Chanakya's 31 Member Cabinet: దేశంలో ప్రభుత్వానికి ప్రజల ఆర్థిక వ్యవహారాలపై ఎంత అదుపు ఉంది అనే విషయం ప్రభుత్వ యంత్రాంగంపై ఆధారపడి ఉంటుంది. ఈవిషయాన్ని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో వివరించాడు. ఇందులో భాగంగా రాజ్యంలో పాలనా సౌలభ్యం కోసం శాఖలుగా విభజించి...ఎవరికి ఏ శాఖ కేటాయించాలో స్పష్టంగా చెప్పాడు చాణక్యుడు. అవేంటో చూద్దాం...
Also Read: గెలుపంటే శత్రువుని ఓడించడం కాదు మళ్లీ లేవకుండా చేయడం!
చాణక్యుడి హయాంలో 31 శాఖలున్నాయి..అవేంటో చూద్దాం...
- కోశాగారము చీఫ్ సూపర్నెంట్
- వ్యవసాయ రంగానికి సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- కబేళాలకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- ఏనుగులు ఉండే అడవులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- గనులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- లోహాలకు చీఫ్ సూపర్నెంట్
- టంకశాల చీఫ్ మాస్టర్
- ఉప్పునకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- విలువైన లోహాలకు , నగలకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- గోదాముల చీఫ్ సూపర్నెంట్
- ప్రభుత్వ వాణిజ్యానికి చీఫ్ సూపర్నెంట్
- అటవీ ఉత్పత్తులకు సంబంధించిన చీఫ్ సూపర్నెంట్
- తూనికలు, కొలమానాల చీఫ్ కంట్రోలర్
- ఎగుమతి, దిగుమతుల చీఫ్ కంట్రోలర్
- జౌళి వస్తువుల చీఫ్ కంట్రోలర్
- రాజుగారి భూముల చీఫ్ కంట్రోలర్
- మత్తు పానీయాల చీఫ్ కంట్రోలర్
- జంతుబలులు, నిషేధానికి , జంతువుల రక్షణకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్
- వినోద విషయాలకు చీఫ్ కంట్రోలర్
- నౌకలకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్
- నౌకాశ్రయాలకు సంబంధించిన చీఫ్ కంట్రోలర్
- ఏనుగు దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
- రథముల దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
- ఒంటెల దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
- పదాది దళానికి సంబంధించిన చీఫ్ కమాండర్
- పాస్ పోర్ట్ వ్యవహారాల ముఖ్య అధికారి
- పచ్చికభూముల చీఫ్ కంట్రోలర్
- ప్రైవేట్ వ్యాపారాల చీఫ్ కంట్రోలర్
- జైళ్ల చీఫ్ సూపర్నెంట్
- దేవాలయాల చీఫ్ సూపర్నెంట్
- జూద గృహాల చీఫ్ కంట్రోలర్
Also Read: పాలకులు దుర్మార్గులైతే ప్రకృతి కూడా తిరుగుబాటు చేస్తుంది -భీష్ముడు చెప్పిన రాజధర్మం ఇదే!
ఇప్పటి పాలనలో ఆయా శాఖాధిపతులను మంత్రులు అంటున్నారు...కానీ అప్పటి చాణక్యుడి కాలంలో ఆయాశాఖల అధిపతులుగా చీఫ్ సూపర్నెంట్, చీఫ్ కంట్రోలర్, చీఫ్ కమిషనర్, చీఫ్ ఆఫీస్ లాంటి పదాలు వినియోగించడం జరిగింది. చిన్న చిన్న వ్యత్యాసం తప్ప ఈ పదాలన్నింటికీ అర్థం ఒక్కటే...
ఆయా శాఖల ప్రాధాన్యత, ఆయా శాఖల అధిపతులకు ఇచ్చిన జీత భత్యాల ఆధారంగా కౌటిల్యుడు వారికి కేటాయించిన పదవులలో వ్యత్యాసాన్ని వివిధ పదాల ద్వారా చూపించాడు. ఎవరి శాఖలో వారు నిర్వర్తించాల్సిన విధులన్నీ కౌటిల్యుడి అర్థశాస్త్రంలో వివరంగా ఉన్నాయి.
అర్థశాస్త్రంలో కౌటిల్యుడు పాలకుడి గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాడు. రాజుకు సర్వాధికారాలు ఉంటాయి, కావాలనుకుంటే రాజు నియంత కాగలడు కానీ...ఆ నియంత ప్రజలను అణగదొక్కేలా ఉండకూడదు..ప్రజల సుఖ సంతోషాలను పరిరక్షించేలా ఉండాలి. ప్రజల సంతోషమే తన సంతోషం అనుకునే పాలకుడు మాత్రమే చిరస్థాయిగా నిలిచిపోతాడు...
Also Read: మీ జీవిత భాగస్వామి మాటలను తేలికగా తీసుకోకండి, డిసెంబర్ 7, 2023 రాశిఫలాలు