Chanakya Niti In Telugu:  భార్యాభర్తల బంధం మూడుముళ్ల దారంతో ముడిపడి ఉందని భావించినప్పటికీ, ఆ దార బంధం చాలా బలంగా పరిగణిస్తారు. కాలం గడిచే కొద్దీ లేదా రోజులు గడిచే కొద్దీ ఈ బంధం మరింత బలపడుతుంది. ఆచార్య చాణక్యుడు కూడా భార్యాభర్తల సంబంధాన్ని లోతుగా అధ్యయనం చేసి తత్వశాస్త్రంలో తన అనుభవాలను వ్యక్తపరిచాడు. చాణక్య నీతి ప్రకారం,  వైవాహిక జీవితంలో సంతోషాన్ని పొందాలంటే, భార్యాభర్తలు కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా వ్య‌వ‌హ‌రించాలి. ముఖ్యంగా భార్యకు భర్త ప్రవర్తన చాలా ముఖ్యం. భర్త తన భార్య పట్ల ప్రేమకు, గౌరవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ఆచార్య చాణక్యుడు చెప్పారు. భార్య విష‌యంలో భర్త ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?


1. భార్యను అగౌరవపరచవద్దు


ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, భర్త తనకు లభించే గౌరవం తన భార్యకు కూడా ఇవ్వాలని గుర్తుంచుకోవాలి. మీకు, మీ భార్యకు మధ్య ఎలాంటి వివక్ష ఉండకూడదు. ఎందుకంటే ఒకరినొకరు గౌరవించుకోవడం ద్వారా మాత్రమే ఈ బంధం దృఢంగా,  లోతుగా మారుతుంది.


Also Read : పెళ్లికి ముందే ఈ నాలుగు విషయాలపై క్లారిటీ తెచ్చుకోవడం మంచిది


2. కష్ట సమయాల్లో భార్య అభిప్రాయం


కష్టాలు లేదా ఇబ్బందులు వ‌చ్చిన‌ప్పుడు పురుషులు తమ భార్యల నుంచి సలహా తీసుకోవడం చాలా ముఖ్యమైన విష‌యంగా భావించరు. ఇది పూర్తిగా తప్పు ఎందుకంటే భార్య ఎల్లప్పుడూ తన భర్త సమస్యలను ప‌రిష్క‌రించేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి, మీరు ఏదైనా సంక్షోభంలో లేదా ఇబ్బందుల్లో ఉంటే, ఆ సందర్భంలో మీరు మీ భార్య నుంచి సలహా తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల బంధంలో సామరస్యం పెరిగి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.


3. భార్యను ఇతరుల ముందు దుర్భాషలాడవద్దు        


చాలా సార్లు పురుషులు తమ భార్యలను ఎప్పుడు ఎక్కడ కోపం వచ్చినా తిట్టడం మొదలు పెడతారు. భార్యాభర్తలు ఇతరుల ముందు గొడవ పడకూడదని మన మత గ్రంధాలలో పేర్కొన్నారు. భర్త తన భార్యను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఎవ‌రి ముందు దూషించకూడదని, అవమానించకూడదని చాణక్యుడు చెప్పాడు. మీ భార్య ఏదైనా తప్పు చేస్తే, ఆమెను తిట్టడం కంటే, చేసిన‌ తప్పు ఆమెకు అర్థం అయ్యేలా చెప్పేందుకు ప్రయత్నించండి. వైవాహిక జీవితంలో ఇలా చేయడం ద్వారా మాత్రమే ఆనందాన్ని పొందవచ్చ‌ని ఆచార్య చాణ‌క్యుడు తెలిపాడు.


Also Read : ఓదార్పు అంటే ఇదీ - ద్రౌపదీ వస్త్రాపహరణం తర్వాత శ్రీకృష్ణుడు-ద్రౌపది మధ్య జరిగిన సంభాషణ అత్యంత ఆసక్తికరం


చాణ‌క్య నీతి ప్రకారం, భర్త తన భార్యకు సంబంధించి పైన పేర్కొన్న అన్ని దశలను అనుసరించాలి. భర్త వీటిని పాటించినప్పుడే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.