Trinayani Serial Today Episode
విక్రాంత్: ముందు నీకు కడుపు నొప్పి ఎందుకు వచ్చిందో తెలుసుకో.. ప్రతీ దానికి ఓ పర్యావసానం ఉంటుంది.
డమ్మక్క: నువ్వు నాగులమ్మకు భోజనం పెట్టినందుకే ఇలా అయింది
పావనామూర్తి: అన్నం పెడితే ఆమె కడుపు నిండాలి కానీ సుమనకు ఎందుకు ఇలా అయింది
డమ్మక్క: తల్లే అయితే అన్నింటినీ కడుపులో దాచుకుంటుంది. ఇక్కడ తల్లితో పాటు అమ్మ కూడా ఉంది కదా
పావనామూర్తి: రెండు అర్థాలు ఒకటే కదా డమ్ము
డమ్మక్క: కాదు ఉలూచికి నాగులమ్మ అదే బిడ్డకు సుమన అమ్మ వ్యత్యాసం ఉంది కదా..
విక్రాంత్: నాకు కాస్త అర్థమైంది. అంటే పెద్ద బొట్టమ్మ ఆకలి వెనుక కలి ఉంది అన్నమాట. అంటే ఆకలి చావు అర్థమైందా..
డమ్మక్క: ఇంకా లోతుగా చెప్పాలి అంటే ఇక్కడ జరిగింది ఆకలితో చావు.. కొన్ని సార్లు ఆ భోజనంతోనే ప్రాణం నలిగిపోవచ్చు.
విక్రాంత్: ఈ రాక్షసి ఏదో నాటకం ఆడే ఉంటుంది.
సుమన: మీరు అనుమానిస్తే బాగుండదు చెప్తున్నా.
విక్రాంత్: ఇది అందరకీ గుండె నొప్పి తెప్పించే రకం మామయ్య. జాగ్రత్తగా ఉండండి. లేదంటే మిమల్ని మీరు పొగొట్టుకుంటారు.
అఖండ: గాయత్రీ దేవి గురించి విశాలాక్షి చెప్పిందా
వల్లభ: హా.. ఫలానా చోటుకి వెళ్తే పార్శిల్ కట్టించి ఇస్తారు వెళ్లి తెచ్చుకో అని చెప్పింది. అయ్యా అఖండ స్వామి తమరు ఇచ్చిన పూలను మా అమ్మ గారడి పిల్ల తలలో తురిమింది కానీ మంచిగా నిద్ర పోయింది.
అఖండ: అలా జరగదే.. నాగయ్యను కట్టడి చేశారా
తిలోత్తమ: మీరు ఇచ్చిన పూలను ఇంటి ముందు వేశాము కానీ ఎలా వచ్చిందో తెలీదు కానీ వచ్చేసింది ఆ పాము.. పూలు పెట్టుకున్న తర్వాత విశాలాక్షి పూనకం వచ్చినట్లు అయింది. తర్వాత గురువుగారు, నాగయ్య పాము లోపలికి వచ్చారు
అఖండ: అయితే గురువుగారి సాయంతో ఆ పాము లోపలికి వచ్చింది.
తిలోత్తమ: ఆయన టైంకి రావడం వల్ల మాకు టైం రాకపోవడం వల్లే ఇలా అయింది అనుకున్నాం. ఇప్పుడు మీరే మాకు మార్గం చెప్పాలి.
అఖండ: తిలోత్తమ ఈ పొడిని తీసుకెళ్లండి.. ఈ పొడికి నయని ఊపిరి తగలాలి. దాన్ని బంధించి నాగులా పురం పెట్టె మీద పెడితే కన్నబిడ్డ నీడ కన్న పేగు జాడ తెలుస్తాయి. తప్పకుండా గాయత్రీ దేవి ఉనికి తెలుస్తుంది. ఈ అవకాశం వదులు కోకండి. గాయత్రీ దేవికి గండం ఈ క్షణం నుంచి మొదలైనట్లే..
డమ్మక్క: గాయత్రీ పాపతో.. గాయత్రమ్మ ఇన్నాళ్లు ఏదో ఒక విధంగా నువ్వు తిలోత్తమకు తెలీకుండా తప్పించుకున్నావ్ కానీ ఈరోజు నువ్వు దొరికిపోతావు అనిపిస్తుంది. నీ రాతలో అది రాసిపెట్టి ఉంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు
పావనామూర్తి: ఏంటి డమ్ము చంటి పాపకు మాటలు నేర్పిస్తున్నావ్.. ఆటలు నేర్పిస్తే చాలు
హాసిని: మనల్ని ఆటలాడించే గాయత్రీకి కొత్త ఆటలు ఏవో నేర్పించాలి బాబాయ్.. లేదంటే మనతో ఆటలాడేలా ఉంది.
ఇంతలో తిలోత్తమ, వల్లభ ఇంటికి వస్తారు. అఖండ స్వామి ఇచ్చిన పొడిని బెలూన్‌లో వేస్తారు. ఇక నయనికి ఇచ్చి బెలూన్ ఊదమని చెప్తుంది. విశాల్, విక్రాంత్, పావనా మూర్తి, వల్లభ బెలూన్లు ఊదుతారు. తర్వాత పొడి ఉన్న బెలూన్‌ను తిలోత్తమ నయనికి ఇస్తుంది. తర్వాత ఆ బెలూన్‌ను తిలోత్తమ తీసుకుంటుంది. మరోవైపు నయని పొడి వల్ల పొలమారుతుంది. తిలోత్తమ్మ పట్టుకెళ్లిన బెలూన్ వల్లే ఇలా జరిగిందని డమ్మక్క చెప్తుంది. దీంతో అందరూ ఆలోచనలో పడతారు.
మరోవైపు ఎవరూ చూడకుండా వల్లభ నాగులాపురం పెట్టెను బయటకు తీసుకొస్తాడు. ఇక తిలోత్తమ పొడి కలిపిన బెలూన్‌ను ఆ పెట్టె మీద పెడుతుంది. అఖండ స్వామి ఇచ్చిన పొడి మహిమ వల్ల ఆ బెలూన్ ఎగిరి నయని వాళ్ల ఇంట్లోకే వెళ్తుంది. బెలూన్ ఎగురుకుంటూ లోపలికి రావడం చూసి అందరూ షాక్ అవుతారు. ఏంటి ఇలా బెలూన్ వస్తుందని నయని అడిగితే.. అది గాయత్రీ పెద్దమ్మ జాడ చెప్తుంది అని వల్లభ అంటాడు. దీంతో మరోసారి అందరూ షాక్ అవుతారు. తమాషా చేస్తున్నారా అని నయని అడిగితే.. నిజంగానే గాయత్రీ అక్కయ్య జాడ చెప్తుంది అని తిలోత్తమ అంటుంది. ఇక ఆ బెలూన్ ఎగురు కుంటూ వెళ్లి తిలోత్తమ ఫొటోను తాకుతుంది. అలా ఎలా జరిగింది అని విశాల్ అడిగితే.. తిలోత్తమ అఖండ స్వామిని కలిసి తీసుకున్న పొడి గురించి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.