Nindu Noorella Saavasam December 7th Episode: ఈరోజు ఎపిసోడ్ లో జ్వరంతో బాధపడుతున్న అంజుని తీసుకొని కారులో వెళుతూ ఉంటారు అమర్, మిస్సమ్మ. కారు వెనక అరుంధతి పరిగెడుతుంది.


కారులో ఉన్న అమర్ కూతురుని పట్టుకొని బాగా ఎమోషనల్ అవుతాడు. మిస్సమ్మ కూడా ఇదంతా నా వల్లే, నా వల్లే అంజు ఇలా అయిపోయింది అని ఏడుస్తుంది.


ఘోర : ఈరోజు ఎలాగైనా ఆ ఆత్మను పట్టుకొని బంధించాలి, లోకాలన్నింటికీ నాయకుడిని అయిపోవాలి అని అనుకుంటూ వస్తూ ఉంటే అతనికి అరుంధతి ఎదురవుతుంది. ఆమెని పట్టుకోవడం కోసం వెనక పరిగెడతాడు ఘోర.


మరోవైపు అంజు కోసం ఏడుస్తూ ఉంటారు అమ్ము వాళ్లు. తనకి చదువు రాదు అన్నాము అందుకే పంతంతో చదివి జ్వరం తెచ్చుకుంది అని కన్నీరు పెట్టుకుంటారు.


అమ్ము : మీ అందరిని బాగా చూసుకుంటానని అమ్మకి మాటిచ్చాను ఇప్పుడు అంజుకి ఏమైనా అయిందంటే అమ్మ నన్ను క్షమించదు అని బాధపడుతుంది.


ఆనంద్: ఇందులో నీ తప్ప ఏమీ లేదక్కా.. నువ్వు బాధపడొద్దు.. నువ్వు మమ్మల్ని బాగానే చూసుకుంటున్నావు అని అమ్ముకి ధైర్యం చెప్తారు.


ఇదంతా చూస్తున్న చిత్రగుప్తుడు బాగా ఎమోషనల్ అవుతాడు. పిల్లల దగ్గరికి వచ్చి పిల్ల పిచ్చుకకి ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు.


పిల్లలు: మా అమ్మ మాతో ఉంటే మాకు ఈ బాధ ఉండేది కాదు, మమ్మల్ని చాలా బాగా చూసుకునేది తనని మేము చాలా బాగా మిస్ అవుతున్నాం.


చిత్రగుప్తుడు : మీ అమ్మ ఎక్కడికి వెళ్ళలేదు మీతోనే ఉంది, మీ ప్రేమలో ఉంది, మీ జ్ఞాపకాలలో ఉంది ఆ ప్రేమ పిల్ల పిచ్చుకని కాపాడుతుంది అని ధైర్యం చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు.


బయటికి వచ్చిన తర్వాత మీ అమ్మ ప్రేమ మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతుంది అని మనసులో అనుకుంటాడు.


మరోవైపు హాస్పిటల్ లోపలికి తీసుకువెళ్లి పాపకి జ్వరం ఎక్కువయ్యి అన్ కాన్షియన్స్ లో ఉంది త్వరగా ట్రీట్మెంట్ చేయండి అని హడావిడి చేస్తాడు అమర్.


అరుంధతి కూడా హాస్పిటల్ లోకి వెళ్లి అక్కడ జరిగిందంతా చూస్తుంది. అప్పుడే ఘోర కూడా హాస్పిటల్ లోకి ప్రవేశించబోతే వాచ్మెన్ నీకు సంబంధించిన వాళ్ళు ఎవరు లోపరు లేరు అని చెప్పి బయటికి గెంటేస్తాడు.


అంజుకి ట్రీట్మెంట్ అవుతుంటే బాగా ఎమోషనల్ అవుతాడు అమర్. అమర్ ఎమోషన్ ని ఇప్పుడే వాడుకోవాలి అని అతని పక్కన కూర్చుంటుంది మనోహరి.


మనోహరి: నువ్వు మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే ఇలా డీలా పడిపోతే ఎలా.


అమర్: తను లేకుండా నేను కొద్ది రోజులు కూడా పిల్లల్ని చూసుకోలేకపోయాను, నా భార్యని కాపాడుకోలేకపోయాను. ఇప్పుడు అంజుకి ఏమైనా అయిందంటే అరుంధతి నన్ను క్షమించదు అని బాగా ఎమోషనల్ అవుతాడు.


ఇదంతా వింటున్న అరుంధతి ఇందులో  మీ తప్పు ఏమీ లేదు పిల్లల్ని మీ కన్నా ఎవరూ బాగా ప్రేమించరు అని మనసులో అనుకొని తన కుటుంబాన్ని ఇలా వేధిస్తున్నందుకు భగవంతుడిని నిందిస్తుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.