Chanakya Neeti In Telugu :  చాణక్య నీతి జీవితానికి సంబంధించి ఎన్నో విషయాలను బోధిస్తుంది.  చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి మాటలు, ప్రవర్తన తన కుటుంబం గౌర‌వ ప్ర‌తిష్ఠ‌ల‌తో పాటు  కీర్తిని పెంచుతాయి. జీవితంలో ఆనందమే కాకుండా మనిషి విజయవంతమవడానికి కావల్సినవి చాలా ఉన్నాయని చాణ‌క్యుడు పేర్కొన్నాడు. ఈ ఆలోచనలు వ్యక్తి మెరుగైన జీవితాన్ని గడపడానికి, లక్ష్యాన్ని సాధించడానికి సహాయపడతాయి. 


అంత‌ర్గ‌త శుభ్రత‌
అన్ని కాలాల్లో మొక్కలు మొలకెత్తితే వసంతం ఉండ‌దా..? పగటిపూట గుడ్లగూబ కనిపించకపోతే ఇక‌ సూర్యుడు అస్త‌మించ‌డ‌ని చెప్పగలరా..? వర్షం పడలేదంటూ మేఘాలను నిందించడం ఎంత వరకు న్యాయం..? అందువ‌ల్ల‌.. మన అంతరంగంలో లేని ఆలోచ‌న‌ను, మన అంతరంగంలో త‌లెత్తిన ఊహ‌ను మార్చగలమా..? అని చాణక్యుడు ప్ర‌శ్నిస్తాడు. మన అంతరంగం మారినప్పుడే మనలో మార్పు సాధ్య‌మ‌ని... కాబట్టి, ముందుగా మ‌న మ‌న‌స్సును శుభ్రంగా ఉంచుకోవాల‌ని  చెప్పాడు.


Also Read : మీరు ఇలా చేస్తే, ధనం వద్దన్నా మీ ఇంట్లో తిష్టవేస్తుంది


మంచి అలవాట్లు
చాణక్య నీతి ప్రకారం, ఒక వ్యక్తి ప్రవర్తన అతని కుటుంబం కీర్తి, నాశనం, మనుగడకు బాధ్యత వహిస్తుంది. ఒక వ్యక్తి కీర్తి అతని ప్రవర్తనకు సంబంధించినది. మంచి నడవడిక ఉన్న వ్యక్తిని సమాజం గౌరవిస్తుంది. ఆ వ్యక్తితో పాటూ కుటుంబ ప్రతిష్ట కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి ప్రవర్తనను త‌న మాట‌ల‌ ద్వారా నిర్ణయిస్తారు. అందుకే ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


ఇలా జీవించాలి
ఆచార్య చాణక్యుడు ప్రకారం, ఒక మంచి కుటుంబంలోని యువ‌తిని వివాహం చేసుకోవాలి. దీంతో పాటు పిల్లలకు మంచి చదువులు చెప్పించాలి. అలాగే, ధ‌ర్మ సంబంధిత‌ కార్యక్రమాలలో స్నేహితులతో క‌లిసి పాల్గొనాలి. 


వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి
ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ చెడు వ్యక్తుల పట్ల మనం ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. విషపూరిత పాములతో సహవాసం కంటే చెడ్డవారితో సహవాసం ప్ర‌మాద‌క‌రంగా ఉంటుందని తెలిపాడు. పాములకు హాని చేసినప్పుడు మాత్రమే అవి మనల్ని కాటేస్తాయి. కానీ, చెడ్డ వ్యక్తులతో సహవాసం అంటే మన జీవితంలోని ప్రతి దశలో సమస్యలు కోరి తెచ్చుకున్న‌ట్టేన‌ని హెచ్చ‌రించాడు.


Also Read : విజ‌య‌వంత‌మైన వ్యాపార‌వేత్త‌ కావాలంటే ఈ లక్షణాలు త‌ప్ప‌నిస‌రిగా ఉండాలి!


వారితో సహవాసం చేయండి
ఆచార్య చాణక్యుడి ప్రకారం, రాజు ప్రత్యేకత ఏంటంటే తను మంచి కుటుంబం, గుణాలు ఉన్న వ్యక్తులను తన చుట్టూ ఉంచుకుంటాడు. ఎందుకంటే అలాంటి వ్యక్తులు ఎంత విపత్కర పరిస్థితి వచ్చినా అర్ధవంత‌ంగా వదిలిపెట్టరు. అలాంటి వారు ఆ రాజుతో ఎప్పుడూ ఉంటారు. అందువ‌ల్ల తాను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా లేదా సంతోషకరమైన స్థితిలో ఉన్నా వారిని ఎప్పుడూ వదులుకోడు. అలాగే మంచి న‌డ‌వడిక ఉన్న‌వారితో స్నేహ సంబంధాలు కొన‌సాగిస్తూ వారితో జీవితాంతం క‌లిసి ఉండాల‌ని చాణ‌క్యుడు సూచించాడు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.