాలు చెప్పాడు..


అందంగా ఉంటే సరిపోదు


ప్రతి పురుషుడు అందమైన స్త్రీని వివాహం చేసుకోవాలని కోరుకుంటాడు. అయితే అమ్మాయి అందంగా ఉన్నప్పటికీ మంచి కుటుంబానికి చెందిన అమ్మాయి కాకపోతే తనని వివాహం చేసుకోరాదు


స్థాయిలో పురుషుడిదే పైచేయి


వధువు వరుడి కన్నా తక్కువ ఎత్తు ఉండాలి. సమాజంలో పురుషుడి కుటుంబం కన్నా స్త్రీ కుటుంబం స్థాయి తక్కువగా ఉండాలి. తన స్థాయికి మించిన కుటుంబంతో సంబంధం కలుపుకున్న పురుషుడు ఎప్పటికీ సంతోషంగా ఉండలేదు..సమాజంలో గౌరవాన్ని కోల్పోతాడని చాణక్యుడి భావన.


Also Read: భర్త దగ్గర భార్య కామన్ గా దాచే 6 ముఖ్యమైన విషయాలు!


అనాకారి కాకుంటే చాలు


రూపు రేఖల గొడ్డు కాపురానికి చేటు అనే సామెత ఉంది.. అందుకే సౌందర్య రాశి కావాలని కోరుకోకూడదు అనాకారి కాకుండా ఉంటే చాలు.. ఇలాంటి అమ్మాయని వివాహం చేసుకోవడం ఉత్తమం అని సూచించాడు చాణక్యుడు


సమానం అనే భావన ఉండాలి


ఇద్దరి మధ్యా బంధం బలపడేందుకు స్త్రీ-పురుషులు ఇద్దరూ సమానంగా ప్రయత్నం చేయాలి. లేదంటే ఒకరి తీరు బాగాలేకపోయినా మరొకరు అయినా సర్దిచెప్పగలికే మనస్తత్వం ఉండాలి అప్పుడే ఇద్దరి మధ్యా బంధం బలపడుతుంది.


సర్వాధికారాలు ప్రదర్శించరాదు


తన ఆశ్రయంలో ఉన్న స్త్రీ పట్ల పురుషుడు చెడుగా ప్రవర్తించకూడదు. వివాహం జరిగినంత మాత్రాన తనపై సర్వాధికారాలు ఉన్నాయని భావించరాదు. ఎప్పుడంటే అప్పుడు ఆమె అంగీకారం లేకుండా లైంగికంగా వేధించరాదు. సంతానం కలిగిన తర్వాత కూడా ఆ స్త్రీకి ఇష్టం లేకుండా భర్త ఆమెను తాకరాదు. 


Also Read: పడకగది పనులు కూడా బహిరంగం.. కాకిని చూసి ఈ విషయాలు నేర్చుకోవాలన్న చాణక్యుడు


పతి సేవలో తరించాలి


భార్య అంటే పతి సేవలో తరించాలి. అదే ఆమెకు స్వర్గంతో సమానం, సమాజంలో గౌరవం. భర్తకు మాత్రమే ప్రేమను పంచే భార్య కుటుంబంలో శాంతి సామరస్యాన్ని తీసుకొచ్చేందుకు కృషిచేస్తుందిని చెప్పాడు చాణక్యుడు


కుటుంబ నేపథ్యం ముఖ్యం


వివాహ సమయంలో ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా ముఖ్యం అని సూచించాడు చాణక్యుడు. మంచి కుటుంబ నేపథ్యం లేని స్త్రీని వివాహం చేసుకోరాదని చాణక్యుడి సూచన. అలాంటి స్త్రీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఏమాత్రం ఆలోచించదు. ఆమె ఎంత అందంగా ఉన్నప్పటికీ మనసు మాత్రం మొరటుదే అవుతుందంటాడు చాణక్యుడు.


Also Read: ఈ యూనివర్శిటీలో సిలబస్ ఉండదు...కోర్సుకి కాలపరిమితి లేదు…పరీక్షలుండవు.. నేర్చుకున్న విద్యే కొలమానం…


సౌందర్యాన్ని చూసి దాసోహం అయితే అంతే


భార్య సౌందర్యరాశి అని మురిసిపోయే భర్త...ఒక్కసారి ఆమెకు దాసోహం అయిన తర్వాత మంచి చెడు అనే విచక్షణ కోల్పోతాడు. కుటుంబంలో అందరకీ దూరం అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే సౌందర్యాన్ని ఆరాధించాలి కానీ దాసోహం కాకూడదు అన్నది చాణక్యుడి హెచ్చరిక..


అబద్ధం చెప్పే స్త్రీని నమ్మరాదు


అబద్ధం చెప్పే అలవాటున్న స్త్రీ, ఎదుటి వ్యక్తిని చిన్న చిన్న విషయాలకే అనుమానించే స్త్రీ భర్తకు ద్రోహం చేసేందుకు వెనుకాడదు. అలాంటి స్త్రీని జీవితంలోకి ఆహ్వానించిన ఆ వ్యక్తి జీవితం నరకమే. 


ఇంటిని చక్కబెట్టుకోగలగాలి


ఇంటి పనులు తెలియని, రాని స్త్రీని వివాహం చేసుకోరాదంటాడు చాణక్యుడు. ఇంటిని చక్కదిద్దుకోలేని ఇల్లాలు ఉన్నా లేకున్నా ఒకటే అంటాడు.


Also Read: తెలివైనవాడికి శత్రువులు ఎందుకుండరు?