Chanakya Niti on Success: జీవితంలో సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. ముఖ్యంగా లక్ష్యం నిర్దేశించుకున్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సమస్యలను ఎదుర్కొంటారు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మన లక్ష్యం ఎంత చిన్న‌దైనా, పెద్దదైనా మనం ఎక్కువ సమస్యలను ఎదుర్కొంటామని చెప్పాడు. తన లక్ష్యాన్ని సాధించే మార్గంలో ఎదురయ్యే అన్ని సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే వ్యక్తి, జీవితంలో ఏదో ఒక రోజు గొప్ప విజయాన్ని పొందుతాడని స్ప‌ష్టంచేశాడు.


లక్ష్యాన్ని సాధించాలంటే దృఢ సంకల్పం, కఠోర శ్రమ అవసరం. అయితే దానితో పాటుగా మనం కొన్ని ప్రత్యేక విషయాలపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మన జీవితంలో మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం పెద్ద మార్పున‌కు దారి తీస్తుంది. మన లక్ష్యాలను సాధించేందుకు కొన్ని తప్పులు చేయకూడదని చాణ‌క్యుడు వెల్ల‌డించాడు. అవి ఏమిటో చూద్దాం.


1. లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకండి


"మనసా చింతితం కార్యం వచసా న ప్రకాశయేత్"
మంత్రేణ రక్షేద్ గూఢాం కరీయం చాపి నియోజీత్||''


Also Read : మీ స్నేహితుల గుణ‌గ‌ణాలు తెలుసా? మీ జీవితంలో ఎలాంటి స్నేహితుడిని చివ‌రి వ‌ర‌కు ఉంచుకోవాలి?


ఆచార్య చాణక్యుడి ప్రకారం, మనం విజయం సాధించాలంటే దానికి కృషి, ప్రణాళిక, సమయపాలన అవసరం. ఇది కాకుండా, విజయం సాధించడానికి చాణక్యుడు ఒక ప్రత్యేక సమాచారాన్ని అందించాడు. అంటే జీవితంలో విజయం సాధించాలంటే మన లక్ష్యం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఎందుకంటే శత్రువు ఎల్లప్పుడూ మనకు వ్యతిరేకంగా ప‌నిచేయ‌డానికి ప్రయత్నిస్తాడు. అలాంటప్పుడు, మన లక్ష్య సాధన గురించి మనం తెలియ‌జేసినప్పుడు, వారు మన లక్ష్యాన్ని నాశనం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


మీ శత్రువు మీ లక్ష్యం గురించి తెలుసుకుంటే, అతను లక్ష్యాన్ని సాధించడంలో మీకు సమస్యలను, అడ్డంకులను క‌ల్పించ‌వచ్చు. మీ లక్ష్యాన్ని సాధించడానికి మీరు రూపొందించుకున్న‌ ప్రణాళికలు, నిర్ణయాల గురించి ఎక్కడా చెప్పవద్దని, లక్ష్యం సాధించే వరకు రహస్యంగా ఉంచాలని చాణక్యుడు చెప్పాడు.


2. లక్ష్యం నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గకండి


"ప్రభూతాం కార్యమల్పంవతాన్నరః కర్తుమిచ్ఛతి|
సర్వరంభేన తత్కార్యం సింహదేకంప్రచక్షతే||''


ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు లక్ష్య సాధన కోసం తహతహలాడే వ్యక్తిని సింహంతో పోల్చాడు. ఈ శ్లోకం ప్రకారం, సింహం తన వేటను చూసి వెనక్కి తగ్గనట్లే, లక్ష్యాన్ని సాధించాలనుకునే వ్యక్తి తన లక్ష్యం నుండి ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గకూడదని ఈ శ్లోకం ద్వారా చాణక్యుడు చెప్పాడు.


Also Read : పురుషుల పతనానికి కారణం ఈ నాలుగు అలవాట్లే!


చాణక్యుడు ప్రకారం, ఎవరైతే తన జీవితంలో ఈ రెండు అంశాలపై ఎక్కువ శ్రద్ధ వహిస్తారో, ఆ వ్యక్తి తన లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తాడు. లక్ష్య సాధనకు పై రెండు ఆలోచనలు చాలా ముఖ్యమైనవి.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.