Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ప్రముఖ దౌత్యవేత్త, విజయవంతమైన ఆర్థికవేత్త. ఆయ‌న‌ తన జీవిత అనుభవాల నుంచి అనేక అంశాల‌ను క్రోడీక‌రించి చాణక్య నీతిని రూపొందించాడు. దీనిలో మ‌న‌కు మెరుగైన జీవితం, విజయాన్ని సాధించడానికి అనేక‌ నియమాలు వివ‌రించాడు. దీని వల్ల మీరు జీవితంలో ఉన్న‌త‌ స్థానానికి చేరుకోవ‌చ్చు. ఆచార్య చాణక్యుడి ఈ సూత్రాలను అనుసరించి ఎంతో మంది ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని నేడు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా గుర్తింపు పొందారు. మీరు కూడా విజయవంతమైన వ్యాపారవేత్త కావాలనుకుంటే, ఆచార్య చాణక్యుడు చెప్పిన‌ ఈ విషయాలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. 


1. స‌వాళ్ల‌ను అంగీకరించే సామర్థ్యం
ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, మీరు మీ వ్యాపారంలో విజయం సాధించాలంటే, మొదట మీరు స‌వాళ్ల‌ను అంగీక‌రించే ధైర్యం కలిగి ఉండాలని గుర్తుంచుకోండి. వ్యాపారంలో హెచ్చు తగ్గులు ఉన్న‌టువంటి పరిస్థితిలో, మీరు ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే, మిమ్మ‌ల్ని విజయం సాధించ‌కుండా ఎవరూ ఆపలేరు. 


Also Read : జీవితంలో చేసే ఈ 2 తప్పుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేరు


2. ఎక్కడైనా పని చేయడానికి సిద్ధం
ఆచార్య చాణక్య ఉపాధ్యాయుడు మాత్రమే కాదు, విజయవంతమైన ఆర్థికవేత్త. వ్యాపారాన్ని లోతుగా అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనం ఆధారంగా, ఆయ‌న‌ వ్యాపారానికి సంబంధించిన కొన్ని మెల‌కువ‌లను ప్రజలకు నేర్పడానికి ప్రయత్నించాడు. మంచి వ్యాపారవేత్త ప్రపంచంలోని ఏ మూలలోనైనా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉండాలని ఆచార్య చాణక్య చెప్పాడు. అతను స్థలం ఎంపిక చేసుకుని పని చేయడానికి సాహసించకూడదు. ఏ ప్రదేశమైనా పనిచేసి జయించ‌గ‌ల‌న‌నే ఆశ ఉండాలి. అలాంటి వారు తమ పనిలో ఎల్లప్పుడూ విజయం సాధిస్తారు.


3. ఆక‌ట్టుకునే మాట‌తీరు           
వ్యాపారవేత్త ప్రవర్తన చాలా ముఖ్యమైనది. సమర్థ ప్రవర్తన కలిగిన వ్యక్తి వ్యాపార రంగంలో త్వరగా విజయం సాధిస్తాడు. అందుకే వ్యాపారం చేస్తున్నప్పుడు మాటలపై నియంత్రణ, విషయాలను అర్థం చేసుకున్న తర్వాత తదుపరి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండాలి. విషయాలు విని వాటిని అర్థం చేసుకున్న తర్వాత స్పందించే వ్యక్తి వ్యాపారంలో ఖచ్చితంగా విజయం సాధిస్తాడు. అందుకే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉండటానికి ఆక‌ట్టుకునే మాట‌తీరు ​​ఉండటంతో పాటు ఎదుటివారి అవ‌స‌రాల‌ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.


Also Read : ఈ 5 నియ‌మాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు ఎప్ప‌టికీ మీ ద‌రిదాపుల‌కి రావు!


పైన పేర్కొన్న లక్షణాలను కలిగి ఉన్న ఏ వ్యవస్థాపకుడు లేదా వ్యాపారవేత్త అయినా తప్పనిసరిగా అతని పరిశ్రమ లేదా వ్యాపారంలో అభివృద్ధిని పొందుతాడు. మీరు కూడా విజయవంతమైన వ్యవస్థాపకులు కావాలనుకుంటే, ఈ లక్షణాలన్నింటినీ మీలో పెంపొందించుకోండి. 


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.