Cyclone Michaung Latest News: నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్నటువంటి దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ వద్ద కేంద్రీకృతమై వున్న తీవ్ర తుఫాను (MIGJAUM) నిన్న మధ్యాన్నం 12.30-13.30 గంటలకు బాపట్ల సమీపంలో దక్షిణ ఆంధ్ర తీరాన్ని దాటి తర్వాత 15.30 గంటలకు తుఫానుగా బలహీనపడింది. తర్వాత ఈ తుఫాను ఉత్తరదిశలో కదిలి తీవ్ర వాయుగుండంగాను తర్వాత 05.30 గంటలకు వాయుగుండంగా బలహీనపడి ఉత్తర తెలంగాణ, దానికి అనుకొనిఉన్న ఛత్తీస్ గఢ్ ప్రాంతంలో కేందృకృతమై ఉంది. తదుపరి ఈ రోజు 08.30 గంటలకు మరింత బలహీనపడి అల్పపీడన ప్రాంతంగా దక్షిణ ఛత్తీస్ గఢ్, దక్షిణ ఒడిశా ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది.
ఈ అల్పపీడన ప్రాంతం నుండి ఉత్తర తెలంగాణ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి ఏర్పడింది. ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు ఉత్తర దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast):
ఈ రోజు తెలంగాణా రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రాష్ట్రంలో తెలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడఅక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి పొడి వాతవరణం ఏర్పడే అవకాశం ఉంది.
వాతావరణ హెచ్చరికలు (weather warnings)
ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30-40 కి.మీ)తో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఏపీలో తుపాను ప్రభావం తగ్గిపోయిందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.
రాయలసీమలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈ పరిస్థితి ఉండవచ్చు. చాలా చోట్ల వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది.