నెల్లూరు రూరల్ ఎమ్మెల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజమండ్రి వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలను కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఆదిరెడ్డి కుటుంబం మీద ప్రభుత్వం పెట్టిన కేసులు అక్రమ కేసులని అన్నారు. ఈకేసులన్నీ అక్రమమేనని ఏ మాత్రం మంచిది కాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి తానిచ్చే సలహా ఒక్కటేనని, ప్రభుత్వాలు అధికారంలో ఉండేది ప్రజలకు మేలు చేయడానికేనని, రాజకీయ కక్షసాధింపులకు పాల్పడకూడదన్నారు. రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే ఆదిరెడ్డి కుటుంబం మీద కేసులు పెట్టడం దుష్టసాంప్రదాయాల్లో భాగమేనన్నారు. ప్రజాస్వామ్యంలో దుష్టసాంప్రదాయాలు సంప్రదాయాలుగా మారితే శ్రేయస్కరం కాదన్నారు. రాజ్యాధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. ప్రజలు కచ్చితంగా గమనిస్తున్నారని, ప్రజలు చెప్పాల్సిన చెబుతారాన్నరు.


తానింకా ఇంకా ఏ పార్టీలోనూ చేరలేదు.. 


ప్రభుత్వం కేసులు బనాయించినప్పడు గోదావరి జిల్లాల్లో ఎవ్వరిని అడిగినా సక్రమ కేసులా అక్రమ కేసులా అన్నది చెబుతారన్నారు. అధికారికంగా తాను ఇంకా ఏ పార్టీలోకి చేరలేదని, ప్రస్తుతానికి వైసీపీకు దూరం జరిగి నాలుగు నెలలవుతోందని, వైసీపీ తనను సస్పెండ్‌ చేసి నెల అవుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, ప్రజాసమస్యలు పరిష్కారం ఉండాలి అంతే కానీ అధికారం చేతుల్లో ఉందని పడని వారందరిపైనా కేసులు పెట్టి వేధిస్తాననడం దుష్టసంప్రదాయం అన్నారు. ఇది ఎవ్వరికీ మంచిది కాదన్నారు. 


రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాలి..
రాష్ట్రానికి రాజధాని ఒక్కటే ఉండాలని, రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని అన్నారు. రాష్ట్రం రెండుగా ముక్కలయిన తరువాత ఆనాడు చంద్రబాబు నాయుడు  సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదన్నారు. అమరావతి ఒక వారసత్వ, సాంస్కృతిక కేంద్రమని, చంద్రబాబు రాష్ట్ర శాసన సభలో చర్చకు పెట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా ప్రకటించారన్నారు. అధికారులు అధికారానికి దాసోహం కాక నిజాయితీగా పనిచేయాలన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు పరామర్శకు వస్తుంటే అడ్డుకునే ప్రయత్నం సరికాదన్నారు.