Horoscope Today 2023 August 15th
మేష రాశి 
ఈ రోజు ఈ రాశివారికి హెచ్చుతగ్గులతో ఉంటుంది. అనారోగ్య సమస్యలకు సంబంధించి వైద్యులను సంప్రదిస్తారు. కొన్ని సామాజిక కార్యక్రమాల్లో  పాల్గొనే అవకాశం పొందుతారు. అపరిచిత వ్యక్తులతో ఎక్కువ సంప్రదింపులు చేయొద్దు. పిల్లలతో మంచి సమయం గడుపుతారు. 


వృషభ రాశి
ఈ రోజు ఈ రాశివారు గుడ్ న్యూస్ వింటారు. రోజంతా సంతోషంగా ఉంటారు. నూతన ఒప్పందాలేమైనా కుదుర్చుకోవాలి అనుకుంటే వ్యాపారులు ఆచితూచి అడుగేయాలి. ఏదైనా విషయంలో తండ్రితో వివాదం ఉండొచ్చు. పెద్దల మాట పరిగణలోకి తీసుకోవాలి. ఎదుటివారి గురించి బాగా ఆలోచిస్తారు. మీ చుట్టూ కొందరు చెడు వ్యక్తులున్నారు జాగ్రత్త. 


మిథున రాశి
ఈ రాశివారికి ఈ రోజు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటారు. స్నేహితుల మధ్య వివాదం ఉండొచ్చు. భాగస్వామ్యంతో చేసే పనులు కలిసొస్తాయి. ముఖ్యమైన విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.


కర్కాటక రాశి
ఈ రోజు మీరు ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళతారు. రోజంతా సంతోషంగా ఉంటారు. కొత్త ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేయాలనే కల నెరవేరుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు అందుతాయి. కొన్ని ప్రత్యేకమైన పనులు పూర్తిచేసే ప్రయత్నంలో ఉంటారు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసొస్తాయి. 


Also Read: ఆగష్టు 17 నుంచి శ్రావణం ప్రారంభం, ఈ నెలలో ప్రతి రోజూ ప్రత్యేకమే!


సింహ రాశి
ఈ రోజు ఈ రాశివారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. మిత్రులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. అడకుండా ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు.  మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల విషయంలో కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కొన్ని పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది


కన్యా రాశి 
ఈ రాశివారు ఈ రోజు వ్యాపారంలో తప్పుడు పెట్టుబడులు పెట్టొద్దు.  ఉద్యోగులు సహోద్యోగులపై కోపం తెచ్చుకోవద్దు. రోజంతా సంతోషంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీరు చేసిన తప్పులను ఒప్పుకోవడమే మంచిది 


తులా రాశి
ఈ రోజు ఈ రాశివారు ఆర్థిక వ్యవాహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు తీసుకోవద్దు, ఇవ్వొద్దు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆహారంపై నియంత్రణ కొనసాగించాలి. ఓ గుడ్ న్యూస్ వినే అవకాశం ఉంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలున్నాయి. 


వృశ్చిక రాశి
 ఈ రాశివారికి ఈ రోజు బాగానే ఉంటుంది. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. పిల్లలతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. ఏదైనా చట్టపరమైన విషయంలో మీరు కొంత నష్టాన్ని భరించవలసి రావచ్చు. చిరాకు స్వభావం, కోపం తగ్గించుకోవడం మంచిది. మీ మనసు ఉద్విగ్నంగా ఉంటుంది. 


ధనుస్సు రాశి
ఈ రోజు  మీరు కొంత నిరుత్సాహంగా ఉంటారు. చట్టపరమైన విషయం గురించి ఆందోళన చెందేపరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగుతుంది. మీ ఆరోగ్యంలో కొనసాగుతున్న హెచ్చు తగ్గుల గురించి మీరు కొంచెం ఆందోళన చెందుతారు. మీకు ఏ పని చేయాలనే భావన ఉండదు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు.


Also Read: ఆగష్టు 14 నుంచి 20 వారఫలాలు: ఈ వారం ఈ రాశివారు ఒకేసమయంలో గుడ్ న్యూస్-బ్యాడ్ న్యూస్ రెండూ వింటారు!


మకర రాశి 
ఈ రాశివారి దృష్టి ఆధ్యాత్మిక విషయాలవైపు మళ్లుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయం. స్నేహితులు, కుటుంబ  సభ్యుల నుంచి పూర్తి మద్దతు పొందుతారు. మీ మాటలు, ప్రవర్తనపై సంయమనం పాటించడం మంచిది 


కుంభ రాశి 
ఈ రోజు  ఈ రాశివారు ప్రజా సంక్షేమ పనులపై పూర్తి ఆసక్తిని కలిగి ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. ఏ పనైనా ఆలోచించి చేస్తారు. అవనసరమైన టెన్షన్ ఉంటుంది. ఏదో ప్రమాదం జరగబోతోందనే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. డబ్బు అప్పుగా ఇచ్చినట్టైతే మీరు నష్టపోయినట్టే. 


మీన రాశి
ఈ రోజు ఈ రాశివారు కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు. పనిచేసే రంగంలో మీరు చేసే నూతన ప్రయత్నాలు కలిసొస్తాయి, మంచి ఫలితాలనిస్తాయి.  తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో రిస్క్ తీసుకోవద్దు. మీ రహస్య విషయాలను బయటపెట్టవద్దు.